గుప్పెడంతమనసు మార్చి12 శనివారం ఎపిసోడ్


గౌతమ్ - రిషి మాటలతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసి శనివారం ఎపిసోడ్ వాళ్ల మాటలతోనే కంటిన్యూ అయింది.
గౌతమ్: నా చిన్న ప్రపంచంలో పెద్ద విలన్...నా విలన్ నువ్వే, నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ అడ్డుపడకూడదు కదా. నువ్వు ఇక్కడ లేవనుకుని నా మనసులో ఉన్నదంతా చెప్పేస్తాను. జీవితంలో ఎప్పుడోఓసారి ప్రేమ మెరుపు మెరుస్తుంది నువ్వు నాకు అడ్డుపడకురా అంటాడు. నువ్వేం ఫ్రెండ్ వి రా దేవుడు నాకు వరం ఇచ్చాడు, అందమైన రూపం ఇచ్చాడు ఏంజిల్ ని ఇచ్చాడంటాడు
రిషి: తనకి వసుధార అని అందమైన పేరుంది...ఏంజిల్ అది ఇది అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు
గౌతమ్: నేను వసుధార గురించి మాట్లాడిన ప్రతీసారీ నువ్వు ఏదోలా ఫీలవుతుంటావ్..నువ్వేమైనా.....ఏం లేదులే నీకు అలాంటి ఫీలింగ్స్ ఉండవ్ కదా, అదికాదు కానీ జగతి మేడంని కలిశాను ఆవిడ చాలా మంచివారు అంటాడు
రిషి: మేడం అని పిలువు వరుసలు కలపకు, వసు అని పిలువ్ ఏంజిల్ అనకు అనేసి భోజనం చేద్దాం రా అంటాడు
గౌతమ్: ఇప్పుడే తిట్టాడు ఇప్పుడే భోజనానికి పిలిచాడు వీడిని అర్థం చేసుకోవడం నా వల్లకాదంటాడు
భోజనానికి కూర్చున్న రిషి..డాడ్ ని పిలువు వదినా అంటే..ఆయన బయటకు వెళ్లారు రావడం లేటవుతుందని చెబుతుంది. రిషి ప్లేట్ బోర్లించేసి...డాడ్ వచ్చాక తింటానంటాడు. వదినా అక్కడకు వెళ్లారా అని అడిగి బయలుదేరుతాడు. చిన్నమావయ్యగారు, జగతి అత్తయ్య, రిషి ముగ్గురూ కరెక్టే...మరి కరెక్ట్ గా లేనిదెవరు అని ఆలోచిస్తుండగా ధరణీ ఓసారి ఇటు రా అని పిలుస్తుంది దేవయాని. కరెక్ట్ గా లేనిది ఈవిడే, ఆమె కరెక్ట్ గా ఉంటే అంతా సంతోషంగా ఉండేవారం అనుకుంటూ  వస్తున్నా అత్తయ్యగారూ అంటుంది.


Also Read: శౌర్య ఆవేశం హిమ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పబోతోంది


జగతి ఇంట్లో
సార్ భోజనానికి రండి అంటే అక్కడ రిషి ఎదురుచూస్తుంటాడు వెళతా అంటాడు. ఇక్కడ కాస్త తిని మళ్లీ రిషిసార్ తో కలసి తినండి అంటుంది వసుధార. భోజనం చేస్తూ పలమారుతాడు మహేంద్ర. ఎవరు తల్చుకుంటున్నార్ సార్ అంటే..ఇంకెవరు నా పుత్రరత్నం అని సమాధానం ఇస్తాడు. ఇంతలో అక్కడ ఎంట్రీ ఇస్తాడు రిషి. లోపలకు రా అని మహేంద్ర, జగతి పిలిచినా.. కారు దగ్గరుంటాను, పూర్తిచేసి రండి అనేసి వెళ్లిపోతాడు. మహేంద్ర తినబోతుంటే జగతి చేయిపట్టుకుని ఆపేస్తుంది. మహేంద్ర నువ్వెళ్లు ప్లీజ్ అంటుంది. ఇలా భోజనం మధ్యలో వెళ్లమనడం మర్యాద కాదు కానీ నా కొడుకు బాధపడొద్దు, ఈ ప్లేట్లో భోజనం నేను తింటాను, నాకు తెలిసి రిషి ఇంకా తిని ఉండడు, సారీ మహేంద్ర అంటుంది. ఇట్స్ ఓకే తల్లి మనసు అర్థం చేసుకున్నాను అంటాడు. భోజనానికి రిషిని పిలిస్తే రాడు కానీ నువ్వు వెళ్లమంటే వెళతావ్ అంటుంది. దట్స్ ఓకే అనేసి వెళ్లిపోతాడు. 


