గుప్పెడంతమనసు ఫిబ్రవరి 2 బుధవారం ఎపిసోడ్


కుటుంబం అంతా కలసి సంక్రాంతి సంబరాల్లో మునిగితేలుతుంటే దేవయాని మాత్రం అందర్నీ చూసు కుళ్లుకుంటుంది. అంతా కలసి పాయసం తింటుంటారు.. ఇంతలో రిషి చేయి తగిలి వసు పాయసం కిందపడుతుంది. ఇంత మంచి టేస్ట్ ఉన్న పాయసం నిన్ను తినకుండా చేశాను  కదా అని బాధపడిపోయిన రిషి..తను తింటున్న పాయసం వసుకి ఇచ్చేస్తాడు. అక్కడున్నవారంతా షాక్ అవుతారు. ఏంటి ఆలోచిస్తున్నావ్ అని రిషి అడిగితే ఏం లేదుసార్ అని చెప్పిన వసు ఆ పాయసం తింటుంది. అటు గౌతమ్ మాత్రం అయ్యో ముందే తినేసాను..మంచి అవకాశం పోగొట్టుకున్నా అని బాధపడిపోతుంటాడు. దేవయాని మాత్రం కోపంగా లేచి వెళ్లిపోతుంది. మహేంద్రని చేయిపట్టుకుని రూమ్ లోకి లాక్కెళ్లిన జగతి..నీకు ఇప్పటికైనా అర్థమైందా.. వసుధారకి రిషి తన పాయసాన్ని షేర్ చేశాడు కదా ..అలా ఎలా ఇస్తారు..తన ఎంగిలి ఎప్పుడూ ఇష్టమైన వారికే ఇవ్వాలనుకుంటారు కదా అంటుంది జగతి. అవును మనం కూడా ఐస్ క్రీం కప్స్ షేర్ చేసుకునే వారం కదా అన్న మహేంద్రతో ... నేను చెబుతున్నదేంటి నీకు అర్థమైందేంటని అంటుంది. రిషి మనసు తెలిసి మసులుకోవాలని చెబుతుంది జగతి. 


Also Read: సౌందర్య ఫ్యామిలీని వెంటాడుతున్న రుద్రాణి, మోనిత… మళ్లీ రంగంలోకి దిగిన డాక్టర్ బాబు.. కార్తీకదీపం బుధవారం ఎపిసోడ్…
ఇంతలో దేవయాని... వీళ్లిద్దరూ ఎక్కడికి వెళ్లి ఉంటారని వెతుకుతూ  మహేంద్ర, జగతి ఉన్న రూమ్ వైపు వెళుతుంటుంది. అది గ్రహించిన జగతి..దేవయాని అక్కయ్య వస్తోంది సైలెన్స్ అంటుంది. ఆ రూమ్ డోర్ తీయబోతుండగా అదే సమయానికి అక్కడకు వచ్చిన గౌతమ్...పెద్దమ్మ మిమ్మల్ని పెదనాన్న పిలుస్తున్నారు అంటాడు. అటు గౌతమ్ కూడా రూమ్ లోకి వెళ్లబోయి..వసు ఎక్కడుందో అని వెతుకుతూ వెళ్లిపోతాడు. ఇంతలో చిన్న అత్తయ్య ముగ్గులు చాలా బాగా వేశారని ధరణి అంటే జగతి థ్యాంక్స్ చెబుతుంది. అక్కడే ఉన్న గౌతమ్ .... వదినా చిన్నత్తయ్య అన్నారేంటని అడుగుతాడు. ఏం లేదు గౌతమ్..దేవయాని గారిని నేను అక్కయ్య అని పిలుస్తాను కదా అందుకే ధరణి కూడా నన్నుకూడా అత్తయ్య అని పిలిచిందని చెబుతుంది జగతి. మేడం ముగ్గు చాలా బావుందని పొగిడేస్తాడు గౌతమ్. వసుధార ముగ్గు దగ్గర ఫొటో తీస్తాను రా అని గౌతమ్ అంటే తనకి కాలు నొప్పి రాదు, నేను కూడా రాను..కావాలంటే నువ్వు ఫొటోలు తీయించుకో అంటాడు రిషి. 


