Karthika Deepam Sequel: ప్రతి ముగింపు కొత్త ఆరంభానికి నాంది అన్నట్టు..కార్తీకదీపం సీరియల్ ని ముగింపి ఆ సమయంలో బ్రహ్మముడి సీరియల్ ప్రారంభించారు. సాధారణంగా సీరియల్ ఎండింగ్ లో శుభం అని అని బ్యాంగ్ పడాలి..కానీ..కార్తీకదీపం సీరియల్ కి మాత్రం మళ్లీ కలుద్దాం అని క్లోజ్ చేశారు. అంటే..ఈ సీరియల్ కి సీక్వెల్ ఉండబోతోందా.. మిగిలిపోయిన ఎన్నో సందేహాలకు సమాధానం అప్పుడే దొరకబోతోందా అంటే అనువననే చెప్పుకోవాలేమో..
Also Read: 'కార్తీకదీపం' సీరియల్ అయిపోయింది - నిజంగా ఉత్కంఠభరితమైన ముగింపే!
కార్తీకదీపం మిగిల్చిన ప్రశ్నలివే!
కారు ప్రమాదంలో దీప -కార్తీక్ చనిపోయిన తర్వాత కథ తర్వాతి జనరేషన్ కి షిప్ట్ అయింది. దీప ( ప్రేమీ విశ్వనాథ్), కార్తీక్( నిరుపమ్ పరిటాల), మోనిత ( శోభాశెట్టి) క్యారెర్టర్స్ కి బైబై చెప్పేసి... మానస్ ( నిరుపమ్), మనోజ్ (ప్రేమ్), కీర్తి కేశవ్ భట్ ( హిమ), అమూల్య గౌడ (శౌర్య) ని తీసుకొచ్చారు. శౌర్య ఆటో డ్రైవర్ -హిమ డాక్టర్ గా ఎంట్రీ ఇచ్చారు. కార్తీక్ సోదరి స్వప్న పిల్లలుగా నిరుపమ్ - ప్రేమ్ ని తీసుకొచ్చారు. ఆటో డ్రైవర్ శౌర్య..నిరుపమ్ ని ప్రేమిస్తే... హిమపై మనసుపడ్డాడు ప్రేమ్... హిమ-నిరుపమ్ ఇద్దరూ ఒకర్నొకరు ఇష్టపడినప్పటికీ ఆటో డ్రైవర్ జ్వాలే శౌర్య అని తెలిసిన హిమ.. తన ప్రేమను త్యాగం చేస్తుంది.శౌర్యని ఎలాగైనా ఇంటికి తీసుకురావాలని ప్లాన్స్ చేసి ఎట్టకేలకు తీసుకొచ్చింది. నిరుపమ్-శౌర్యకి పెళ్లిచేయాలని హిమ ప్రయత్నిస్తుంటే.. శౌర్య మాత్రం హిమపై కోపంగానే ఉంటుంది. పిల్లలిద్దర్నీ ఎలాగైనా కలపాలని సౌందర్య-ఆనందరావు ప్రయత్నిస్తారు. అమ్మానాన్న వచ్చి చెబితేకానీ హిమపై కోపం పోదని శౌర్య అంటుంది... ఓ గుడిలో అక్కా చెల్లెళ్లు గొడవపడుతుండగా..మీ అమ్మా నాన్న బతికే ఉన్నారని ఎంట్రీ ఇస్తాడు వారణాసి...
Alos Read: ప్రేమ వల్ల వచ్చిన బాధతో కూడిన కోపంలో రిషి, కూల్ చేసే ప్రయత్నంలో వసు!
