వేద ఎంత అడిగినా యష్ మాత్రం తను అందంగా ఉందనే విషయం ఒప్పుకోడు. చీర మాత్రమే బాగుందని అంటాడు. నేను అందంగా ఉన్నాను అనే విషయం మీ నోటితోనే ఒప్పిస్తాను అని వేద మనసులో అనుకుంటుంది. ఖుషి వచ్చి వాళ్ళని పిలుస్తుంది. మీరిద్దరు చాలా బాగున్నారని ఫంక్షన్ లో అందరూ అనుకుంటున్నారు ఇంటికి వెళ్ళగానే మీకు దిష్టి తియ్యలని అంటుంది. ఇద్దరు తనకి ముద్దు పెట్టాలని అంటుంది. వేద, యష్ ఖుషికి ముద్దు పెట్టబోతుంటే సడెన్ గా వెనక్కి జరుగుతుంది. దీంతో వేద, యష్ చాలా దగ్గరగా వస్తారు. వేద పక్కకి వెళ్ళగానే యష్ తన మనసులో ఫీలింగ్ బయటపెట్టేస్తాడు. తనని అలా చూడటం కాంప్లిమెంట్ అనుకుంటుందేమో.. అంత అందంగా రెడీ అవడం తన తప్పు..  చూడకుండా ఎలా ఉంటారు.. ఇది నా తప్పు అసలే కాదు అని అనుకుంటాడు.


మాలిని, సులోచన విచిత్రంగా రెడీ అయిపోయి ఎలా ఉన్నాం అని యష్ ని అడుగుతారు. మీరు ఎలా ఉన్నారో నాన్న, మావయ్య చెప్తారు అని యష్ అనేసరికి వాళ్ళిద్దరూ తప్పించుకుని వెళ్లిపోతారు. దీంతో యష్ ఇరుక్కుపోతాడు. ఇక చేసేది లేక యష్ మాలినిని మిస్ వరల్డ్ లాగా, సులోచనని మిస్ యూనివర్స్ లాగా ఉన్నారని పొగిడేస్తాడు. దీంతో ఇద్దరు తెగ సంబరపడిపోతారు. తర్వాత వాళ్ళిద్దరూ కాసేపు వాదులాడుకుంటారు. వేద, ఖుషి నిధి దగ్గరకి వస్తారు. ఖుషి మెహంది పెట్టించుకుంటాను అని అడుగుతుంది. వేదని కూడా మెహంది పెట్టుకోమని అడుగుతుంది. సరే అని వేద ఒప్పుకుంటుంది. అక్కడ పెట్టె అమ్మాయిని ఖుషి వేదకి మెహంది పెట్టమని అడిగితే కొంచెం టైమ్ పడుతుంది ఆగమ్మా అని అంటుంది.


Also Read: 'నీ తమాషా ఇంటి దగ్గర పెట్టుకో' అని లాస్యని వాయించేసిన సామ్రాట్- లాస్యకి స్వీట్ వార్నింగ్ ఇచ్చిన తులసి


ఖుషి యష్ ని రమ్మని పిలుస్తుంది. అమ్మకి మెహంది పెట్టమని అడుగుతుంది. మీ డాడీకి అలాంటివి రావమ్మా అని వేద కౌంటర్ వేస్తుంది. దీంతో డాడీ మన పరువు పోయింది నువ్వు అమ్మకి మెహంది పెట్టాల్సిందే అని అంటుంది. దీంతో యష్ చేసేది ఏమి లేక వేదకి మెహంది పెడతాడు. యష్ అలా పెడుతుంటే వేద తననే చూస్తూ ఉండిపోతుంది. అది చూసి ఖుషి సంతోషపడుతుంది. దామోదర్ వసంత్ ని తీసుకుని వస్తాడు. నా చెల్లిని ఇస్తున్నాం కదా ఇప్పటి నుంచే కాకపడుతున్నాం అని అంటాడు. ఇంత లేటుగా రావడమా అని అని దామోదర్ భార్య అంటుంది. ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ కొంచెం లేట్ అయిందని చెప్తాడు.


ఏమైంది ఎందుకు అలా ఉన్నావ్. కాస్త నవ్వు లేదంటే నిధితో నీకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాం అని అనుకుంటారు అని యష్ అంటాడు. రావాల్సిన బంధువులు అందరూ వచ్చారు కానీ తన తరపు బంధువులు ఎవరు రాలేదని అక్కడి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా వేద వింటుంది. అతను అనాథ అంట తన ఫ్రెండ్ యశోధర్ దామోదర్ గారి చెల్లెలికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారంట అని ఇంకొక ఆమె అంటుంది. అవునా అంత పెద్ద మనిషి దామోదర్ గారు తన చెల్లిని ఒక అనాథకి ఇచ్చి పెళ్లి చేస్తున్నారా నిజంగా గ్రేట్ అని అనుకుంటూ ఉండటం విని వేద ఫీల్ అవుతుంది. ఇక మాళవిక, అభిమన్యు ఫంక్షన్ కి ఎంట్రీ ఇస్తారు. పార్టీలో ఇంతమంది ఉన్నా మనం వచ్చింది ఎవరు పట్టించుకోలేదు కానీ యష్ మాత్రం చూశాడు అది కోపమా లేక అని అభిమన్యు అంటాడు. లవ్.. ఎంతైనా ఫస్ట్ లవ్ కదా అంతా తొందరగా మరచిపోవడం జరగదులే అని మాళవిక చెప్తుంది. ఇది కాన్ఫిడెన్స్ లేదా బ్లైండ్ గా చెప్తున్నావా అని అభిమన్యు అంటాడు. లవ్ కావాలంటే మూడు లెక్కపెట్టేలోపు యష్ మళ్ళీ నన్ను చూస్తాడు చూడు అనేసరికి అభి కౌంట్ చేస్తాడు. 3 అనేలోపు యష్ మళ్ళీ మాళవిక వైపు తిరిగి చూస్తాడు. అది చూసి అభి కాస్త జలస్ ఫీల్ అవుతాడు. లవ్ కదా ఫస్ట్ లవ్ ఆ ఫీలింగ్ అలానే ఉంటుందని మాళవిక అంటుంది.


Also Read: జానకి కంటపడిన మాధవ్ వక్ర బుద్ధి- ఆదిత్యకి బుద్ధి చెప్పిన దేవుడమ్మ, సంతోషంలో సత్య


తరువాయి భాగంలో..


ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. నాజీవితంలో కూడా ఆ స్థానంలో ఒకరు ఉన్నారు అనేసరికి ఖుషి మమ్మీ వెళ్ళు అని వేదకి చెప్తుంది. కానీ యష్ మాత్రం మాళవిక అని పిలిచేసరికి తను వస్తుంది. అది చూసి వేద, ఖుషి షాక్ అవుతారు. యష్ మాళవిక చెయ్యి అందుకుని స్టేజ్ మీదకి వెళ్తుంది. కంగ్రాట్స్ ఐ లవ్యూ అని మాళవిక అందరి ముందు యష్ కి చెప్తుంది.