గతంలో సోషల్ మీడియా లేని కారణంగా ఎంతో మంది దగ్గర అదిరిపోయే టాలెంట్ ఉన్న జనాలకు తెలిసేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు.. టాలెంట్ ఏ మూలన ఉన్నా.. సోషల్ మీడియా వారిని జనాల ముందు ఉంచుతోంది. ఓవర్ నైట్ సెలబ్రిటీలను చేస్తుంది. అలా రాత్రికి రాత్రే మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్లు ఎంతో మంది ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సోషల్ మీడియా వేదికగా చాలా మంది సెలబ్రిటీ హోదా సాధించారు. వారిలో ఒకడు షణ్ముఖ్ జశ్వంత్. నటన, డ్యాన్స్, కామెడీకి సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి మంచి ఆదరణ దక్కించుకున్నాడు. నెమ్మదిగా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. మంచి పాపులారిటీ సంపాదించుకున్న ఈ కుర్రాడికి గత కొద్ది రోజులుగా వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. తాజాగా షణ్ముఖ్ హాస్పిటల్ పాలయ్యాడు.  


వరుస ఎదురు దెబ్బలు 
బిగ్ బాస్ పుణ్యమా అని సిరితో లవ్ ట్రాక్ నడిపి.. తన అసలు గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనాను వదులుకోవాల్సి వచ్చింది. ప్రియురాలికి దూరమై గట్టి ఎదురు దెబ్బతిన్నాడు. కొద్ది రోజులుగా సరైన సక్సెస్ కూడా లేదు. ఇదే సమయంలో ఆయన హాస్పటల్లో చేరాడు. ఏం జరిగిందోనని ఆయన అభిమానులు ఆందోళన పడుతున్నారు. ఇటీవల షణ్ముఖ్ ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ అనే వెబ్ సిరీస్ చేస్తున్నాడు. జిమ్ లో బాగా వ్యాయామం చేస్తున్నాడు. వరుసగా షూటింగులకు వెళ్తున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ.. తాజాగా హాస్పిటల్ బెడ్ మీద కనిపించాడు. ఈ ఫోటోను తనే స్వయంగా షేర్ చేశాడు. ఇందులో తను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. “పుట్టినరోజు నెల ఇది.. దిష్టి తగిలినట్లుంది” అని తను షేర్ చేసిన ఫోటోకు క్యాప్షన్ రాశాడు. చాలా మంది ఆయనకు ఏం జరిగిందని ఆరా తీశారు. తాజాగా అతడు మరో సెల్ఫీ తీసుకుని ఇన్ స్టాలో పోస్టు చేశాడు. ప్రస్తుతం ”కొద్దిగా కోలుకున్నాను” అని రాశాడు.  
కాలేజీ డేస్ నుంచే షార్ట్ ఫిల్మ్స్.. 
ఇక షణ్ముఖ్ గురించి మాట్లాడుకుంటే… తన కాలేజీ రోజుల్లోనే కొన్ని షార్ట్ ఫిల్మ్స్ లో నటించాడు. వాటితో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత డ్యాన్స్ వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, వెబ్ సిరీస్‌ లో లీడ్ రోల్స్ చేసి మంచి ఆదరణ పొందాడు. నెటిజన్ల నుంచి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. యూట్యూబర్ గా మంచి పాపులారిటీ అందుకున్నాడు. నెమ్మదిగా  బిగ్ బాస్ షో 5వ సీజన్ లో పాల్గొనే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కొద్ది రోజుల పాటు టైటిల్ విన్నింగ్ అవకాశాలు ఇతడికే ఉన్నాయి అనేలా తన ఆట తీరు కనబర్చాడు. కానీ, సిరి హన్మంత్‌ తో ఈయన ఆడిన ఆటతీరు మైనస్ గా మారింది. ఇదే కారణంతో తన గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునైనా దూరం అయ్యింది. బ్రేకప్ తో కాస్త ఇబ్బంది పడిన షణ్ముఖ్.. కొంచె బ్రేక్ తీసుకుని మళ్లీ కెరీర్ మీద ఫోకస్ చేశాడు. 'ఏజెంట్ ఆనంద్ సంతోష్' అనే వెబ్ సిరీస్ లో పాల్గొంటున్నాడు. ఈ సిరీస్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా స్ట్రీమింగ్ చేస్తోంది. ఈ సిరీస్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది.