గుప్పెడంత మనసు (Guppedantha Manasu) మార్చి 11 శుక్రవారం ఎపిసోడ్


జగతితో రిషి గురించి మాట్లాడేందుకు ప్రయత్నించిన గౌతమ్ కి రాజీలతో బంధాలు కలవవు అని చెప్పిన జగతి ఈ టాపిక్ మళ్లీ తీసుకురావని ఆశిస్తున్నా అంటుంది. కాఫీ తీసుకొస్తా అని లేచి వెళుతుండగా డోర్ దగ్గర రిషి నిల్చుని ఉండడం చూసి షాక్ అవుతుంది. బయలుదేరుదామా అని గౌతమ్ తో అంటే..లోపలకు రండిసార్ అంటుంది జగతి. నేను మీతో తర్వాత మాట్లాడతాను మేడం అనేసి కారు దగ్గర వెయిట్ చేస్తాను రా అనేలి వెళ్లిపోతాడు. ఇక చేసేది లేక గౌతమ్ బయలుదేరుతాడు. ఇంట్లోంచి బయటకు వచ్చిన గౌతమ్ అక్కడి నుంచి తప్పించునేందుకు ప్రయత్నించనా ఇక్కడ నీకేం పని అని ప్రశ్నిస్తాడు. ఎందుకొచ్చావ్ అని రిషి అడిగితే నువ్వెందుకు వచ్చావ్..ప్రశ్నకు ప్రశ్న సమాధానం కదా నువ్వెళ్లు అనేస్తాడు.


ఇంట్లో దేవయానికి ఫోన్ మాట్లాడుతూ మీరు ఫంక్షన్ కి పిలిచారు సరే.... వచ్చేంత తీరిక మాకుండాలి కదా అని కాల్ కట్ చేస్తుంది. ఇంతలో మహేంద్ర మెట్లపై దిగుతుంటే ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరాడో అనుకుంటుంది దేవయాని. గమనించిన మహేంద్ర అసలు విషయం చెప్పకపోతే వదినగారికి నిద్రపట్టదు అనుకుంటూ ధరణి అని పిలిచిన మహేంద్ర నేను బయటకు వెళుతున్నాను వచ్చేసరికి లేట్ అవుతుందని చెబుతాడు. ఎక్కడికి అని అడగవా ధరణి అంటుంది దేవయాని...ఇంకెక్కడికి మీ చిన్నఅత్తయ్య, నా భార్య జగతి దగ్గరకి అనేసి వెళ్లిపోతాడు. నువ్వొచ్చి ఇక్కడ కూర్చో ధరణి అన్న దేవయాని దగ్గరకు వెళ్లేందుకు భయపడుతుంది. స్వీట్స్ ఏమైనా చేయమంటారా అని సెటైర్ వేస్తుంది.


Also Read: వంటలక్క-డాక్టర్ బాబు పాత్రలకి శుభం కార్డ్, హిమపై పగబట్టిన శౌర్య, రేపటి నుంచి సరికొత్త కార్తీక దీపం


