నువ్వు తన మాజీ భర్త అని తులసిగారు నాకు చెప్పేసి ఉంటే తను కూడా అందరిలాంటి ఆడదని అనుకునే వాడిని కానీ నీ మంచి కోసం ఆ నిజాన్ని దాచింది అని తెలిసిన తర్వాత ఆమె మీద గౌరవం రెట్టింపు అయ్యింది. ఒకప్పుడు అనుకునే వాడిని ఆ మాజీ భర్త ఎవరో కానీ తులసిగారి జీవితాన్ని నాశనం చేశాడు అని కానీ ఇప్పుడు అనిపిస్తుంది నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకున్నావ్ అని సామ్రాట్ అంటాడు. ఇప్పుడు ఇదంతా నాకు ఎందుకు చెప్తున్నారు అని నందు అంటాడు. నిజమే కాని ఎప్పుడైనా నేను తులసిగారి గురించి మాట్లాడాలంటే ఎవరితో మాట్లాడాలి చెప్పు అని సామ్రాట్ అడుగుతాడు. రేపు మనం బయటకి వెళ్లాలి రెడీగా ఉండండి నేను వచ్చి పికప్ చేసుకుంటాను అని సామ్రాట్ తులసికి చెప్తాడు. మేము కూడా వచ్చెమా అని లాస్య అడిగితే వద్దని అంటాడు.


నందు ఫుల్ గా తాగేసి సామ్రాట్ మాటలు గుర్తు చేసుకుని రగిలిపోతూ ఉంటాడు. వాడి కూతుర్ని పెంచడం కూడా చేతకాదు నాకు నీతులు చెప్తాడా అని నందు తిట్టుకుంటాడు. బాస్ కాబట్టి బతికిపోయాడు లేదంటే వాడి సంగతి చెప్పేవాడిని అని నందు అంటాడు. తాగేసి ఉన్న నందు దగ్గరకి సామ్రాట్, తులసి వచ్చినట్టు ఊహించుకుంటాడు. తులసిగారితో ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా అని నందుతో అంటాడు. మీ జీవితంలో సగ భాగం కావాలని అనుకుంటున్నా మీకు ఇష్టం ఉందా అని సామ్రాట్ తులసిని అడుగుతాడు. ఇష్టమే అని తులసి తల ఊపుతుంది. చాలా ఇంక మమ్మల్ని ఎవరు విడదీయలేరు అని సామ్రాట్ అనేసరికి నందు కోపంగా చేతిలో బాటిల్ విసిరేస్తాడు. వాళ్ళు మాయం అవుతారు.


Also read: దేవిని ఇంటికి రావొద్దని తెగేసి చెప్పిన సత్య- క్షమించమని రాధని అడిగిన జానకి


నేనెంటో తెలిసేలా చేస్తాను వదిలిపెట్టను అని నందు వీరంగం సృష్టిస్తాడు. రేయ్ పొడుగోదా వస్తునా నీ దగ్గరకే వస్తున్నా అని నందు సామ్రాట్ ఇంటికి బయల్దేరతాడు. మధ్యలో కారు ఆగిపోవడంతో నందు మెకానిక్ కి ఫోన్ చేసి పిలిపిస్తాడు. వాడు వచ్చి కారు బాగు చేసిన తర్వాత ఒక కారు బ్రేక్ వైర్ తియ్యలని అంటాడు. చెప్పండి సర్ ఎవరిదని మెకానిక్ అడుగుతాడు. సామ్రాట్ కారు అని చెప్తాడు. వామ్మో సామ్రాట్ సార్ కారుదా నా వల్ల కాదు ప్లీజ్ సర్ నన్ను వదిలేయండి అని వాడు పారిపోతాడు. నందునే సామ్రాట్ ఇంటికి వెళతాడు. తన కారు బ్రేక్ వైరు కట్ చేస్తాడు. పొద్దున్నే లేచి తులసి ఇంటికి వెళ్దామని అనుకుంటున్నావ్ కదా కానీ నువ్వు వెళ్ళేది డైరెక్ట్ గా హాస్పిటల్ కే అని తాగి వాగుతాడు.


పొద్దున్నే సామ్రాట్ ఇంటికే తులసి వస్తుంది. ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను అని చెప్పా కదా ఎందుకు మీరు రావడం అని అంటాడు. ఇద్దరు కలిసి కారులో బయటకి వెళ్తూ ఉంటారు. బ్రేక్స్ పడటం లేదని సామ్రాట్ కంగారు పడతాడు. ఏమైందని తులసి అడుగుతుంది. బ్రేక్ పడటం లేదని చెప్తాడు. కారు వేగంగా వెళ్ళి ఒక చెట్టుని ఢీ కొడుతుంది. కారుకి యాక్సిడెంట్ కావడంతో సామ్రాట్ తలకి దెబ్బ తగులుతుంది. నందు తులసి అని నిద్రలో నుంచి అరుస్తూ ఉలిక్కిపడి లేస్తాడు. లాస్య వచ్చి కోపంగా నందు వైపు చూస్తుంది. తులసి అని అరిచావ్ కదా అని లాస్య అడుగుతుంది. లేదని బుకాయిస్తాడు నందు. తులసిగాని నీ కల్లోకి వచ్చిందా అని లాస్య అడుగుతాడు.


Also Read: వేదని వదిలి మాళవిక చెయ్యి అందుకున్న యష్- జలస్ ఫీల్ అయిన అభిమన్యు


తరువాయి భాగంలో..


సామ్రాట్, హనీ కారులో స్కూల్ కి వెళ్తూ ఉంటారు. కారు డ్రైవ్ చేస్తూ ఉంటే బ్రేక్ పడటం లేదని సామ్రాట్ కి అర్థం అవుతుంది. కారు వేగంగా వెళ్ళి చెట్టుని ఢీ కొడుతుంది. దీంతో సామ్రాట్, హనీ తలకి దెబ్బలు తగులుతాయి.