దేవి క్ ఆదిత్య కేక్ తీసుకొచ్చి తనతో కట్ చేయించి సంబరపడతాడు. అది చూసి సత్య లోలోపల చాలా బాధపడుతుంది. మనం బయటకి వెళ్లాలని అనుకున్నాం బయల్దేరాం కూడా ఇప్పటికైనా వెళ్దామా అని సత్య అడుగుతుంది. ఇప్పుడు ఇంకా ఎలా వెళ్తాం సత్య బయట ఏమేమి తినాలని అనుకున్నావో అవి ఆర్డర్ పెట్టు ఇక్కడే అందరం కలిసి తిందాం అని ఆదిత్య అంటాడు. చెప్పు అసత్య నీకేం కావాలి అని ఆదిత్య అంటే నాకేం వద్దు అని సత్య కోపంగా అరుస్తుంది. ఏమైందమ్మా అని రాజమ్మ అడుగుతుంది. మేమిద్దరం కలిసి ఆనందంగా బయటకి వెళ్దామని అనుకున్నాం కానీ ఇది వచ్చేసింది, మేమిద్దరం సంతోషంగా ఉందామని అనుకున్నా ప్రతిసారీ ఇది వచ్చేస్తుంది. ఒకసారి రెండు సార్లు అంటే సరి కానీ ప్రతిసారీ అంటే ఎన్ని రోజులు భరించేది. దాన్ని చూస్తే చాలు ఆదిత్య అన్నీ మర్చిపోతాడు అని సత్య కోపంగా అంటుంటే దేవి షాక్ అవుతుంది.


సత్య ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా దేవి మనకి అడ్డు కావడం ఏంటి అని ఆదిత్య అంటాడు. నిజం మాట్లాడుతున్నా ఆదిత్య మనం సరదాగా బయటకి వెళ్దామని అనుకున్నాం కానీ ఇది రాగానే మొత్తం వాతావరణం మారిపోయింది, నేను ఉన్నాను అని మర్చిపోయి కేక్ కోసం పరుగులు పెట్టావ్ ఇది అడ్డుపడటం కాదా. ఇది మొదటిసారి కాదు. పండగ పూట ఆనందంగా ఉందామంటే దీన్ని తీసుకొస్తావ్, నీతో పూజ చెయ్యాలని అనుకుంటే దీన్ని తీసుకొచ్చి మధ్యలో కూర్చోబెట్టావ్, ఇలా ఎంతకాలం నా భర్తకి నేను దూరంగా ఉండాలి అని సత్య ఆవేదనగా మాట్లాడుతుంది. నోర్ముయ్ సత్య అని ఆదిత్య అరుస్తాడు. ఎప్పుడో ఒకసారి ఎవరి మాటలకో ఆదిత్య మనసు మారుస్తారు కరెక్ట్ గా అప్పుడే ఇది వచ్చి ఆదిత్య మనసు మార్చేస్తుందని సత్య అంటుంది.


Also Read: వేదని వదిలి మాళవిక చెయ్యి అందుకున్న యష్- జలస్ ఫీల్ అయిన అభిమన్యు


తన బాధ కూడా అర్థం చేసుకో అని రాజమ్మ ఆదిత్యకి చెప్తుంది. దేవి వస్తే నువ్వు మీ అమ్మనాయన్ని కూడా మర్చిపోతున్నావ్ అని కమల అంటుంది. ఆ మాటలకి దేవి చాలా బాధపడుతుంది. జానకి రాధాని చూస్తూ బాధపడుతుంది. తన దగ్గరకి కన్నీళ్ళు పెట్టుకుంటూ వచ్చి రాధ ఇంత కాలం నువ్వు ఎందుకు ముభావంగా ఉంటున్నావో నాకు అర్థం అయ్యింది, నువ్వు బయటకి చెప్పకుండా బాధపడుతుంటే ఎవరి వల్ల బాధపడుతున్నావో అర్థం కాలేదు అది నా బిడ్డ వల్లే అని ఈరోజే తెలిసింది. నేను ఇంతగా బతిమలాడినా నువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోతాను అంటే అల్లాడిపోయాను అని జానకి అంటుంది.


