కార్తీకదీపం జనవరి 23 సోమవారం ఆఖరి ఎపిసోడ్ (Karthika Deepam Climax January 23th Update)


కార్తీకదీపం సీరియల్ ముగింపు ఎపిసోడ్ ఇదే...
ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించకపోవడంతో మోనిత..తన దగ్గరకు వచ్చిన హిమను చంపేస్తానని బెదిరించి కార్తీక్ తో తాళి కట్టించుకోవాలని చూస్తుంది.దీప తగ్గినట్టే తగ్గి..మోనిత చేతిలో రివాల్వర్ లాక్కుని తిరిగి ఎక్కుపెడుతంది. హిమను సేఫ్ గా మోనిత చేతిలోంచి లాక్కుని..సౌందర్యని, కార్తీక్ ని పిల్లల్ని తీసుకుని అక్కడినుంచి వెళ్లిపొమ్మంటుంది. దాన్ని నువ్వు హ్యాండిల్ చేయలేవు నేనుంటానని సౌందర్య,ఆ రివాల్వర్ నాకివ్వు అని కార్తీక్ అన్నప్పటికీ కూడా..దీప వాళ్లని వెళ్లిపొమ్మంటుంది. కిందకు వెళ్లిన తర్వాత అందర్నీ పంపించేసి కార్తీక్ కిందే ఉండిపోతాడు...


మోనిత: గరిట పట్టుకున్న చేత్తో రివాల్వర్ పట్టుకున్నావ్ ఏం చేయగలవు చెప్పు 
దీప: ఈ రివాల్వర్ కి ఆ సంగతి తెలియదు కదా...ఈ పని ముందే చేసిఉంటే బావుండేది..అయినా కార్తీక్ నిన్ను పట్టించుకోకుండా తిరిగితే ఎందుకు వెంటపడుతున్నావ్
మోనిత: నిన్ను కూడా పట్టించుకోలేదు కానీ...అప్పుడు నువ్వుకూడా తిరిగావ్ కదక్కా... ఇంతకు ముందు కూడా ఇలాగే గురిపెట్టావ్ కానీ కాల్చలేకపోయావ్ 
దీప: గతంలో రివాల్వర్ ఎక్కుపెట్టి కాల్చలేతపోయిన సంగతి గుర్తుచేసుకుంటుంది దీప...
మోనిత: నీకు బాధ్యత ఎక్కువ ఉంది..ప్రేమ కన్నా...
దీప: ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయావ్...
మోనిత: నన్ను చంపకు..దూరం నుంచి అయినా కార్తీక్ ను చూసే అదృష్టాన్నివ్వు... నువ్వు పోయాక కూడా కార్తీక్ జోలికి రాను..దూరం నుంచి చూస్తూ ఈ జీవితం గడిపేస్తాను...
దీప: నీ మాటలు నేను నమ్మను... దేవుడే లేడనుకున్నాను..కానీ ఉన్నాడు..నీలాంటి రాక్షస జాతిని అంతమొందించడానికే నన్ను పుట్టించాడు...ఇంకా నిన్ను క్షమిస్తే దేవుడికి కూడా కోపం వచ్చేస్తుందని గన్ పేలుస్తుంది దీప...


