తులసి అనసూయని ఇంట్లోకి తీసుకుని వస్తుంటే నందు ఆపుతాడు. ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదమ్మా అని అరుస్తాడు. ‘నాన్న జోలికి వెళ్లొద్దని చిలక్కి చెప్పినట్టు చెప్పి వెళ్ళాను అయినా మా నాన్నని అవమానించి ఇంటికి రాకుండా చేశావ్. ఆయన తిరిగి ఇంట్లో అడుగు పెట్టే వరకు నువ్వు తిరిగి ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి వీల్లేదని’ తల్లితో అంటాడు. తులసి వైపు కోపంగా చూస్తూ ఇక్కడేం పని నీకు గెట్ అవుట్ అని అంటాడు. తను నన్ను తీసుకుని వచ్చిందని అనసూయ చెప్తుంది.
నందు: తను ఈ ఇంటి మనిషి కాదు పరాయి మనిషి తనని ఆడగాల్సినవి ఏమి లేవు కానీ నేను నిన్ను ఆడగాల్సినవి చాలా ఉన్నాయ్. మా నాన్న ఎక్కడ ఎందుకు ఇంటికి రాలేదు.. నిన్నే అడిగేది
తులసి: అత్తయ్య మావయ్యని బతిమలాడి ఇక్కడికి తీసుకురావడానికి వెళ్లారు కానీ ఆయన కోపంగా ఉండటం వల్ల రానని చెప్పారు
నందు: ఎలా వస్తారు, సిగ్గుతో తల దించుకునేలా తన వాళ్ళే అన్ని మాటలు అంటే ఎలా వస్తారు, మా నాన్నని ఈ విధంగా వేరే ఎవరైనా అవమానించి ఉంటే ఈ పాటికి వాళ్ళని చంపేసి ఉండేవాడిని కానీ ఆ మనిషి నాకు జన్మనిచ్చిన అమ్మ అయిపోయింది. నేను చావడానికి అయినా సిద్దమే కానీ నాన్న లేకుండా ఉండలేను. నువ్వు పాపం చేశావ్, వరం ఇవ్వాల్సిన దేవుడే శపిస్తే ఎవరికి చెప్పుకోవాలి
తులసి మాట్లాడటానికి ట్రై చేస్తుంటే నందు షటప్ అని గట్టిగా అరుస్తాడు. అటు ఇంటి దగ్గర పరంధామయ్య చాలా బాధగా కూర్చుని ఉంటాడు. తులసి ఇంతవరకి ఇంటికి రాలేదు అక్కడ ఏం గొడవ జరుగుతుందో అని సామ్రాట్ టెన్షన్ పడుతూ ఉంటాడు.
Also Read: గుండెలు పగిలేలా రోదించిన అనసూయ- ఉగ్రరూపం దాల్చి తల్లిని ఇంట్లోకి అడుగుపెట్టొద్దన్న నందు
తులసి: అత్తయ్య చేసిన పనికి కోపం రావడం సహజం కానీ తనని అగౌరవపరచకండి
నందు: కానీ మా అమ్మ చేసినంత పెద్ద తప్పు నేను ఎప్పుడు చెయ్యలేదు
తులసి: ముందు తనని ఇంట్లోకి రానివ్వండి బయట వాళ్ళు చూస్తే పరువు పోతుంది గుమ్మం దగ్గర వద్దు. మీ నాన్న నాదగ్గరే క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఇక్కడకి వచ్చే పరిస్థితి లేదు ఆయన కోపం చల్లారగానే ఇక్కడికి పంపిస్తాను
నందు: థాంక్స్ మా నాన్నని జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు
లాస్య: తులసికి థాంక్స్ చెప్తావ్ ఏంటి నందు అసలు ఇదంతా జరగడానికి కారణం తనే. అత్తయ్యని అడ్డం పెట్టుకుని మనతో అధర్మ యుద్దం చేస్తుంది. మావయ్యని తనవైపుకి తిప్పుకుని మనతో ఆడుకుంటుంది
తులసి: మీ ఆయన మీద ప్రశ్నలు మీమీద మాత్రమే నామీద కాదు
లాస్య: మన ఫ్యామిలీని ముక్కలు చెయ్యడానికి తులసి ట్రై చేస్తుంది
తులసి: మీ ఫ్యామిలీని ముక్కలు చేసుకుని పండగ చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ఇంటి కోడలిది. అది నీకు చేతకాదని నామీద పడుతున్నావ్. నువ్వు ఆయన కూతురులా మారకపోవడం నీతప్పు
నందు: అవును లాస్య ఇది నీ తప్పే ఇంతకాలం ఉన్నావ్ ఆయనకి కూతురు ఎందుకు కాలేకపోయావ్
లాస్య: తులసి కావాలని టాపిక్ డైవర్ట్ చేస్తుంది
Also Read: మాళవిక జైలుకి వెళ్ళి చిప్పకూడు తినాల్సిందేనన్న అభిమన్యు- కోర్టుకి చేరిన వేద, యష్
తులసి: అలా చేసింది నేను కాదు నువ్వు మావయ్య గురించి వదిలేసి నా మీద పడుతున్నావ్
నందు: ఈ విషయంలో నీతప్పు కూడా ఉంది, ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన దగ్గర నుంచి అందరి మీద కోపం పెంచుకున్నావ్ ఇంట్లో వాళ్ళందరిని లాక్కోవడానికి చూస్తున్నావ్
తులసి: మీ వంతు ప్రయత్నం చేయకుండా నా మీద నిందలు వెయ్యకండి, అత్తయ్యగారు నిందలు వేసిన తర్వాత ఆయన ఎంత కుంగిపోయారో మీకు తెలియదు. మీరు ఆ పరిస్థితిలో ఆయన్ని చూసి ఉంటే నాదగ్గరే ఉంచుకోమని అనేవాళ్ళు.