ఇప్పుడు అర్థం అయినా కానీ మీరు చేసేది ఏముంది అని రాధ అంటుంది. నా బిడ్డ ఇంత దుర్మార్గంగా తయారయ్యాడు అని తెలిశాకా ఏం చేయకుండా ఎలా ఉంటాను. వాడి వల్ల నువ్వు ఎన్నో బాధలు పడి ఉంటావు, మాతో చెప్పుకోలేక నువ్వు ఎంతో నరకం అనుభవించి ఉంటావ్ వాడి తరఫున నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నా. తప్పు చేసింది నా బిడ్డే అయినా క్షమించను. పరాయి ఆడపిల్లని సాధించి వేధించే వాడు నా బిడ్డ అయినా ఊరుకొను. ఈ ఇంటి కోసం బిడ్డ కోసం ఎంత చేశావ్ చాలు ఇక నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్లిపో కానీ వెళ్ళే ముందు ఒక్క విషయం మాత్రం ఆలోచించు.. వాడు చేసిన తప్పుకి చిన్మయిని శిక్షిస్తావా, నువ్వే కన్నతల్లి అనుకుంటున్న ఆ పసిదాన్ని అనాథని చేసి వెళ్తావా. సాటి ఆడదానిగా నిన్ను ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండమని చెప్పాలని అనిపించడం లేదు కానీ నానమ్మగా నా స్వార్థం కోసం ఆ పసి దాని గురించి ఆలోచించమని చెప్తుంది’ అని జానకి చాలా ఎమోషనల్ గా మాట్లాడుతుంది.


Also Read: చాటుగా రుక్కు ఫోటోస్ తీసిన మాధవ్- చెంప పగలగొట్టి వార్నింగ్ ఇచ్చిన జానకి, సత్యని మళ్ళీ వదిలి వెళ్ళిన ఆదిత్య


జానకి రాధతో మాట్లాడి వెళ్ళడం మాధవ్ చూస్తాడు. పరిస్థితి చెయ్యి దాటి పోతుంది, బయట ఆ ఆదిత్య అనుకుంటే ఇంట్లో కూడా రాధకి సపోర్ట్ మొదలైంది. వెంటనే ఏదో ఒకటి చెయ్యాలి అని మాధవ్ ఏదో కన్నింగ్ ప్లాన్ వేస్తాడు. దేవి ఇంట్లో నుంచి కోపంగా వెళ్లిపోతుంటే ఆదిత్య ఆపుతాడు. లేదు సార్ చిన్నమ్మకి నేనంటే ఇష్టం లేదు నాకు అర్థం అయ్యిందని దేవి బాధపడుతుంది. ఇంక మీ ఇంటికి నేను ఎప్పుడు రాను మా ఇంటికి వెళ్లిపోతాను అని అంటుంది. తనకి నిజంగా నీ మీద ఏ కోపం లేదని ఆదిత్య సర్ది చెప్పేందుకే చూస్తాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నారు నాకు అంతా అర్థం అయ్యింది నేను ఇక రాను ఇదే చివరి సారి అని దేవి అంటుంది.


నిన్ను చూడకుండా మాట్లాడకుండా ఉండలేను అని ఆదిత్య అంటే వద్దులే సారు నేను ఇంక నీతో మాట్లాడను నేను మా ఇంటికి నడిచి వెళ్లిపోతాను అనేసరికి మాధవ్ వస్తాడు. దేవి ఏడ్చుకుంటూ వెళ్ళి నాయన అని మాధవ్ ని కౌగలించుకుంటుంది. ఇక్కడ నేను ఒక్క నిమిషం కూడా ఉండను అని దేవి అంటుంది. ఏమైంది, ఎవరు ఏమన్నారు అని మాధవ్ అడుగుతాడు. నేను ఎప్పుడు ఈ ఇంటికి రాను మన ఇంటి దగ్గరే ఉంటాను అని దేవి అంటుంది. ఏంటి ఆఫీసర్ ఎప్పుడు మీ దగ్గరకి వస్తాను అనేది ఇప్పుడు రాను అంటుంది ఏం చేశారు అని మాధవ్ అడుగుతాడు. ఒక్క నిమిషం బావగారు అని సత్య వస్తుంది.


దేవిని ఎందుకు పదే పదే మా ఇంటికి పంపిస్తున్నారు అని మాధవ్ ని సత్య అడుగుతుంది. నేనేమీ పంపించాలని పంపించడం లేదు ఓ ఆఫీసర్ తీసుకోస్తాడు, నేను గొడవ పడితే మీ అక్క బాధ పడుతుంది. వద్దు అంటే అక్కడ మీ అక్క ఇక్కడ మీ ఆయన బాధ పడుతున్నాడు ఏమి చేయలేక నేను సైలెంట్ అయిపోయాను అని మాధవ్ అంటాడు. ఇంకెప్పుడు దేవిని ఇక్కడికి పంపించొద్దని సత్య మాధవ్ తో చెప్తుంది.