Pawan Kalyan Harihara Veeramallu: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న మూడు సినిమాల్లు ముందుగా రిలీజ్ అవుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’. 2025 మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, కన్నడం, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రత్యేక పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. అలాగే ఫస్ట్ సింగిల్ అప్‌డేట్ కూడా ఇచ్చారు. ఈ పాట పాడింది ఎవరో తెలిస్తే ఫ్యాన్స్ షాక్ అవ్వడం ఖాయం.
‘కొడకా కోటేశ్వర్రావా’ తర్వాత...
పవర్ స్టార్ పవన్ కళ్యాణే ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ స్వయంగా పాడారట. ఈ విషయాన్ని చిత్రబృందం స్వయంగా తెలిపింది. త్వరలో ఈ పాటను విడుదల చేస్తామని మేకర్స్ ఈ సందర్భంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ చివరిగా ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కొడకా కోటేశ్వర్రావా అనే పాట పాడారు. అంతకు ‘అత్తారింటికి దారేది’లో సూపర్ హిట్ సాంగ్ ‘కాటమ రాయుడా’, అంతకు ముందు ‘పంజా’లో ‘పాపారాయుడు’ పాటలను కూడా పవన్ కళ్యాణ్ పాడారు. కెరీర్ ప్రారంభంలో కూడా తన సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్‌కి పవన్ కళ్యాణ్ గాత్రదానం చేశారు. దీంతో ఇప్పుడు ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఫస్ట్ సింగిల్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Also Read: మెగాస్టార్ మాస్ సంభవం... ఎగిరే గుర్రంపై చిరు... 'విశ్వంభర' టీజర్ వచ్చిందోచ్
పవన్ సినిమాలు ఏ ఆర్డర్‌లో రిలీజ్ అవుతాయి?
పవన్ కళ్యాణ్ చేతిలో ప్రస్తుతానికి పూర్తి చేయాల్సిన సినిమాలు మూడు ఉన్నాయి. అవే ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దే కాల్ హిమ్ ఓజీ’, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’. వీటిలో మొదటిగా ‘ఓజీ’ విడుదల అవుతుందని అందరూ అనుకున్నారు. 2025 మార్చి చివరి వారంలో ‘ఓజీ’ విడుదల కానుందని నిర్మాత దానయ్య పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు కూడా. కానీ సడెన్‌గా ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ ఫ్రంట్ సీట్ తీసుకుంది. 2025 మార్చి చివరి వారంలో ‘హరిహర వీరమల్లు పార్ట్ 1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ విడుదల కానుంది.
దీంతో ‘ఓజీ’ని వాయిదా వేయడం నిర్మాతలకు తప్పలేదు. 2025 ఆగస్టులో ఇండిపెండెన్స్ డే వీకెండ్ సందర్భంగా ‘ఓజీ’ విడుదల అవుతుందని ప్రస్తుతం వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. పవన్ కళ్యాణ్ కేవలం 20 రోజులు డేట్స్ ఇస్తే ‘ఓజీ’ మొత్తం పూర్తి అయిపోతుందని తెలుస్తోంది. మరి పవన్... సుజీత్‌కు ఎప్పుడు డేట్స్ ఇస్తారో చూడాలి.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాల్లో ఎక్కువ వర్క్ పెండింగ్ ఉన్నది ‘ఉస్తాద్ భగత్ సింగ్’కే. ఈ సినిమాకు సంబంధించి కేవలం ఒక్క షెడ్యూల్ మాత్రమే పూర్తయింది. మరి ఈ సినిమా ఎప్పుటికి పూర్తయ్యేనో చూడాలి.
ఫ్యూచర్ ప్రాజెక్టులు ఏంటి?
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ కొత్త సినిమాలూ ఒప్పుకోవడం లేదు. మరి ఈ మూడు సినిమాల తర్వాత అసలు సినిమాలు చేస్తారో లేదో తెలియదు. ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ తాళ్లూరి నిర్మాణంలో ఒక సినిమాను ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అలాగే ‘హరిహర వీరమల్లు పార్ట్ 2’ కూడా చేయాల్సి ఉంది. ఆ సినిమాలు చేస్తారో లేదో ప్రస్తుతానికి ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read: విశ్వం సినిమా రివ్యూ: కామెడీ బావుంది - మరి, సినిమా? శ్రీను వైట్ల ఈజ్ బ్యాక్ అనొచ్చా?