Also Read: నిస్వార్థ ప్రేమ - రాక్షస ప్రేమ మధ్య జరిగిన యుద్ధమే 'కార్తీకదీపం' కథ


బయట నిల్చున్న కార్తీక్ ఆ గన్ సౌండ్ విని లోపలకు వస్తాడు... నువ్వు కాల్చింది నన్ను కాదు..నా గుండెల్లో ఉన్న కార్తీక్ ని అంటూ మోనిత కిందపడిపోతుంది...ఈలోగా దీపకు కూడా గుండెల్లో నొప్పి వచ్చి మోకాళ్లపై కూలబడి..మోనితను చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది... ఎంత దారుణం చేయించావే అనుకుంటుంది...ఇంతలో కార్తీక్ పైకి వస్తాడు...
దీప: నా కార్తీక్ నా కార్తీక్ అంటూ కన్ను మూయకుండానే పోయింది..తన ఆత్మ శాంతించాలంటే అని దీప ఆపేస్తుంది... ఇంతలో కార్తీక్ మోనిత దగ్గర కూర్చుని జరిగినవన్నీ గుర్తుచేసుకుంటాడు...
కార్తీక్: నువ్వు నిజంగా నా మోనితవేనా..కన్ను తెరిచేసరికి నా సగం జీవితం పోయింది..నిన్ను నా స్నేహితురాలు అనుకోవడమే నేను చేసిన తప్పా..కల్లో కూడా ఊహించని పనులు చేశావ్..అనుకున్నది సాధించడానికి మనుషులను చంపడానికి కూడా వెనకాడలేదు..నీది ప్రేమకాదు..శాడిజం..నీ ఇష్టం..నీ మొండితనం..నీ పిచ్చి ప్రేమ నీకు ఏం మిగిల్చాయి..ఏం మిగిలింది నీకు...ఇలా దిక్కులేనిదానిలా ఎవ్వరూ కోరుకోని చావును కోరితెచ్చుకున్నావ్.. ఓ ఫ్రెండ్ కి ఐ మిస్ యూ అని చెప్పలేని వేదన ఈ జీవితానికి మిగిల్చావు..నిన్ను ఇలా చూస్తుంటే జాలేస్తోందంటూ...తెరిచి ఉన్న కళ్లు మూస్తాడు కార్తీక్... అక్కడి నుంచి దీపను తీసుకెళుతుంటాడు....


మరోవైపు మోనిత..చివరి నిముషంలో లేచి వాళ్ల వెనుకే వచ్చి..బాంబుని కార్లో పడేస్తుంది..నాకు దక్కని కార్తీక్ ఎవ్వరికీ దక్కకూడదు అనుకుంటూ ఐ లవ్ యూ కార్తీక్ అని కన్ను మూస్తుంది...


Also Read: కార్తీక్ మీద పిచ్చితో అడ్డంగా బుక్కైపోయిన మోనిత, ఫైనల్ మలుపు ఇదే!


హిమపై కోపంతో కారుదిగిన శౌర్య..అమ్మా నాన్న దగ్గరకు వెళ్లిపోతానంటూ కారు దిగుతుంది...
సౌందర్య: మీ అమ్మా నాన్న వస్తారులే 
శౌర్య: అమ్మా నాన్నలు ఇక్కడకు రారని నీకు తెలుసునానమ్మా కానీ చెప్పవంటూ ఏడుస్తుంది శౌర్య. ఏది నిజమో చెప్పవు ఎందుకు...
సౌందర్య: ఏం చేసినా అందరం కలసి ఉండేందుకే చేశాను...
శౌర్య: ఈ హిమతో నేను కలసి ఉండను..నువ్వు నాతో మాట్లాడొద్దు..నావల్ల కాదు నానమ్మా నాకు అమ్మా నాన్న కావాలి నేను వాళ్లకోసమే వెళతున్నాను..వాళ్ల దగ్గరకే వెళతాను..వాళ్లకే చెబుతాను..నేను హిమతో కలసి ఉండలేనని.. హిమ చేసినవి నాకు నచ్చడం లేదు నానమ్మా అంటూ పారిపోతుంది...
సౌందర్య: దీప-కార్తీక్ ఆశీశ్సులు మీపై ఉంటాయి..మీ రక్త సంబంధమే ఇద్దర్నీ ఒక్కటి చేస్తుందని హిమను తీసుకుని వెళ్లిపోతుంది 


