రాజ్ కోపంగా గదిలో ఉంటే వెనుకాలే కావ్య వస్తుంది. నాకు నువ్వు ఒక మాట ఇవ్వమని అడుగుతాడు. బెదిరిస్తారు ఏంటని అంటుంది. చేసేది లేక రాజ్ కి ముందుగానే చేతిలో చెయ్యి వేసి మాట ఇస్తుంది. స్వప్న విషయం అడ్డు పెట్టుకుని గొడవ చేయవద్దని అంటాడు.


రాజ్: ఏం జరిగినా సరే నా ఫ్యామిలీ ముఖ్యం. మీ అక్కలాంటి మనిషి మా ఇంటికి రావడం నాకు ఇష్టం లేదు


కావ్య: రాహుల్ లాంటి మనిషిని ప్రేమించినందుకు ఇంటికి రాక తప్పదు


రాజ్: నువ్వు ఏం చేసినా సరే మాట ఇచ్చావ్ మర్చిపోకు


మీనాక్షి స్వప్నకి పెళ్లి సంబంధం తీసుకుని వస్తుంది. పెళ్లి కొడుకు వాళ్ళు స్వప్నని చూసి నచ్చిందని చెప్తారు. నేను మీకు నచ్చడంలో ఆశ్చర్యం ఏముంది. అయినా మీ బోడి సంబంధం ఎవడికి కావాలని మనసులో అనుకుంటుంది. వెంటనే ఫోన్ తీసుకుని పెళ్లి కొడుక్కి మెసేజ్ పెడుతుంది. పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిన ఈ అమ్మాయి గురించి మీతో చెప్పకుండా దాచి పెట్టి పెళ్లి చేయాలని చూస్తున్నారు. కావాలంటే ఈ వీధిలో ఎవరిని అడిగినా చెప్తారని స్వప్న మెసేజ్ చేస్తుంది. అది చూసి పెళ్లి కొడుకు వాళ్ళ తల్లిదండ్రులకు చూపిస్తాడు. ఏంటి ఈ మోసం అని అబ్బాయి తండ్రి కోపంగా అరుస్తాడు. మీ అమ్మాయి ఇది వరకు పెళ్లి పీటల మీద నుంచి లేచిపోయిందా అని నిలదీస్తాడు. ఎవడితోనే లేచిపోయి తిరిగొచ్చిన దాన్ని మేము ఎలా చేసుకుంటామని ఛీ కొట్టేసి వెళ్లిపోతారు.


Also Read: కథని మలుపు తిప్పేసిన యష్, వేద- అభి ప్లాన్ తుస్సు, చిత్ర పెళ్లి అయిపాయే


కావ్య కాపురం నిలబడాలంటే ఈ మహాతల్లి నిజం చెప్పాలని అప్పు మనసులో అనుకుంటుంది. స్వప్న ఏడుస్తునట్టు నటిస్తూ వెళ్ళిపోతుంది. జరిగింది చాలు ఇక సంబంధాలు వెతకోద్దని కృష్ణమూర్తి అంటాడు. నేను ఎప్పటికైనా దుగ్గిరాల ఇంటి కోడలిని అవుతాను ఇలాంటి దిక్కుమాలిన సంబంధాలు చేసుకోవాల్సిన అవసరం ఏంటని స్వప్న గదిలో ఉండి సంబరపడుతుంది. కావ్య, కళ్యాణ్ పెళ్లి సంబంధం గురించి మాట్లాడుకుంటారు. వెంటనే ఈ విషయం స్వప్నకి తెలిసేలా చేయాలని కళ్యాణ్ అప్పుకి కాల్ చేస్తాడు కానీ తను లిఫ్ట్ చేయదు. ధాన్యలక్ష్మి తన కొడుకు గురించి రుద్రాణి అన్న మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. భర్త రాగానే తన మనసులో బాధ అంతా వెళ్లగక్కుతుంది. వాళ్ళ మాటలు అపర్ణ వాళ్ళందరూ వింటారు. కళ్యాణ్ నీకే కాదు నాకు కొడుకు వాడి గురించి రుద్రాణి తక్కువ చేసి మాట్లాడటం నాకు నచ్చలేదు. వెన్నెలని మొదటి నుంచి కళ్యాణ్ కి ఇచ్చి చేయాలని అనుకున్నా. కానీ తమ్ముళ్ళు అన్నయ్యకి తోడుగా ఉంటున్నారు అంతే కానీ వాళ్ళ వెనుకాల ఉండటం లేదని అపర్ణ చెప్తుంది.


Also Read: జానకి చేతిలో నుంచి జారిపడిన అమ్మవారి ముడుపు - జ్ఞానంబ చేతిలోని ఫోటోలో పిల్లలు ఎవరు?


రుద్రాణి అలా మాట్లాడటానికి కారణం తానేనని సీతారామయ్య క్షమించమని అడుగుతాడు. పెళ్లి సంబంధం చెడిపోయినందుకు కనకం వాళ్ళు బాధపడతారు. పెళ్లి సంబంధాలు చూడకు అమ్మ నేను నీలాగా మిడిల్ క్లాస్ బతుకు బతకలేనని అనేసరికి కనకం లాగిపెట్టి చెంప పగలగొడుతుంది. ఈ పెళ్లి సంబంధం చెడగొట్టింది ఎవరో కాదు ఇదేనని కనకం అనేసరికి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు. స్వప్న ఫోన్ లాక్కుని చూడమని అప్పుకి ఇస్తుంది. అందులో మెసేజ్ చూస్తుంది. దీని మీద ఇదే బురద చల్లుకుని ఇంటి పరువుని బజారున పడేసిందని కనకం తిడుతుంది. ఇంకోసారి ఇలాంటి తప్పు చేస్తే ఎవరు చెప్పినా ఈ ఇంట్లో ఉండనివ్వనని కృష్ణమూర్తి తిట్టేసి వెళ్ళిపోతాడు. రాజ్ రాహుల్ ని పిలిచి 8 లక్షలు ఎందుకు తీసుకున్నావని అడుగుతాడు. అప్పుడే కావ్య వస్తుంది. చెప్పండి రాహుల్ గారు ఏ అమ్మాయి కోసం ఖర్చు పెట్టమన్నారని కావ్య దెప్పి పొడుస్తుంది.