ముకుంద తండ్రికి ఫోన్ చేసి ఈ ఇంట్లో ఉండటం తన వల్ల కావడం లేదని, కృష్ణతో ప్రేమలో పడ్డాడు ఏమోనని అనుమానంగా ఉందని చెప్తుంది. మురారీతో మాట్లాడమని అంటుంది. నేను మాట్లాడింది మాట్లాడేశాను ఇక పెద్ద వాళ్ళు జోక్యం చేసుకునే టైమ్ వచ్చింది మురారీతో మాట్లాడి కృష్ణ వెళ్లిపోగానే నన్ను పెళ్లి చేసుకోవాలని మాట తీసుకోమని చెప్తుంది. తండ్రిగా అలా ఎలా మాట్లాడతానని అంటాడు. ఉన్నతంగా ఆలోచిస్తే నేను జీవితాంతం అత్తారింట్లో ఒంటరిగా బతకాలని అంటుంది. మురారీని ఒప్పిస్తే చాలు అతడే ఇంట్లో వాళ్ళని ఒప్పిస్తాడని చెప్తుంది. శ్రీనివాసరావు హాస్పిటల్ దగ్గరకి వస్తే అక్కడ మురారీ, కృష్ణ అన్యోన్యంగా ఉండటం చూస్తాడు. కృష్ణ వెళ్లిపోగానే శ్రీనివాసరావు తన దగ్గరకి వెళతాడు.


శ్రీనివాసరావు: ఇది స్నేహమా, ప్రేమ, భార్యాభర్తల బంధమా? మీ ఇద్దరి అగ్రిమెంట్ మ్యారేజ్ గురించి ముకుంద నాకు చెప్పింది. కానీ లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా నీ అంత సన్నిహితంగా ఉండరు. ఒక మనసు ఇద్దరినీ ఎలా ప్రేమిస్తుందో తెలియడం లేదు. అక్కడ నా కూతురు నిన్ను మాత్రమే ప్రేమించి నీకోసం ఎదురుచూస్తుంది. మీ అగ్రిమెంట్ అయిపోతే కృష్ణ వెళ్లిపోతే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఎదురుచూస్తుంది. కానీ నువ్వేమో నాలుగు రోజుల్లో వెళ్లిపోయే అమ్మాయితో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నావ్


Also Read: మినిస్టర్ ముందు రిషిని దోషిని చేసిన సారధి- తప్పు వసు మీదకి తోసేసిన శైలేంద్ర


మురారీ: మీరు మాట్లాడే దానిలో అర్థం ఉందా?


శ్రీనివాసరావు: నా కూతుర్ని ప్రేమించి ఇంకొకరికిచ్చి పెళ్లి చేశావ్


మురారీ: పెళ్లి చేసింది నేను కాదు నువ్వు చివరి నిమిషంలో వచ్చాను నేను అప్పుడు తనని ఒప్పించాను నేను రాకపోతే దోషి మీరు అయ్యే వాళ్ళు. కృష్ణ వెళ్లిపోతే తనని చేసుకుంటానని అనడంలో అర్థం ఉందా?


శ్రీనివాసరావు: మరి నా కూతురు పరిస్థితి ఏంటి?


మురారీ: అది మా పెద్దమ్మతో మాట్లాడి మీరు డిసైడ్ అవండి


శ్రీనివాసరావు: కృష్ణ వెళ్లిపోతే నువ్వు తనని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది


మురారీ: ఏం మాట్లాడుతున్నారు ముకుంద మెడలో ఆదర్శ్ తాళి కట్టాడు. పరాయి వాడి భార్యని నేను పెళ్లి చేసుకోవాలా? ఇలా వచ్చి మాట్లాడితే మిమ్మల్ని కన్న తండ్రి అనరు. సోరి ముకుంద ఉన్మాద స్థితిలో ఉంది రోజు ఆ టార్చర్ నేను భరిస్తున్నా. ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అసహ్యించుకుంటారని సహిస్తున్నా. ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గరకి పంపించింది. నా భార్య తండ్రి నా వల్ల ప్రాణాలు విడిచాడు తనకి నేను తప్ప ఎవరూ లేరు తను వెళ్లిపోతాను అన్నా నేను వెళ్లనివ్వను. ఆ అమ్మాయి గొంతు కోసి మీ అమ్మాయిని చేసుకోమనీ ఎలా అడుగుతున్నారు


Also Read: వెన్నెల ఎంట్రీ- కావ్యని పనిమనిషన్న అరుంధతి, స్వప్న కుట్ర తెలుసుకున్న కనకం


శ్రీనివాసరావు: ముకుంద బాధ చూసి అడిగాను అంతే కానీ నా బిడ్డలాంటి అమ్మాయి జీవితం ఎలా నాశనం చేస్తాను. పెళ్లికి తాళికి ఎంత విలువ ఇస్తావో అర్థం అయ్యింది పరాయి వాడి భార్యని ఎంత పవిత్రంగా చూస్తావో అర్థం అయ్యింది. ఇప్పుడు నేను ముకుంద కన్న తండ్రిగా కాకుండా పెద్ద మనిషిగా ఒక మాట అడుగుతాను. నీమీద మనసు విరిగేలా చేసి ముకుందని మా ఇంటికి పంపించు ఆదర్శ్ కోసం కొన్ని రోజులు ఎదురుచూస్తాను అప్పటికీ రాకపోతే విడాకులు ఇప్పించి వేరే పెళ్లి చేస్తాను అంతకమించి వేరే దారి లేదు