IND vs NZ 3RD ODI:  భారత్ తో మూడో వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ ప్రస్తుతమున్న పరిస్థితుల్లో మొదట బౌలింగ్ చేయడం తమకు కలిసొచ్చే అంశమని కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ అన్నాడు. మొదటి వన్డేలోనూ ఇలాంటి పరిస్థితుల్లో తమ బౌలర్లు రాణించారని చెప్పాడు. న్యూజిలాండ్ జట్టులో ఒక మార్పు జరిగింది. బ్రేస్ వెల్ స్థానంలో ఆడమ్ మిల్నే జట్టులోకి వచ్చాడు. 


'ఈ పిచ్ పై మొదట బౌలింగ్ చేయాల్సింది. అయితే మేం బ్యాటింగ్ చేయాల్సి వస్తోంది. అయినా గెలవాలనే ఆలోచనతోనే మేం ఆడతాం. రెండో వన్డేలో గిల్, సూర్య బాగా బ్యాటింగ్ చేశారు. సానుకూలంగా ఉండడం ముఖ్యం' అని భారత కెప్టెన్ ధావన్ అన్నాడు. రెండో వన్డేలో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతున్నట్లు తెలిపాడు. 


భారత్ తుది జట్టు 


శిఖర్ ధావన్ (కెప్టెన్), శుభమన్ గిల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దీపక్ హుడా, వాషింగ్టన్ సుందర్, దీపక్ చాహర్, ఉమ్రాన్ మాలిక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్.


న్యూజిలాండ్ తుది జట్టు 


ఫిన్ అలెన్, డెవాన్ కాన్వే, కేన్ విలియమ్సన్ (కెప్టెన్), డారిల్ మిచెల్, టామ్ లాథమ్ (వికెట్ కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ సాంట్నర్, ఆడమ్ మిల్నే, మాట్ హెన్రీ, టిమ్ సౌథీ, లాకీ ఫెర్గూసన్.










బ్యాటింగ్ ఓకే


 బ్యాటింగ్ లో భారత్ బాగానే కనిపిస్తోంది. తొలి వన్డేలో బౌలింగ్ కు సహకరించిన పిచ్ పై కూడా మన ఓపెనర్లు ధావన్, గిల్ లు శతక భాగస్వామ్యం అందించారు. మిడిలార్డర్ లోనూ శ్రేయస్, సంజూ శాంసన్ మంచి ఇన్నింగ్స్ ఆడారు. రెండో వన్డేలో ధనాధన్ బ్యాటింగ్ చేసిన సూర్య కూడా ఫాంలోకి వచ్చినట్లే. అయితే పంత్ ఫామే ఆందోళన కలిగిస్తోంది. టీ20 వైఫల్యాన్ని వన్డేల్లోనూ కొనసాగిస్తున్నాడీ వికెట్ కీపర్. సంజూ శాంసన్ తొలి మ్యాచులో పరవాలేదనిపించే ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ఆల్ రౌండర్ దీపక్ హుడా కోసం రెండో వన్డేలో సంజూను పక్కన పెట్టారు. ఏదేమైనా బ్యాటింగ్ లో భారత్ ఓకే అనిపిస్తోంది. 


బౌలింగే ఆందోళనకరం


టీమిండియా ఆందోళనంతా బౌలింగ్ తోనే. తొలి వన్డేలో 300 పైచిలుకు లక్ష్యాన్ని కూడా కాపాడలేకపోయారు మన బౌలర్లు. ఉమ్రాన్ మాలిక్, వాషింగ్టన్ సుందర్ మాత్రమే పరవాలేదనిపించే ప్రదర్శన చేశారు. శార్దూల్ ఠాకూర్ మొదట బాగానే బౌలింగ్ చేసినా.. ఆఖర్లో ధారాళంగా పరుగులిచ్చేశాడు. రెండో మ్యాచుకు శార్దూల్ స్థానంలో దీపక్ చాహర్ ను తీసుకున్నారు. అతడెంత మేర ఆకట్టుకుంటాడో చూడాలి. అర్షదీప్ అనుకున్నంతమేర రాణించడంలేదు. ఇక స్పిన్నర్ చాహల్ ఇంకా ఫాంలోకి రాలేదు. జోరుమీదున్న కివీస్ ను ఆపాలంటే బౌలింగ్ లో అద్భుతమనిపించే ప్రదర్శన చేయాల్సిందే