కార్తీకదీపం మార్చి 12 శనివారం ఎపిసోడ్


తెల్లచీరతో సౌందర్య ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన మోనిత...నాతో కార్తీక్ బంధం మీరనుకున్నట్టు తెంపేస్తే తెగిపోయే బంధం కాదు..చాలా పవిత్రమైనది..మాది ప్రేమ బంధం ఆ బంధంకి ఆస్తులు, అంతస్తులు ఏవీ అవసరం లేదు..ప్రేమకు ప్రేమ తోడుంటే చాలు..అంతకుమించి ప్రేమ ఎప్పుడూ ఏదీ కోరుకోదు. కార్తీక్ పై నాకున్న ప్రేమ ఎప్పటికీ కరిగిపోదు..నేను చచ్చేంత వరకూ నాతోనే ఉంటుంది. చివరిగా ఒక్కమాట...కార్తీక్ ని నాతోనే ఉండనిచ్చి ఉంటే నా గుండెళ్లో భద్రంగా క్షేమంగా ఉండేవాడు, దీపతో ఉన్నాడు కాబట్టే ఇలా దీపం ముందు ఫొటోలా మిగిలిపోయాడు అనేసి అక్కడి  నుంచి వెళ్లిపోతుంది. 


Also Read: కేక్ కట్ చేసి బాధగా సెట్ నుంచి వెళ్లిపోయిన మోనిత, కార్తీకదీపం అయిపోయిందంటూ వీడియో
మరో రెండు కొత్త క్యారెక్టర్స్ ఎంట్రీ ఇచ్చాయి. డాక్టర్ మందులు రాసివ్వడంతో అవి కొనేందుకు డబ్బుల్లేవని వెయ్యి రూపాయలు ఎలా తెస్తావ్ అని ఆమె అడిగుతుంది. దిక్కులేని వాళ్లకి దేవుడే దిక్కు అనడంతో...ఏంటయ్యా వెయ్యి రూపాయలు కూడా దొంగతనం చేస్తావా అంటుంది. ఏంటో నీ పేరు ఇంద్రుడు, నాపేరు చంద్రయ్య...పది మంది మంచికోసం దొంగతనం చేయడం చూస్తుంటే ముచ్చటేస్తోందంటుంది. హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక  ఒకడు డబ్బులు లెక్కపెట్టడం చూసి వాడిని మాటల్లో పెట్టి డబ్బులు కొట్టేస్తాడు. ఎంత అవసరం అయితే అంతే దొంగతనం చేయడం నాకు అలవాటు...అది కూడా ఓ మంచికోసమే దొంగతనం చేశానంటాడు. 


ఇంట్లో ఉన్న హిమ వస్తువులన్నీ విసిరి కొడుతుంది శౌర్య. ఎందుకిలా చేస్తున్నావ్ అని అడిగితే....హిమ చంపేసింది. అమ్మా-నాన్నని చంపేసిన రాక్షసి అది.. హిమ చంపేయడం ఏంటని ప్రశ్నిస్తే... హిమ మొండిగా తయారైంది అంటూ కార్ డ్రైవింగ్ విషయంలో పట్టుబట్టిన విషయం , హిమ కారణంగానే యాక్సిడెంట్ జరిగిన విషయం చెబుతుంది. దాని మొండితనమే అమ్మా-నాన్నల ప్రాణం తీసింది. అది డ్రైవింగ్ చేయకపోతే ఈ రోజు ఎంత బావుండేది, హిమ చేసిన పనికి ఈ రోజు నేను అనాధనయ్యాను. అది కాదు రౌడీ అన్న సౌందర్యతో...ఇకనుంచి నన్ను అలా పిలవొద్దు... నా అల్లరైనా, రౌడీని అయినా అమ్మా-నాన్నా ఉన్నంతవరకే....వాళ్లతో పాటూ శౌర్య చచ్చిపోయింది. అమ్మా నాన్న లేరు, రారు అన్న నిజం తట్టుకోవడం నా వల్లకావడం లేదు నానమ్మ అంటూ ఏడుస్తుంది. 
సౌందర్య: అన్నీ మర్చిపోయి మారిపోవాలి, నువ్వెప్పుడూ రౌడీలానే ఉండాలి
శౌర్య: నా వల్లకాదు..ఎప్పటికీ నేను అలా ఉండలేను, నా కళ్లారా చూశాను నానమ్మ, అమ్మా నాన్నని కార్లోనే బూడిద చేసేసింది అది... 
ఆనందరావు: చనిపోయింది అమ్మా-నాన్నా మాత్రమే కాదమ్మా హిమ కూడా  లేని తనమీద ఇంకా కోపం ఎందుకురా
శౌర్య: హిమ బతికే ఉంది తాతయ్య
సౌందర్య: హిమ బతికే ఉందని ఎలా చెబుతున్నావ్
శౌర్య: హిమ బతికే ఉందని నా నమ్మకం, ఉన్నా చనిపోదు..అమ్మా నాన్న చావుకి కారణమై అది చాలా పెద్దతప్పు చేసింది, ఆ పాపం ఊరికే పోతుందా, తాతయ్యా మీరు చెప్పేవాళ్లు కదా పాపి చిరాయువు అని అదే నా నమ్మకం...అది ఎక్కడో బతికే ఉంటుంది అని అరుస్తుంది.


