కథానాయికలు పెళ్లి తర్వాత నటించకూడదని నిబంధన ఏదీ లేదు. గతంలో పెళ్లి అయిన కథానాయికలకు అవకాశాలు వచ్చేవి కావు. అయితే, ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. హిందీలో దీపికా పదుకోన్, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్ వంటి కథానాయికలు ట్రెండ్ మార్చారు. మరి, నయనతార సంగతి ఏంటి?


Nayanthara Vignesh Shivan Wedding: జూన్ 9న (గురువారం) ఉదయం ఎనిమిది, ఎనిమిదిన్నర ప్రాంతంలో నయనతార, తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ వివాహ బంధంతో ఒక్కటి అవుతారు. పెళ్లి తర్వాత శ్రీమతి కానున్న నయన్, నటనకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారట. 


Nayanthara Upcoming Movies: ప్రస్తుతం నయనతార చేతిలో కొన్ని సినిమాలు ఉన్నాయి. హిందీలో షారుఖ్ ఖాన్ 'జవాన్', తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్', మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ 'గోల్డ్', తమిళంలో 'ఓ 2', 'కనెక్ట్' సినిమాలు చేస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత కొత్త సినిమాలకు 'ఎస్' చెప్పకూడదని డిసైడ్ అయ్యారట.


Vighnesh Shivan Mother Conditions To Nayanthara: పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని నయనతారకు విఘ్నేష్ శివన్ తల్లి కండిషన్ పెట్టారట. అందుకని, నటనకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారట. అయితే, నిర్మాతగా కంటిన్యూ అవ్వాలని అనుకుంటున్నారట. 


Also Read: టాలీవుడ్‌ను పక్కన పెట్టిన నయనతార - తెలుగు సినీ ప్రముఖులకు శుభలేఖలు ఎక్కడ? పిలుపులు ఏవి?


విజయ్ సేతుపతి, సమంతతో నటించిన 'కన్మణి ఖతీజా రాంబో' సినిమా నిర్మాతల్లో నయనతార కూడా. కాబోయే భర్తతో కలిసి తమిళంలో సినిమాలు నిర్మించారు. పెళ్లి తర్వాత కూడా సినిమాలు ప్రొడ్యూస్ చేయాలని అనుకుంటున్నారట. ఇందులో నిజం ఎంత? అనేది కొన్ని రోజుల్లో తెలుస్తుంది.


Also Read: Vignesh Shivan Nayanthara Wedding Card: నయనతార పెళ్లి శుభలేఖ చూశారా? వైరల్ వెడ్డింగ్ కార్డ్