హీరోయిన్ రుహానీ శర్మ (Ruhani Sharma) గుర్తు ఉన్నారుగా! సుశాంత్ 'చిలసౌ' సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత విశ్వక్ సేన్ జోడీగా 'హిట్' సినిమాలో నటించారు. హిట్ అందుకున్నారు. ఇంకా 'డర్టీ హరి', 'నూటొక్క జిల్లాల అందగాడు' సినిమాల్లోనూ, ఇటీవల ఓటీటీలో విడుదలైన 'మీట్ క్యూట్' యాంథాలజీలో కూడా నటించారు. ఇప్పుడు ఆమె ఓ ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్నారు. 


రుహాని పోలీస్‌గా 'HER'   
రుహానీ శర్మ ప్రధాన పాత్రలో రూపొందిన మహిళా ప్రాధాన్య సినిమా 'హర్' (HER Telugu Movie). తెలుగులో చెప్పాలంటే... 'ఆమె'. 'హిట్'లో విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్ రోల్ చేస్తే... అతడికి జోడీగా రుహని కనిపించారు. ఇప్పుడు ఆమె పోలీస్ రోల్ చేయడం విశేషం.
 
HER... ఓ సస్పెన్స్ థ్రిల్లర్!
శ్రీధర్ స్వరగావ్ రచన, దర్శకత్వంలో ఈ సినిమా రూపొందితోంది. డబుల్ అప్ మీడియాస్ సంస్థ తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రమిది. రఘు సంకురాత్రి, దీప సంకురాత్రి నిర్మాతలు. తాజాగా రుహానీ శర్మ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అని దర్శక నిర్మాతలు చెప్పారు. త్వరలో టీజర్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నామని తెలిపారు. 


''ఇప్పుడు మేల్, ఫిమేల్ ఫిలిమ్స్ అని తేడా లేదు. ప్రేక్షకులు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఆదరిస్తున్నారు. ఆ కోవలో మా సినిమా కూడా చేరుతుంది. ఇందులో రుహని పోలీస్ అయినప్పటికీ... ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్ అయినా... అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఈ తరహా సినిమా రాలేదు. సినిమాలో రుహాని చాలా కొత్తగా కనిపిస్తారు'' అని దర్శకుడు శ్రీధర్ చెప్పారు.


Also Read : అస్మిత వెబ్ సిరీస్ @ 59 రూపాయలు


'హర్' ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే... ఓ లేడీ పోలీస్ ఆఫీసర్ నగరంలో జరిగిన క్రైమ్ గురించి చేసే ఇన్వెస్టిగేషన్ అని అర్థం అవుతోంది. పోస్టర్‌లో రుహానిని హైలైట్ చేశారు. ఆమె కంటతడి... ఆ వెనక హైవే, సిటీ పరిసరాలు సినిమాలోని వైవిధ్యాన్ని తెలుపుతున్నాయి. దీనికి సీక్వెల్ కూడా ఉందని సమాచారం. ఈ సినిమాకు విష్ణు బేసి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా... చాణక్య తూరుపు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. పవన్ సంగీతం అందిస్తున్నారు.