సామ్రాట్, తులసి కలిసి సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటారు. ఐస్ క్రీమ్ తింటూ సామ్రాట్ మీసాలకి అంటుకుంటే చూసి నవ్వుతుంది. ఫోటో తీసి చూపించి తన మీసాలకి అంటుకున్న ఐస్ క్రీమ్ తుడుస్తుంది. డబ్బులు లేకపోవడంతో చిన్నప్పుడు చేసినట్టు తినేసి పారిపోదామని తులసి పనికిమాలిన సలహా ఇస్తుంది. అది విని సామ్రాట్ వణికిపోతాడు. పారిపోతుంటే ఎవరో ఒకరు వీడియో తీసి నెట్లో పెడతారు ఐస్ క్రీమ్ కోసం ఇంత రచ్చ అవసరమా అని సామ్రాట్ అంటే ఏం కాదు అదొక సరదా అని తులసి ఎంకరేజ్ చేస్తుంది. 1..2..3.. అని తులసి లెక్కపెట్టగానే ఇద్దరు అక్కడి నుంచి పరిగెత్తేస్తారు.


సామ్రాట్ అయితే భయపడుతూ భలే కామెడీగా పరిగెడతాడు. సరదా అయిపోయింది కదా వెనక్కి వెళ్ళి డబ్బులు ఇద్దామని సామ్రాట్ అంటే ఎప్పుడో డబ్బులు ఇచ్చేశాను అని తులసి చెప్తుంది. డబ్బులు ఇచ్చి కూడా కావాలని ఇంత టెన్షన్ పెడతారా అని ఇద్దరూ నవ్వుకుంటారు. పరంధామయ్య జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. ఆయన పక్కన కింద కూర్చుని అనసూయ క్షమించమని అడుగుతుంది.


Also Read: యష్ మీద తనకున్న ప్రేమ బయటపెట్టిన వేద- కొడుకు మీద కోపంతో ఊగిపోతున్న మాలిని


పరంధామయ్య: దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే ఈ ఇంటి యాజమనురాలివి కానీ ఇప్పుడు ఏమైంది నీ పరిస్థితి తలుచుకుంటేనే భయంగా ఉంది. అణుకువగా ఉండే తులసితో నీకు ప్రాబ్లం ఉండేది కానీ దేవుడు నీకు తగిన కోడలిని పంపించాడు అనుభవించు. నీ గురించి, నందు గురించి కాదు తులసి చెప్పిందని ఈ ఇంటికి వచ్చాను మనస్పూర్తిగా కాదు


అనసూయ: అందమైన ఇల్లులా మార్చిన నా కోడలిని ఇంటి నుంచి తరిమేశాను అయినా నా మీద ద్వేషం లేకుండా నందుతో నాకోసం వాదించింది


పరంధామయ్య: అయిందేదో అయిపోయింది జరిగింది తలుచుకుని బాధపడటం తప్ప ఏమి ఉండదు


అనసూయ: మీరు క్షమించరని తెలుసు కానీ రోజు అడుగుతాను అని చేతులు పట్టుకుని అడుగుతుంటే పరంధామయ్య వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్లొద్దని అనసూయ ఏడుస్తూ అడుగుతూ కళ్ళు తిరిగి కిందపడిపోతుంది. ప్రేమ్ వెంటనే తులసికి ఫోన్ చేసి చెప్తాడు. నందు కంగారుగా ఏమైందని వస్తాడు. అభి అనసూయకి వైద్యం చేస్తాడు. అనసూయ కోసం పరంధామయ్య చాలా కంగారుపడతాడు. 24 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని స్ట్రెస్ ఇవ్వకూడదని అభి అంటాడు. తులసిని చూసి అనసూయ దగ్గరకి పిలుస్తుంది. లాస్యని బయటకి వెళ్ళమని అనసూయ చెప్తుంది. ఆ మాటకి లాస్య గొడవకి దిగుతుంది. తులసి పరాయి మనిషి కదా తనతో మాట్లాడటానికి కోడలిని బయటకి పంపించడం ఏంటి అని వాదనకి దిగుతుంది. నందు నోరు మూయించి బయటకి పంపిస్తాడు.


Also Read: భార్య మనసు మార్చాలని తాపత్రయపడుతున్న రామా- జానకి ఐపీఎస్ చదువుతుందా?


అనసూయ తులసికి సోరి చెప్తుంది. మీ మావయ్య మనసు గాయపరిచి అందరినీ ఏడిపించానని చేతులు జోడించి అందరిని క్షమించమని వేడుకుంటుంది. జరిగింది అంతా పీడ కలలాగా మర్చిపోదామని నందు సర్ది చెప్పడానికి చూస్తాడు. కానీ అనసూయ మాత్రం చేసిన పనికి చాలా బాధపడుతుంది.