దివ్యని క్షేమంగా కాపాడుకుంటుంది తులసి. జరిగింది తలుచుకుని దివ్య చాలా బాధపడుతుంది. ఆడపిల్ల విలువ బంగారం కన్నా ఎక్కువ ఎంత భద్రంగా చూసుకోవాలి అని దివ్యకి కాసేపు చిన్నపాటి క్లాస్ తీసుకుంటుంది. ఆడపిల్ల గురించి తల్లిదండ్రులు పడే బాధని చక్కగా చెప్తుంది. దివ్య తన తప్పు తెలుసుకుని తల్లిని క్షమాపణ అడుగుతుంది. ఇంకెప్పుడు అబద్దం చెప్పను, అసలు టెన్షన్ పెట్టను, నువ్వు చెప్పినట్టే వింటాను అని దివ్య అంటుంది. తులసి కూతురికి భోజనం తినిపించి పడుకోబెట్టి వెళ్ళిపోతుంది. తెల్లారి లాస్య నిద్రపోతూనే ఉంటుంది కానీ తన ఫోన్లో పాటలు మాత్రం మోగుతూ ఉంటాయి. అవి నందు ఆఫ్ చేయగానే లాస్య కళ్ళు తెరవకుండానే ఫోన్లో సాంగ్ మళ్ళీ అన్ చేస్తుంది.


Also Read: యష్, విన్నీ వార్ స్టార్ట్ - ఫ్రెండ్ ని చూసి తెగ సంతోషపడిపోయిన వేద


నందు బయటకి వచ్చేసరికి రాములమ్మ హడావుడిగా ఎదురుపడుతుంది. తనని నిద్రలేపడం అంత ఈజీకాదులే అని వెళ్ళిపోతాడు. రాములమ్మ గదిలోకి వచ్చి లాస్య ఫోన్ పక్కన పెట్టేసుకుని నిద్రపోవడం చూసి లేపుతుంది కానీ లాస్య లేవకపోయేసరికి బక్కెట్ నీళ్ళు తీసుకొచ్చి మొహం మీద కొడుతుంది. నీళ్ళు మొహాన పడటంతో లాస్య దెబ్బకి లేచి కూర్చుంటుంది. వాన వాన అని అరుస్తూ నిద్రలేస్తుంది. తర్వాత తులసిలా రెడీ అవాలి కదా అని అనుకుంటుంది. తులసిని అనసూయ కాఫీ అడుగుతుంది. అంకిత ఇస్తానన్నది కదా అని తులసి అంటుంది. ఎందుకు చేయలేదని అంటుంది. తెల్లారేసరికి వంటగదిలో అన్నింటికీ తాళాలు ప్రత్యక్షం అయ్యాయని చెప్తారు.


లాస్య బుద్ధి ఇంకా మారలేద అని తులసి అంటుంది. కాదు ఇంతక ముందు పర్మిషన్ తీసుకుని వంట చేయాలని అంది.. కానీ ఇప్పడు తను వచ్చి తన చేతులతోనే అందరికీ అన్ని చేసి పెట్టాలంట అని అంకిత వాళ్ళు చెప్పేసరికి అందరూ బిత్తరపోతారు. ఈ ఇంటికి మంచి రోజులు వచ్చాయ్ అని తులసి నవ్వుతుంది. లాస్య తులసిలా చీర కట్టి వాళ్ళ గది క్లీన్ చేస్తుంది. నందు వచ్చి తనని చూసి మెచ్చుకుంటాడని ఎక్స్పెక్ట్ చేసిన లాస్యని రాములమ్మ అనుకుని తుడవటం అయిన తర్వాత కాఫీ పట్టుకుని రమ్మని చెప్తాడు. అయితే తులసి గుర్తుకు రావాలి లేదంటే నేను గుర్తుకు రావాలి అదేంటి రాములమ్మ గుర్తుకు రావడం అని కాసేపు నందుని తిట్టుకుంటుంది.


Also Read: తులసి అవతారమెట్టిన లాస్య, వాట్ ఏ కామెడీ- జరిగింది తలుచుకుని వణికిపోతున్న దివ్య


ఇంట్లో పాత పాట పెట్టి లాస్య ఎగురుకుంటూ కాఫీ తీసుకుని వస్తుంది. లాస్య అవతారం చూసి ఇంట్లో అందరూ నోరెళ్ళబెడతారు. అందరికీ కాఫీ ఇస్తుంది. కాఫీ ఇచ్చి లాస్య తిక్క తిక్కగా బిహేవ్ చేస్తుంది. పరంధామయ్య లాస్య గాలి తీసేస్తాడు. ఆ పాట ఏంటి డాన్స్ చేసుకుంటూ వచ్చి కాఫీ ఎక్కడ మా తలల మీద పోస్తావో అని హడలి చచ్చాము తెలుసా అని పరంధామయ్య అనేసరికి లాస్య బిక్క మొహం వేస్తుంది.


తరువాయి భాగంలో..


దివ్యని స్పెషల్ కోర్స్ చదివించడం కోసం తులసి తనని ఢిల్లీకి పంపించేందుకు ఏర్పాటు చేస్తుంది. అది తెలుసుకుని నందు తులసి మీద అరుస్తాడు. దివ్య నా కూతురా, నీ కూతురా తేల్చు నన్ను అడగకుండా ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నావ్ అని నిలదీస్తాడు.