రిషి-మహేంద్ర
రిషి ఏదో ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు...మహేంద్ర కారు అడ్డంగా పెడతాడు. 
మహేంద్ర: వస్తున్నా అన్నా కూడా ఆగకుండా వచ్చేశావేంటి
రిషి: మీరు ఇప్పట్లో రారని అర్థమై వచ్చేశాను
మహేంద్ర: నువ్వు ఉండి ఉంటే నీతోపాటూ వచ్చేవాడిని కదా
రిషి: వద్దులెండి పొద్దున్నే కారు పేరుతో మళ్లీ వెళతారు
మహేంద్ర: కారు కోసం కాదు జగతి కోసం వెళతాను
రిషి: భోజనం మధ్యలోంచి ఎందుకు వేచి వచ్చేశారు
మహేంద్ర: నీకు కొన్ని చెప్పినా అర్థం చేసుకోలేవు, నిన్ను సడెన్ గా అక్కడ చూసేసరికి భయం వేసింది
రిషి: భయం ఎందుకు డాడ్
మహేంద్ర: నువ్వు నా గుండె భారాన్ని అర్థం చేసుకోలేవు


దేవయాని: ఇంట్లో ఏం జరుగుతోంది ధరణి, నీకు అర్థమవుతోందా...ఉత్సవ విగ్రహంలా తిరుగుతుంటావ్, అసలేంటి ధరణి నాకు అర్థంకావు. రిషి ఇంట్లోంచి బయటకు వెళుతుంటే అడగాలి కదా
ధరణి: అది అత్తయ్యగారు
దేవయాని: రిషిపై ఎవ్వరికీ ప్రేమ లేకుండా పోయింది, ఏమైనా అడిగితే అంతా నన్ను వెటకారం చేస్తారు, రిషి కూడా ఈ మధ్య సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనుకునే సరికి రిషి వస్తాడు. నాన్నా రిషి ఇంత టైం అయింది ఎక్కడికి వెళ్లావ్, భోజనం చేయవా అంటుంది. మహేంద్రా అని పిలిచి ఏంటి నువ్వు అసలేం అనుకుంటున్నావ్...ఈ వయసులో కొడుకు గురించి నువ్వు ఆలోచించాలి, కానీ నీ గురించి రిషి ఆలోచిస్తున్నాడు, ఇదేం పద్దతి
మహేంద్ర: రిషికి రెక్కలొచ్చాయ్..రిషిని నేను చూసుకోవడం ఏంటి
దేవయాని: మాటకు మాట సమాధానం చెబుతున్నావ్, తండ్రి అన్నాక ఓ బాధ్యత ఉండాలి కదా
మహేంద్ర: మీరేదో అనాలని అనుకుంటున్నారు అనేశారు..నేను వెళ్లనా
దేవయాని: నేను ఇంతలా మాట్లాడుతున్నా ఇలా స్పందించడం కరెక్ట్ కాదు
వెళ్లొస్తా వదినా అనేసి వెళ్లిపోతాడు మహేంద్ర...వీళ్లద్దర్నీ ఇలా వదిలేయడం కరెక్ట్ కాదు అనుకుంటుంది దేవయాని. 