వారణాసి చెప్పిన ఫ్లాష్ బ్యాక్
ఆటో డ్రైవర్ వారణాసి...గుడిలో సౌందర్య అండ్ ఫ్యామిలీనీ కలసి..దీప-కార్తీక్ బతికే ఉన్నారని చెబుతాడు... అప్పుడు మళ్లీ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ లో గతం మర్చిపోయిన డాక్టర్ బాబు మోనిత భర్తగా ఎంట్రీ ఇస్తాడు. కార్తీక్ బతికే ఉన్నాడని తెలిసి దీప వెతుకుతుంది..ఎట్టకేలకు మోనిత భర్తగా ఉన్న విషయం గమనిస్తుంది.. తనకి గతం గుర్తొచ్చేలా చేసి మోనిత నిజస్వరూపం మరోసారి బయటపెడుతుంది. అదే సమయంలో మోనిత బతికి ఉందన్న విషయం..ఏదో దాస్తోందనే డౌట్ తో సౌందర్య పోలీసులకు పట్టిస్తుంది..అక్కడితో శుభం కార్డ్ పడుతుందేమో అందరూ కలసిపోతారేమో అనుకున్నారంతా... కానీ దాన్ని సాగదీస్తూ చారుశీల అనే డాక్టర్ ని దింపారు..మరో మోనితలా అందమైన విలన్ అనుకుంటే కొన్ని రోజుల్లోనే ఆమెను సైడ్ చేసేశారు. మళ్లీ మోనితను తీసుకొచ్చి...హడావుడి చేసి దీపతో చంపించేశారు... వారణాసి మొదలెట్టిన ఫ్లాష్ బ్యాక్ లో ముసలి సౌందర్యని చూపిస్తూ... అదే సమయంలో డాక్టర్ బాబు-వంటలక్క కూర్చుని మాట్లాడుకోవడం చూపించారు...ఈ రెండూ సింకవలేదు కదా అనే అభిప్రాయం ఉంది కార్తీకదీపం అభిమానుల్లో....
దీప బతికినట్టా పోయినట్టా
మోనితను కాల్చేసి బయటకు వచ్చి కారెక్కి వెళ్లిపోతుండగా..వెనుకే వచ్చిన మోనిత కార్లో బాంబ్ పడేస్తుంది. చనిపోయే ముందు ఏడు అడుగువేద్దాం అంటూ దీప కారు దించేసి కార్తీక్ తో ఏడు అడుగులు వేస్తుంది..ఇంతలో బాంబు పేలుతుంది. నేను చనిపోతానని నాకు తెలుసు మీరు వెళ్లండి అని దీప అంటే..చావైనా బతుకైనా నీతోనే అన్నాడు డాక్టర్ బాబు. మరోవైపు సౌందర్య-వారణాసి ఇదే విషయం మాట్లాడుకుంటూ వాళ్లు కావాలనే దూరంగా వెళ్లిపోయారు..ఎప్పుడో వస్తారు అనుకుంటారు. అటు దీప-కార్తీక్ ఇద్దరూ ...మళ్లీ కలుద్దాం అని ప్రేక్షకులకు చెప్పేసి వెళ్లిపోయారు....
కార్తీకదీపం సీక్వెల్ కోసమే ఈ ప్రశ్నలు వదిలేశారా
దీప బతికిందా లేదా?
నెక్ట్స్ జనరేషన్ రీ ఎంట్రీ లేకుండా ముగింపెలా ఇస్తారు?
హిమపై శౌర్యకి కోపం పోయిందా లేదా?
నిరుపమ్-శౌర్య, హిమ-ప్రేమ్ పెళ్లిళ్లు జరిగాయా?
చారుశీల ఏమైనట్టు...దీప అనారోగ్యానికి తాను కారణం అని పండరి తెలుసుకుందా?
సీరియల్ లో అప్పుడప్పుడు వచ్చిపోయే దుర్గ జైల్లోనే ఉండిపోయాడా?
ఇవి మాత్రమే కాదు..కార్తీకదీపం అభిమానుల నుంచి ఇంకా ఎన్నో ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఇన్ని సందేహాలు వదిలిపోయారంటే కార్తీకదీపం సీక్వెల్ రాబోతోందా అనే డిస్కషన్ జరుగుతోంది.
https://telugu.abplive.com/web-stories/chanakya-niti-in-telugu-chanakya-says-do-not-help-these-three-at-all-56333