గుప్పెడంతమనసు జనవరి 25 ఎపిసోడ్ (Guppedanta Manasu January 25th Update)
తన మెడలో తాళి తానే వేసుకున్నానని, రాజీవ్ తో పెళ్లిజరగలేదని వసుధార చెప్పేందుకు ప్రయత్నించినా రిషి, జగతి, మహేంద్ర ఎవ్వరూ తనకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు. ఏం చేయాలో పాలుపోని వసుధార రిషి వెనుకే తిరుగుతోంది... బుధవారం ఎపిసోడ్ లో కూడా రిషి చుట్టూ చక్కర్లు కొడుతోంది వసుధార...ఆ ప్రోమో ఇక్కడ చూడొచ్చు....
రిషి అర్థరాత్రి ఒంటరిగా నడుస్తూ ఉంటాడు...కాసేపటికి వెనుకే ఓ నీడ కనిపించి మళ్లీ వెనక్కు తగ్గుతుంది...
రిషి: ఆ నీడ వసుధారే అని గుర్తించిన రిషి..వచ్చెయ్ వసుధారా..నన్నెందుకు వెంటాడుతున్నావ్..వెళ్లిపో అని సీరియస్ గా చెబుతాడు
వసుధార: బాధగా చూస్తూ నిల్చుంటుంది
అక్కడినుంచి వెళ్లిపోయిన రిషి..దూరంగా వెళ్లి ఓ బెంచ్ పై కూర్చుని..కప్పులో రాళ్లు విసురుతూ ఉంటాడు... ఇంతలో వసుధార వచ్చి పక్కన కూర్చుంటుంది...
మంగళవారం ఎపిసోడ్ లో
మహేంద్ర జగతి..వసుధార క్యాబిన్లోకి వెళ్లి చూస్తారు..అక్కడ దేవయాని కూర్చోవడంతో ఆశ్చర్యపోతారు..మీరేంటి ఇక్కడ అని అడిగేలోగా...దేవయాని వాళ్లపై విరుచుకుపడుతుంది
దేవయాని: వసుధార విషయంలో మీరిద్దరూ ఫెయిల్ అయ్యారు. నా స్టైల్ లో డీల్ చేద్దామని వచ్చాను
మహేంద్ర: వదిన గారు కాలేజీలో పరిస్థితులు ఏం బాగోలేవు ఎంతోమంది ఎన్నో రకాలుగా అనుకుంటున్నారు
జగతి: ఇప్పుడు ఈ గోలంతా అవసరమా అక్కయ్య
దేవయాని: అవసరమే జగతి. తనని మనం ఎందుకు భరించాలి. రిషి సవాలక్ష చెబుతాడు అవన్నీ మనం పట్టించుకుంటామా, అసలు ఆ కాలేజీకి పట్టిన దరిద్రాన్ని అని అంటుండగా ఇంతలోనే అక్కడికి వసుధార వస్తుంది.
వసుధార: నమస్తే మేడం వెల్కమ్ టు మై క్యాబిన్ అనడంతో మై కాలేజ్ అని అంటుంది దేవయాని. కాలేజీ మీదే కావచ్చు కానీ సీటు నాది నా సీట్లో మీరు ఎలా కూర్చుంటారు వెళ్లి రిషి సార్ క్యాబిన్లో కూర్చోండి MD అవ్వండి అంటుంది.
దేవయాని: నీకు మర్యాదగా చెబుతున్నాను వసుధార నా గురించి నీకు తెలియదు వెళ్ళిపోతావా లేదా
వసుధార: మీరే కదా మేడం నాకు ఓటు వేసి మరీ గెలిపించారు. ఇప్పుడు మళ్ళీ ఓటింగ్ పెట్టి ఓడించి పంపించేయండి
వసుధార రిషికి కాల్ చేస్తుండగా ఫోన్ లాక్కున్న దేవయాని ఫైర్ అవుతుంది...ఇంతలో వసుధార... మేడం రిషి సార్ ఎక్కడున్నారు అర్జెంటుగా కలవాలని చెప్పి వెళ్లిపోతుంది..
రిషి పని చేసుకుంటూ ఉండగా తలనొప్పిగా అనిపించడంతో ఫోన్ చేసి స్టాఫ్ బాయ్ ని పంపించమని చెబుతాడు.ఇంతలో వసుధార వస్తుంది... బాయ్ వచ్చాడనుకుని...తలనొప్పిగా ఉంది బామ్ రాయి అని చెబుతాడు.. వసుధార రాస్తుండగా చేతులు పట్టుకున్న రిషి..వెంటనే షాక్ అయి లేచినిల్చుంటాడు. నువ్వెందుకు వచ్చావని రిషి అంటే మీ కోసమే అంటుంది వసు. ఇలా చేయడం సరికాదని కోప్పడిన రిషిని..టైమ్ ఇవ్వండి మాట్లాడాలి అని అడుగుతుంది.
రిషి: మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టు నుంచి కూడా వెళ్ళిపో వసుధార
వసు: అప్పుడు మీరే కదా సార్ నన్ను ఓటింగ్ పెట్టి గెలిపించింది అనడంతో మినిస్టర్ గారు చెప్పారు అని అంటాడు రిషి. మళ్లీ ఓటింగ్ పెట్టి ఓడించండి అంటుంది
Also Read: 'కార్తీకదీపం' సీక్వెల్ - ఆ ప్రశ్నలకు సమాధానం దొరికేది అప్పుడేనా!
ఆ తర్వాత మీటింగ్ హాల్లో..వసుధారని చూసిన కాలేజీ స్టాప్ తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ మీటింగ్ ఏర్పాటు చేయడానికి గల కారణం వసుధార గారు మన కాలేజీ లో మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ గా ఉంటారు తనకి మనమందరం సహాయం చేయాలి అని అనడంతో సరే అని అంటారు. జగతి మేడం సహాయం తీసుకో అని ఫణీంద్ర అంటే నో చెబుతుంది జగతి. వసుధార బాధపడుతుంది.
Also Read: ప్రేమ వల్ల వచ్చిన బాధతో కూడిన కోపంలో రిషి, కూల్ చేసే ప్రయత్నంలో వసు!
మరొవైపు వసుధార ఇంటికి వచ్చిన తండ్రి చక్రపాణి...రిషి సార్ ని కలిసావా జరిగింది మొత్తం వివరించావా అని అడిగితే వసుధార మౌనంగా ఉండిపోతుంది. వాళ్లకు జరిగిన అవమానం ఇంత తొందరగా మరిచిపోలేరు అనడంతో అప్పుడు చక్రపాణి నేను కూడా రిషి సారు టీచరమ్మతో చాలా దారుణంగా మాట్లాడాను తప్పుగా మాట్లాడాను అనుకుంటూ ఉంటాడు. జరిగింది మొత్తం నేను టీచరమ్మకి రిషి సార్ కి వివరిస్తాను అనడంతో అయ్యో వద్దు నాన్న నేను నిదానంగా అవన్నీ చూసుకుంటాను మీరు ప్రశాంతంగా ఉండండి అంటుంది. నువ్వు ఇక్కడే ఉండిపో నాన్న అని బాధగా అడుగుతుంది వసుధార..సరే అంటాడు చక్రపాణి.