Also Read: వసుని ప్రేమిస్తున్నా అని చెప్పేసిన గౌతమ్, రిషి ఏం చేయబోతున్నాడు


జగతి ఇంట్లో
కాలేజీకి రెడీ అయిన వసుధార ఇంకా టైం ఉందిలే అనుకుంటుంది. ఇంతలో రిషి ఇచ్చిన నెమలి ఈక చేతుల్లోకి తీసుకుని ఏమయ్యా పెద్దమనిషి మా మేడంని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్, నీకెప్పుడో పెద్ద పనిష్మెంట్ ఇస్తాను అంటుంది.
జగతి: అందరూ నువ్వు అర్థంకావు అంటుంటారు కానీ నువ్వు నాకు చాలా బాగా అర్థమయ్యావు రిషి, ( వసు నీ మనసులో ఉందని చెప్పాను అప్పుడు నువ్వు ఒప్పుకోలేవు, ఇప్పటికీ ఒప్పుకోవడం లేదు) 
వసుధారని హాస్టల్ కి పంపించమన్నావ్, పంపిస్తుంటే నువ్వే అడ్డొచ్చి ఆపేశావ్... నీ సమస్యకి పరిష్కారం నన్ను ఆలోచించమన్నావ్ కానీ...నీ మనసులో ఏముందో చెప్పలేదు. నువ్వే చెప్పేవరకూ నేను ఎలాంటి నిర్ణయం తీసుకోను అనుకుంటుంది.
వసుధార: ఈ ఫైల్ రిషి సార్ కి నేనిస్తాను మేడం
జగతి: నువ్వెందుకు వసు..నేనే ఇస్తాను... నన్ను వర్క్ విషయంలో చాలాసార్లు మెచ్చుకున్నాడు. అవన్నీ నేను గుర్తుపెట్టుకున్నాను...బ్యాలెన్సెడ్ గా ఉండడం అవసరం.


కాలేజీలో
సార్ మీరేమీ అనుకోనంటే నాదొక చిన్న రిక్వెస్ట్ అంటూ కాలేజీలో ఓ లెక్చరర్ మహేంద్రని ఆపుతుంది. మీరంతా ఓ చోట జగతి మేడం మరోచోట ఉంటున్నారంట ఎందుకు సార్ ఇదంతా అవసరమా , ఇలా ఉంటే మేడంకి గౌరవం ఎలా ఉంటుంది, పాపం జగతి మేడం అంటారు.ఇది పూర్తిగా మా వ్యక్తిగతం ఇలాంటి విషయాలు కాలేజీలో మాట్లాడకపోవడమే మంచిది అని మహేంద్ర వాళ్లని పంపిచేస్తాడు. అదంతా రిషి విన్నాడని తెలుసుకున్న మహేంద్ర తనని పిలిచేలోగా నాకు పనుంది డాడ్ అనేసి వెళ్లిపోతాడు.


సోమవారం ఎపిసోడ్ లో
వసుధార పొద్దున్నే కాలేజీకి త్వరగా రా నీతో పనుందన్న మెసేజ్ చూస్తుంది. ఎందుకు సార్ రమ్మన్నారని అడగ్గా వసుధార చేతిలో ఓ లెటర్ పెట్టి మీ మేడంకి ఇవ్వు అంటాడు. ఆ లెటర్ చూసిన జగతి సీట్లోంచి లేచి వెళ్లిపోతుంది. ఏం జరిగిందో అర్థంకాని వసుధార ఆ లెటర్ చదివి తిరిగి రిషి దగ్గరకు వెళ్లి ఏంటి సార్ ఇది అని ప్రశ్నిస్తుంది. చదవలేదా, అర్థంకాలేదా అన్న రిషితో అర్థమైంది, మీ మనసులో ఏముందో అర్థమైంది అంటుంది.