రెస్టారెంట్ నుంచి బయట నిల్చున్న వసుధార..ఆటో కూడా దొరకదు ఇప్పుడు ఎలా వెళ్లాలి...అవసరం లేనప్పుడు లిఫ్ట్ కావాలా వసుధార అని అడుగుతారు, అవసరం ఉన్నప్పుడు రారు అనుకునేలోగా రిషి ప్రత్యక్షమవుతాడు. అదేంటి తలుచుకోగానే ప్రత్యక్షమయ్యారు అనుకుంటుంది.
రిషి: లిఫ్ట్ కావాలా...అయినా నేను నిన్ను అడగడం ఏంటి ఈ టైంలో నీకు ఆటోలు దొరకవు, నాకారే నీకు శరణ్యం , నేను వద్దన్నా సార్ నాకు లిఫ్ట్ ఇవ్వమని అడుగుతావ్
వసుధార: నాకు మీ లిఫ్ట్ అవసరం లేదు
రిషి: నేను ఊరికే అన్నాను..ఈ మాత్రం దానికే ఈగో పొంగుతోందా...
వసుధార: నేను మిమ్మల్ని లిఫ్ట్ అడగలేదు, మీరే వచ్చారు, మీరే లిఫ్ట్ ఇచ్చారు...మళ్లీ మీరే అంటున్నారు...ఎదుటివాళ్లకి ఈగో ఉన్నప్పుడు మనం కూడా ఈగో చూపించుకోవాలి, అందులో తప్పేం లేదు నేను రాను సార్..మీ లిఫ్ట్ నాకు అవసరం లేదని అక్కడి నుంచి వెళ్లిపోతుంది.
రిషి: వసుధారా ఆగు అంటూ వెనుకే ఫాలో అయిన రిషి..ఓ మాట అనుకోకుండా అన్నాను...
వసుధార: నేను రాను సార్ నేను ఇలాగే , ఎలాగోలా వెళతా అనేలోగా..ఆటో రావడంతో ఎక్కేస్తుంది


ఇంటికి వచ్చి  మహేంద్ర కూర్చుంటే వంటగదిలో బిజీగా ఉంటుంది జగతి. 
మహేంద్ర:  నేను వచ్చి ఇంతసేపైంది రావేంటి, కిచెన్లోంచి వస్తుంటే కాఫీ తెస్తావేమో అనుకున్నా 
జగతి: కాఫీలు,టీలు తగ్గించమని డాక్టర్ చెప్పారు కదా నాకు గుర్తుంది
మహేంద్ర: నేను ఇక్కడికి వస్తుంటే వదినగారు అడిగితే నా భార్య దగ్గరకు వెళ్తున్నా అన్నాను
జగతి: నువ్వు మాట్లాడిన మాటల ప్రభావం ఆ తర్వాత రిషిపై పడుతుంది...
మహేంద్ర: చెప్పాలనుకున్నప్పుడు సమాధానం చెప్పేయాలి
జగతి: రిషిని నన్ను చూసి కాలేజీలో చాలామంది కామెంట్ చేశారు..నేను వెళ్లి గొడవపెట్టుకోలేదు... ఆ తర్వాత వాళ్లే వచ్చి సారీ చెప్పారు
మహేంద్ర: నీ సహనం, ఓపిక వల్లే అందరికీ నచ్చుతావ్
జగతి: నా ఓపిక, సహనాన్ని నా కొడుకుకోసం దాచిపెట్టుకున్నా
మహేంద్ర: కాలేజీలో అంత జరిగిన తర్వాత ఏమవుతుందో అని భయపడ్డాను కానీ అంతా మామూలుగా ఉండడం సంతోషంగా ఉంది
జగతి: మనం చేసేది మంచి అయినప్పుడు భయం ఉండదు
మహేంద్ర: నువ్వు కాలేజీకి రాగలవా ఇలాంటి పరిస్థితుల్లో
జగతి: బాధ నా వ్యక్తిగతం..దాన్ని కాలేజీకి ముడిపెట్టలేను
మహేంద్ర: ఇన్ని బాధల్లోనూ క్లారిటీగా ఉంటావ్ కారణం ఏంటి
జగతి: నా కొడుకు