Also Read: మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ… జోరందుకున్న రిషి-వసు లవ్ ట్రాక్, గుప్పెడంత మనసు మంగళవారం ఎపిసోడ్
రిషి లోపలకు వెళ్లిపోవడం చూసిన మహేంద్ర... ముగ్గుతో ఓ సెల్ఫీ దిగుదాం అని జగతిని అడిగి ఫొటోస్ తీసుకుంటారు. ఇంతలో బయటకు వచ్చిన రిషి.. వసుధారకి ట్యాబ్లెట్ తీసుకొచ్చి ఇస్తాడు. ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్న వసుని చూసి మురిసిపోయిన రిషి.. అచ్చతెలుగు అమ్మాయిలా ఉన్నావ్ అంటాడు. వసుధార నువ్వు ట్యాబ్లెట్ వేసుకునే టైమైందని గౌతమ్ వచ్చి చెబుతాడు. రిషి సార్ ఇప్పుడే తెచ్చిచ్చారంటుంది.. అమ్మ రిషిగా వీడు నాకు పోటీగా తయారయ్యాడా అనుకుంటాడు మనసులో. ముగ్గు చుట్టూ గొబ్బిళ్లు ఆడతారు దేవయాని, జగతి, ధరణి. దేవయాని మాత్రం విసుగ్గా, చిరాగ్గా ప్రవర్తిస్తుంది. పండుగ రోజు కదా అని పడని వాళ్లని చూస్తూ నవ్వుతూ ఉండలేం కదా అంటూ ఇదంతా రిషి చేసిన తప్పులెండి అని మనసులో అనుకుంటూ లోపలకు వెళ్లిపోతుంది. 


Also Read: చెప్పకనే చెబుతున్నా ఇదే ఇదే ప్రేమని అన్నట్టున్న వసు-రిషి, ఊహల్లో గౌతమ్... గుప్పెడంత మనసు సోమవారం ఎపిసోడ్..
వసు సైలెంట్ గా ఉండడం చూసి ఏంటీ ఏమీ మాట్లాడలేదు అంటాడు రిషి. మా ఊరు, మా అమ్మా నాన్న గుర్తుకు వచ్చారన్న వసుతో..ఇక్కడున్న వాళ్లంతా నీ వాళ్లే అనుకో కొంచెం బాధ తగ్గుతుందని చెబుతాడు. రిషి అస్సలు వసు దగ్గర్నుంచి కదలడం లేదనుకుంటాడు గౌతమ్. ఈ డ్రెస్సులో యూత్ ఐకాన్ లా కాకుండా అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా ఉన్నావ్ అని కాంప్లిమెంట్ ఇస్తాడు. గౌతమ్ ఫొటో తీయడం చూసి వద్దురా అంటాడు రిషి..వీడికి తీస్తున్నా అనుకుంటున్నాడు కానీ వసుకి ఫోకస్ పెట్టానన్న సంగతి తెలియదు కదా అనుకుంటాడు. జగతి లోపలకు వెళుతూ వసు ఓసారి లోపలకు రా అంటుంది. ఈ డ్రెస్సులో చాలా బావున్నావ్ అని గౌతమ్ చెప్పగానే..ఇంతకుముందే ఇదే మాట రిషి సార్ చెప్పారంటుంది. కాంప్లిమెంట్ లో కూడా కాంపిటేషనా అనుకుంటాడు.


Also Read:    శౌర్య బతకాలంటే డాక్టర్ కార్తీక్ రావాలన్న మరో డాక్టర్, రప్పిస్తా అన్న వంటలక్క.. కార్తీకదీపం మంగళవారం ఎపిసోడ్
వసు నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్న జగతితో..హెల్ప్ అనకండి ఆర్డర్ వేయండి అంటుంది. ఓ డ్రెస్ చేతికిచ్చి ఇది రిషి కోసం..ఏం చెబుతావో తెలియదు కానీ రిషి ఈ డ్రెస్సులో నాకు కనిపించాలని చెబుతుంది. నేనిస్తే తీసుకుంటారా అన్న వసుతో..నేనిచ్చానని చెబితే అస్సలు తీసుకోడు అంటుంది. ఈ పండుగకు ఇంట్లోకి రప్పించి దేవుడు నాకు గిఫ్ట్ ఇచ్చాడు.. ఈ అమ్మ పెట్టిన కొత్త బట్టల్లో నా కొడుకు కనిపించాలి..ఈ ఆనందాన్ని గిఫ్ట్ గా ఇవ్వు , మళ్లీ ఇంత మంచి అవకాశం రాకపోవచ్చంటుంది. ఇదంతా చూసిన దేవయాని..కొడుక్కి కొత్త బట్టలు పెడతావా ఇవ్వు.. ఆ బట్టలతోనే నీ కథకు ముగింపు పలుకుతాను, ఈ పండుగకు నీకు నేనిస్తా గిఫ్ట్ అనుకుంటుంది దేవయాని.