సునంద జ్ఞానంబ చేస్తున్న పూజ దగ్గరకి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఆ మాటలకి జానకి సునందకి గట్టిగా బదులిస్తుంది. మీరు వినాలనుకుంటున్న శుభవార్త తొందర్లోనే వింటారులే అని జానకి అంటుంది. ఆ మాటకి మల్లిక టెన్షన్ పడుతుంది. తన కంటే ముందు వారసుడి కనిస్తుందో అని తెగ కంగారుపడుతుంది. మీరు ఆ మాట ఎందుకు అంటున్నారో నాకు అర్థం అయ్యింది జానకి గారు ఇప్పటి వరకి మీ లక్ష్యం కోసం ఆగారు ఇక దాన్ని వదిలేశారని నేను అర్థం చేసుకోవడం కోసం ఇలా మాట్లాడుతున్నారని రామా మనసులో అనుకుంటాడు. దేవుడి సమక్షంలో మంచి మాట విన్నందుకు జ్ఞానంబ సునందకి థాంక్స్ చెప్తుంది. అందరూ కలిసి పూజ పూర్తి చేస్తారు.


జానకి గుడిలో అందరికీ ప్రసాదం పంచుతూ ఉంటే అప్పుడే కారులో నుంచి పోలీస్ డ్రెస్ వేసుకున్న ఝాన్సీ దిగుతుంది. తన కూతురిని కిందకి దింపి దేవుడికి దణ్ణం పెట్టిస్తుంది. తనని జానకి అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఝాన్సీ జ్ఞానంబ ఎదురు నిలబడుతుంది. పూజారి ఆమె ఎవరో చెప్తాడు. తనవారైనా సరే తప్పు చేస్తే చట్టం నుంచి తప్పించుకోకూడదు అనే సిద్ధాంతం తనది అని పూజారి గొప్పగా చెప్తాడు. అది విని జ్ఞానంబ తన పెద్ద కోడలు కూడా కాబోయే పోలీస్ ఆఫీసర్ అని చెప్తుంది. అప్పుడే జానకి వస్తుంది. తనని జ్ఞానంబ పరిచయం చేస్తుంది. చిన్న పాప ఉంది కదా పోలీస్ ఉద్యోగం చేస్తూ తనని చూసుకోవడం ఎలా మీ అమ్మగారు చూస్తారా అని జ్ఞానంబ అడుగుతుంది.


Also Read: రోడ్డు మీద పాటలు పాడుకుంటున్న తులసి, సామ్రాట్- కళ్ళు తిరిగి పడిపోయిన అనసూయ


తనకి తల్లి లేదని ఉద్యోగం చేస్తూనే పాపని కూడా చూసుకుంటాను అని చెప్తుంది. ఇది అవకాశంగా చేసుకుని జానకి మనసు మార్చాలని అనుకుంటాడు. ఇంటిని, ఉద్యోగాన్ని చేయడం కష్టం కదా రెండింటిలో ఏదో ఒకటి వదిలేయాలి కదా అని రామా తనని అడుగుతాడు. ఆ మాటకి ఝాన్సీ ప్రోత్సహించే మాటలు చెప్తుంది. సమస్యలు వస్తే లక్ష్యం వదులుకోకూడదు ప్రాణం పోయినా సరే అనుకున్నది సాధించాలని అంటుంది. జానకిని బాగా చదువుకోమని ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత జానకి చెట్టుకి ముడుపు కడుతుంటే అక్కడ సునంద కొడుకు కన్నబాబు ఉంటాడు. జానకిని పలకరిస్తాడు. తప్పు చేసిన వాళ్ళు నీలాంటి వాళ్ళ వల్ల దర్జాగా బయట తిరుగుతున్నారని అఖిల్ ని ఉద్దేశించి జానకిని రెచ్చగొట్టేలా మాట్లాడతాడు.


మీ మరిది మీద కేసు పెట్టి ఎక్కడ జైలుకి వెళతాడో అని కేసు వెనక్కి తీసుకున్నావ్, ఇప్పుడె ఇలా ఉంటే నువ్వు ఐపీఎస్ అయిన తర్వాత నీ మరిది ఎన్ని నేరాలు అయినా చెయ్యొచ్చు. ఎందుకంటే కాపాడటానికి నువ్వు ఉంటావ్ కదా నీలాంటి పక్షపాతం స్వార్థం ఉన్నవాళ్ళకి చట్టాన్ని చేతికి ఇస్తే ఇక నేరాలు చేసుకోవడానికి లైసెన్స్ ఇచ్చినట్టే అని నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. ఆ మాటలకి జానకి ఫీల్ అవుతుంది. ఐపీఎస్ ఆశని వదులుకోవడం కరెక్టేనా అని జానకి ఆలోచనలో పడుతుంది.


Also read: యాక్సిడెంట్ టైమ్ లో మాళవిక తనతోనే ఉందని అబద్ధం చెప్పిన యష్- ప్రశ్నలతో ఆటాడుకున్న ఝాన్సీ