Also Read: మళ్లీ మొదలైన టామ్ ( రిషి) అండ్ జెర్రీ ( వసుధార) వార్
వెనుకే ఫాలో అయిన రిషి  ఆటోకి అడ్డంగా కారు పెడతాడు.  రమ్మని పిలుస్తారా అస్సలు నేను వెళ్లను అనుకుంటుంది వసుధార. ఏంటి సార్ ఆటోకి అడ్డంగా పెట్టారని డ్రైవర్ అడిగితే నీ ఫోన్ ఇవ్వు అని అడిగి నంబర్ సేవ్ చేసుకుంటాడు. జాగ్రత్తగా తీసుకెళ్లమని చెబుతాడు రిషి. ఎంత ఈగో ఉన్నా దీనికి తక్కువేం లేదని వసుధార..మాట్లాడొచ్చు కదా మాట్లాడదు అని రిషి అనుకుంటారు. మరోవైపు మహేందర్-జగతి మాటలు కంటిన్యూ అవుతుంటాయ్. ఈ బుక్ చదివా జగతి కానీ ఎండింగ్ సరిగా లేదంటాడు. 
జగతి: నీతో ఇదే సమస్య అన్నీ మనకు నచ్చినట్టుగా ఉండవ్. దేవయాని అక్కయ్య మాటలు, కాలేజీలో విమర్శలు పట్టించుకుని మన సమయం పాడుచేసుకోవద్దు
మహేంద్ర: మీ తల్లీ కొడుకులు ఈ మధ్య నాకు బాగా క్లాసులిస్తున్నారు...ఇద్దరూ లెక్చరర్లు అయ్యారు..ఫుట్ బాల్ లా అటూ ఇటూ తిరుగుతూ మీ క్లాసులు వింటున్నా
జగతి: వినడం కాదు మహేంద్ర..వాటిని పాటించాలి కదా
ఇంతలో అక్కడకు వచ్చిన వసుధారని మహేంద్ర పలకరిస్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నావ్ అంటే రెస్టారెంట్ నుంచి అని చెబుతుంది. ఇంతలో రిషి నాకు కాల్ చేశాడా కాల్ లిస్ట్ లో ఉందని అడుగుతుంది. దేనిగురించో చెప్పారంట కదా అదే అడిగారు..అడిగినా నాకు చెప్పరు కదా అంటుంది. అంతకోపం ఎందుకు వసుధార అని మహేంద్ర అంటే...చూడబోతుంటే ఇప్పుడే రిషిని కలసి వస్తున్నట్టుంది అంటుంది జగతి. వసుధార లోపలకు వెళ్లిపోతుంది.


గౌతమ్: వసుధారని ఎలా కలవాలి, తన దగ్గరకు వెళదామంటే మిత్రద్రోహి అడ్డొస్తున్నాడు..వీడితో పడలేకపోతున్నా
రిషి: ఏం ఆలోచిస్తున్నావ్
గౌతమ్: నేను-నా ప్రేమ-నా ప్రపంచం ఇంతకన్నా ఏం ఆలోచిస్తాను...చిన్న ప్రపంచంలో పెద్ద విలన్...నా విలన్ నువ్వే, నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా పర్వాలేదు కానీ అడ్డుపడకూడదు కదా. నువ్వు ఇక్కడ లేవనుకుని నా మనసులో ఉన్నదంతా చెప్పేస్తాను. జీవితంలో ఎప్పుడోఓసారి ప్రేమ మెరుపు మెరుస్తుంది నువ్వు నాకు అడ్డుపడకురా అంటాడు. నువ్వేం ఫ్రెండ్ వి రా దేవుడు నాకు వరం ఇచ్చాడు, అందమైన రూపం ఇచ్చాడు ఏంజిల్ ని ఇచ్చాడంటాడు
రిషి: తనకి వసుధార అని అందమైన పేరుంది...ఏంజిల్ అది ఇది అని పిచ్చిపిచ్చిగా మాట్లాడకు


రేపటి (శనివారం) ఎపిసోడ్ లో
నేను వసుధార వెనుక పడితే నీకేంటి ప్రోబ్లెం, కొంపతీసి నువ్వేమైనా అని గౌతమ్ అంటుండగా డాడీ, నువ్వు,నేను కలసి భోజనం చేద్దాం అంటాడు. అక్కడ జగతి ఇంట్లో భోజనం చేస్తున్న మహేంద్ర పొలమారడుతాడు...ఎవరో తలుచుకుంటున్నట్టున్నారన్న వసుధార ప్రశ్నకి ఇంకెవరు మా పుత్రరత్నం అని మహేంద్ర అనగానే అక్కడ ఎదురుగా రిషి కనిపిస్తాడు. అక్కడంతా షాక్...