Also Read:  వంటలక్క-డాక్టర్ బాబు పాత్రలకి శుభం కార్డ్, హిమపై పగబట్టిన శౌర్య, రేపటి నుంచి సరికొత్త కార్తీక దీపం
కట్ చేస్తే హిమ గాయాలతో ఆ దొంగ ఇంట్లో ఉంటుంది. కార్ డ్రైవింగ్ నేర్పించమన్న దగ్గర్నుంచీ , యాక్సిడెంట్ వరకూ అన్ని విషయాలూ గుర్తుచేసుకుంటుంది. కారు లోయలోకి పడిపోతున్నప్పుడు డోర్ తీసి హిమను కిందకు తోసేస్తుంది దీప. హిమా జాగ్రత్తమా మా గురించి ఆలోచించవద్దు, శౌర్య ఎక్కడ ఉంటే నువ్వూ అక్కడే ఉంటు జాగ్రత్తగా చూసుకో అన్న తల్లిదండ్రుల మాటలు గుర్తొచ్చి అమ్మా-నాన్నా అని గట్టిగా అరుస్తూ లేచి కూర్చుంటుంది హిమ. తాడికొండ వెళ్లొచ్చినప్పటి నుంచీ నీ మాటల్లో నీ ప్రవర్తనలో మార్పొచ్చిందని దీప అన్న మాటలు గుర్తుచేసుకుంటుంది. కార్లో చావు గురించి మాట్లాడటం కరెక్టేనా..శౌర్యతో అలా మాట్లాడొచ్చా...తాడికొండ వెళ్లొచ్చాక నువ్వు రౌడీ అయిపోయావ్, రౌడీ అనిపించుకున్న శౌర్య కామ్ అయిపోయింది అన్న దీపతో శౌర్య గురించి నువ్వేం టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా అన్న మాటలు గుర్తుచేసుకుని అమ్మా అని ఏడుస్తుంది హిమ. 


తన దగ్గరున్న ఇంద్రుడు, చంద్రయ్య ని చూసి నేను ఇక్కడకు ఎలా వచ్చాను, మా అమ్మా-నాన్న-శౌర్య ఎక్కడున్నారని అడుగుతుంది. మేం రంగు రాళ్లకోసం అని లోయలోకి వెళితే నువ్వు చెట్టుకు చిక్కుకుని కనిపించావ్ అని చెబుతారు. దేవుడు దయవల్ల కళ్లు తెరిచావ్, అసలేమైంది అమ్మా అని అడుగుతారు. జరిగిందంతా చెబుతుంది హిమ. చిక్ మంగుళూరులో ఎంజాయ్ చేసిన విషయాలన్నీ గుర్తుచేసుకుంటుంది. 


సోమవారం ఎపిసోడ్ లో
కార్తీక్-దీప ఫొటోల పక్కనున్న దండేసి ఉన్న హిమ ఫొటో తీసి బయటకు విసిరికొడుతుంది శౌర్య. అది కరెక్ట్ గా హిమ కాళ్ల దగ్గర పడుతుంది. అమ్మా నాన్నని మింగేసిన భూతం అది...దాని గుర్తులు ఏవీ ఇంట్లో ఉండకూడదు. అమ్మా నాన్నని మింగేసిన రాక్షసి అది నాకు ఎప్పటికీ కాదు..నేను హిమని వదిలిపెట్టను...మళ్లీ ఇంట్లో దాని పేరు ఎవ్వరు ఎత్తినా నేను మీకు దక్కను అంటుంది శైర్య. ఆ మాటలు విన్న హిమ ఇంట్లోకి అడుగుపెట్టకుండా బయటకు వెళ్లిపోతుంది.