రాజ్యలక్ష్మి బసవయ్య మాట్లాడుకుంటూ ఉండగా విక్రమ్ వచ్చి కొబ్బరి తోట దిగుమతి అని చెప్పి రూ.10 లక్షలు ఇవ్వబోతాడు. ఇప్పుడు డబ్బు పెట్టాల్సింది అమ్మ చేతిలో కాదు భార్య చేతిలోనని నటిస్తుంది. ఎప్పుడు నీకే కదా ఇచ్చేదంటే ఈ ఇంటికి పెద్ద కోడలు వచ్చింది తనకి బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకుంటానని చెప్తుంది. ఇంటి తాళాలు రాజ్యలక్ష్మి దివ్యకి ఇవ్వబోతుంటే తను తీసుకోదు ఇప్పుడే కాదు ఎప్పటికీ తీసుకోదని అమ్మ భజన చేస్తాడు. ఈ ఇంట్లో ఎప్పటికీ అమ్మదే పైచేయి తుది నిర్ణయం అమ్మదే, మేమంతా ఎప్పటికీ నీ ముందు చిన్న పిల్లలమేనని డబ్బు తల్లి చేతిలో పెడతాడు. విక్రమ్ వెళ్లబోతుంటే దివ్య ఆపుతుంది. నా మీద ధ్యాస తగ్గిందా? మన మొదటి రాత్రి కావడం లేడని దిగులు పెట్టుకున్నారా? అని కావాలని భర్త జుట్టు సరి చేస్తుంది.
దివ్య: తల్లిగా దొంగ ప్రేమతో మా ఆయన్ని నీ గుప్పిట దాటకుండా ఆడిస్తున్నావ్. భార్యగా నేను తలుచుకుంటే ఏం చేస్తానో డెమో చూపిస్తా
Also Read: శ్రీనివాసరావుకి చీవాట్లు పెట్టిన మురారీ- భర్త ఊహల్లో తేలిపోతున్న కృష్ణ
రాజ్యలక్ష్మి: తెలిసిపోయిందా ఎలాగో తెలిసిపోయింది కాబట్టి నా చెప్పు చేతుల్లో బతికితే నీకు మంచిది. నువ్వు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా మా తల్లీకొడుకులని దూరం చేయలేవు
దివ్య: మీరు మనవళ్ళతో ఆడుకుంటే నేను చక్రం తిప్పుతా
రాజ్యలక్ష్మి: కొబ్బరి తోట డబ్బులే నీ చేతికి ఇవ్వలేదు ఇక హాస్పిటల్ ఎండీ సీట్ నీకు ఎలా ఇస్తాడు. నీ మొగుడు నా పెంపుడు కుక్క
దివ్య: ఇది మీ ఒరిజినాలిటీ. ఎప్పుడు వచ్చామన్నది కాదు ఏం చేస్తామన్నది ముఖ్యం. నువ్వు వేసుకున్న మసుగు నీ పెద్ద కొడుకు ముందు తీసేస్తా
రాజ్యలక్ష్మి: అంతకంటే ముందు నా కొడుకు నిన్ను బయటకి గెంటేలా చేస్తా ఈ ఇంట్లో నీకు అవమానాలు జరిగేలా చేస్తా. అందుకే నిన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకున్న
దివ్య: ఇప్పుడు నా టార్గెట్ నన్ను రక్షించుకోవడం కాదు మీ నుంచి విక్రమ్ ని రక్షించుకోవడం. ఈ ఇంట్లో నా వాళ్ళందరూ పండగ చేసుకునేలా చేస్తా
రాజ్యలక్ష్మి: ఈ ఇల్లు నా రాజ్యం ఇక్కడ నా మాటే శాసనం ఇది నా ఛాలెంజ్
Also Read: మినిస్టర్ ముందు రిషిని దోషిని చేసిన సారధి- తప్పు వసు మీదకి తోసేసిన శైలేంద్ర
లాస్యతో గొడవ పడటం గురించి మోహన్ తిడతాడు. అసలు ఈ టైమ్ లో ఏ చేయకూడదో అదే చేశావు, పబ్లిక్ లో అందరి ముందు తనని కొట్టావు ఎందుకు ఇలా చేశావని నిలదీస్తాడు. తులసిని అనరాని మాటలు అంది చూస్తూ ఊరుకోమంటారా అని అంటాడు. ఇప్పుడు మనం చేయగలిగింది ఏమి లేదు లాస్య ముందు తల వంచుకుని బతకడమేనని అనసూయ వాళ్ళు చెప్తారు. లాస్యతో కాంప్రమైజ్ కావాలని ఎంత సర్ది చెప్పినా కూడా నందు ససేమిరా అంటాడు.
విక్రమ్ షర్ట్స్ అన్నింటినీ దివ్య తీసేస్తుంది. ట్రెండీగా ఉండే డ్రెస్ తీసుకొచ్చి వేసుకోమని ఇస్తుంది. అమ్మ తిడుతుందని భయపడతాడు. ధైర్యం చెప్పి విక్రమ్ కి తనే ఆ డ్రెస్ వేస్తుంది. అందరినీ హాల్లోకి పిలిచి విక్రమ్ ని చూపిస్తుంది. హీరోలాగా స్టైల్ గా ఉన్న విక్రమ్ ని చూసి ప్రియ, ముసలాయన సంబరపడితే మిగతా వాళ్ళు మాత్రం బిత్తరపోతారు. విక్రమ్ నువ్వు చేసిన తప్పు ఏంటో నీకు తెలుస్తుందా? తెలిసి ఎందుకు తప్పు చేశావని రాజ్యలక్ష్మి నిలదీస్తుంది. నేను బతిమలాడితే వేసుకున్నారని చెప్తుంది. వాడు వ్రతం దీక్షలో ఉన్నాడు పూర్తయ్యేంత వరకు పద్ధతిగా ఉండాలని అంటుంది.