మరోవైపు దీప..శ్వాశ తీసుకోలేక ఇబ్బందిపడుతుంటుంది..మరోవైపు బాంబు టైమ్ తగ్గుతూ ఉంటుంది... 
దీప: నేను పోయాక మీరు మళ్లీ పెళ్లిచేసుకోండి డాక్టర్ బాబు
కార్తీక్:నీకేం కాదు దీపా...
దీప: నాకు ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపిస్తోంది..
కార్తీక్: నువ్వులేని లోకంలో నాకు పనిలేదు..
దీప: నాతో మీకు ఏం మిగిలింది..మీకు మంచి జీవితం ఉంది..చివరి క్షణాల్లో మీ భార్యగా మీతో ఉన్నాను చాలు.. ప్రశాంతంగా కన్నుమూయడానికి..
కార్తీక్: అయితే ఇద్దరం ఉంటాం..లేదంటే ఇద్దరం పోతాం...
దీప: నన్ను బ్రతికించే శక్తి ఎవరికీ లేదు... కారు ఆపుతారా...
కార్తీక్: నేను ఆపను దీపా...ఆపను...నిన్ను బతికించుకునేందుకు హాస్పిటల్ కి తీసుకెళ్తాను
దీప: ప్లీజ్ డాక్టర్ బాబూ కారు ఆపండి అని అడుగుతుంది...
ఇద్దరూ కార్లోంచి దిగుతారు...మీతోపాటూ చివరిసారిగా ఏడడుగులు నడవాలనుంది డాక్టర్ బాబు...ఇదే నా చివరి విన్నపం తీరుస్తారా అని అడుగుతుంది...
ఇద్దరూ కలసి ఏడు అడుగులు వేస్తారు...అటు కార్లో బాంబ్ పేలుతుంది.. అది చూసి దీప-కార్తీక్ షాక్ అవుతారు... నీ చివరి కోరిక మనల్ని రక్షించింది అంటాడు కార్తీక్.. నీతే వేసిన ఏడు అడుగులు మనిద్దర్నీ కాపాడాయి అంటాడు..


మరోవైపు అన్ని ప్రాంతాలు వేతికావా వారణాసి అని సౌందర్య అడుగుతుంది...మోనిత చనిపోయి పడిఉంది.. కారు కాలిపోయింది కానీ అందులో ఎవరూ ఉన్న ఆనవాళ్లు లేవని చెబుతాడు వారణాసి...
సౌందర్య: వాళ్లు వచ్చే రోజుకోసం ఎదురుచూద్దాం అంటుంది సౌందర్య....
అటు కార్తీక్-దీప ఇద్దరూ కలసి కూర్చుని మాట్లాడుకుంటారు...తన దగ్గర నుంచి ఎక్కడికీ వెళ్లొద్దని అడుగుతుంది..
మనిద్దరం ఎప్పటికీ ఇలాగే ఉండాలి దీపా అని కార్తీక్ అంటే..మీరుంటారు కదా డాక్టర్ బాబు అని దీప అంటుంది...
నా ప్రాణం పోవడం నాకు తెలుస్తోంది డాక్టర్ బాబుకానీ మిమ్మల్ని వెళ్లమని చెప్పలేకపోతున్నాను అని కన్నీళ్లు పెట్టుకుంటుంది..
మొదట ఎక్కడ కలిశారు అనే విషయం నుంచి ..ఇద్దరి మధ్య జరిగిన సంఘటనలన్నీ గుర్తుచేసుకుంటారు.  నా ప్రాణాలు అడ్డేసైనా నీ ప్రాణం నిలబెడతాను అంటాడు కార్తీక్... మీ పేరు స్మరిస్తూ పోవాలని ఉందంటూ డాక్టర్ బాబు డాక్టర్ బాబూ అంటుంది దీప... నీ కనుబొమ్మ పైకి అనవా కోపంగా అలా అను దీపా అంటాడు కార్తీక్... మా నాన్న గుర్తొస్తున్నారు  డాక్టర్ బాబూ... అప్పట్లో అత్తయ్య ఎలా మాట్లాడుతారో మానాన్న నాతో ఇమిటేట్ చేయించుకునేవారంటూ ఏడుస్తుంది... అందరూ గుర్తొస్తున్నారంటుంది.... నేను పోయాక అని దీప మాట్లాడుతుంటే... అది జరగదు దీపా... నీతో వేసిన ఏడు అడుగులు ఇద్దర్నీ కాపాడాయి...బతుకుతాం అన్న ఆశ నీకులేదా అని అడుగుతాడు... నిజమే అనిపిస్తోంది డాక్టర్ బాబూ అంటుంది.. నీకు దేవుడి దీవెనలతో పాటూ ఎంతోమంది ఆదరణ నీకుంది అని ఎమోషన్ అవుతూ ధైర్యం చెబుతాడు కార్తీక్...  


మళ్లీ కలుద్దాం......అనేసి కార్తీక్-దీప వెళ్లిపోయారు....