యాక్సిడెంట్ జరిగిన టైమ్ లో మాళవిక తనతోనే ఉందని యష్ అబద్ధం చెప్తాడు. ఆ మాటకి వేద చాలా బాధపడుతుంది. యష్ సొంత వాళ్ళని కాదని దీన్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడని మాలిని తిట్టుకుంటుంది. మాళవిక మీరే కలిసి ఉన్నామని అన్నారు కదా ఎక్కడ ఉన్నారు అని గుచ్చి గుచ్చి అడుగుతుంది. ఎక్కడ ఉన్నామనేది చెప్పాల్సిన అవసరం మీకు లేదు అని యష్ అంటే అవసరం ఉంది ఎందుకంటే తను మీ వైఫ్ కాదు కదా అని ఝాన్సీ అంటుంది. మీ భార్యకి తెలియకుండా కలవడం తనని మోసం చేయడం అవుతుందని తెలుసా చెప్పండి మీరిద్దరూ ఎందుకు ఎక్కడ కలిశారని రెట్టించి అడుగుతుంది. ఎందుకు యశోధర్ ఇలా చేస్తున్నారని వేద మనసులోనే బాధపడుతుంది.


మీ పాత భార్యతో మళ్ళీ ప్రేమలో పడ్డారా, మీ ప్రస్తుత భార్య వేదని చీట్ చేస్తున్నారా అని ఝాన్సీ అడుగుతుంది. నా వేద గురించి దయచేసి అలా మాట్లాడొద్దు ప్లీజ్ అని యష్ అంటాడు. అయితే వేద మీద ఒట్టేసి చెప్పండి ఆరోజు మాళవిక మితోనే ఉన్నారా అని ఝాన్సీ అడిగేసరికి యష్ మౌనంగా ఉంటాడు. వేద జడ్జిని తన లాయర్ తో మాట్లాడటానికి అవకాశం ఇవ్వమని అడుగుతుంది. పర్మిషన్ ఇస్తారు. యష్ ని ఇబ్బంది పెట్టె ఏ ప్రశ్న అడగొద్దని వేద లాయర్ ఝాన్సీని బతిమలాడుతుంది. దీంతో ఝాన్సీ యశోధర్ ని ఆడగాల్సిన ప్రశ్నలు పూర్తయ్యాయని చెప్పి వెళ్లిపొమ్మని అంటుంది. మాలిని ఇంటికి వస్తుంది. ఏం జరిగిందని రత్నం అడుగుతాడు. ఆ మాళవిక కోసం యష్ చెప్తున్న అబద్ధాలు విని కోపంగా ఉందని చిరాకుపడుతుంది.


Also Read: రోడ్డు మీద పాటలు పాడుకుంటున్న తులసి, సామ్రాట్- కళ్ళు తిరిగి పడిపోయిన అనసూయ


వేద ఒక్కతే కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఝాన్సీ వచ్చి ఏమైంది, ఎందుకు అలా చేశావ్ అని అడుగుతుంది. అప్పుడే యష్ అటుగా వెళ్తు వేద మాటలు వింటాడు.


వేద: మీరు ఎందుకు అడిగారో నాకు తెలుసు. ఆరోజు ఆ టైమ్ లో ఆయన యాక్సిడెంట్ అయి నెత్తుటి మడుగులో ఉన్న మా అమ్మని కాపాడాడు, సొంత కొడుకులాగా దగ్గర ఉండి చూసుకున్నారు. నాకోసం ఫైట్ చేస్తాను అని చెప్పిన ఆయన మాట తప్పి మాళవిక వైపు ఎందుకు వెళ్లారో తనని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావడం లేదు


ఝాన్సీ: ఒక్క నిమిషం ఓపిక పట్టినట్లయితే కేసు గెలిచే వాళ్ళం


వేద: గెలవడం నాకు ముఖ్యమే కానీ నా కళ్ళ ముందు నా భర్త కుమిలిపోతుంటే ఎలా ఓర్చుకోగలను. నాకు ఎంత బాధవచ్చినా భరిస్తాను కానీ నా భర్త బాధపడితే భరించలేను. ఆయన మీద మచ్చ పడితే తట్టుకోలేను. మా ఇద్దరి పెళ్లి ఒక ఒప్పందమే కానీ దానిలో కూడా బంధం ఉంది. నాగురించి ఆయన ఆలోచించకపోవచ్చు కానీ తన గురించి నేను ఆలోచిస్తాను, ఇది మా ఫ్యామిలీ సమస్య. నాపోరాటం ఆయన మీద కాదు కలలో కూడా ఆయన నాకు అన్యాయం చేయరు తుది శ్వాస వరకి నేను ఆయన్ని నమ్ముతాను. నిజానికి శారీరకంగా మేమిద్దరం భార్యాభర్తలం కాదు. కానీ మా మధ్య బంధం ఉంది అది స్నేహమో, గౌరవమో అనుకోండి దాన్ని నేను నిలుపుకోవాలి కదా. మాళవికతో ఆయనకి మధ్య ఏదో ఉందని అంటే ఎలా ఉంటుంది నాకు, కేసు గెలవండి వాదించండి కానీ యశోధర్ ని ప్రశ్నలతో హర్ట్ చేయొద్దు


Also read: యాక్సిడెంట్ టైమ్ లో మాళవిక తనతోనే ఉందని అబద్ధం చెప్పిన యష్- ప్రశ్నలతో ఆటాడుకున్న ఝాన్సీ


ఆ మాటలు అన్నీ వింటూ యష్ కన్నీళ్ళు పెట్టుకుంటాడు.


ఝాన్సీ: నేను లాయర్ ని మాత్రమే కాదు భార్యని, తల్లిని కూడా. నా లైఫ్ లో నీలాంటి ఆడదాన్ని చూడలేదు. ఎంత ప్రేమిస్తున్నావ్ నీ భర్తని, యశోధర్ చాలా అదృష్టవంతుడు నీలాంటి భార్య దొరికింది