దివ్య విసిరేసిన మందులు తీసుకుని ఏంటి ఈ ట్యాబ్లెట్స్ అని విక్రమ్ అడుగుతాడు. అవి ట్యాబ్లెట్స్ కాదు ఒక విధంగా స్లో పాయిజన్ అనేసరికి విక్రమ్ షాక్ అవుతాడు. ఇవి ఇంట్లోకి ఎలా వస్తాయ్, వీటితో ఎవరికి అవసరం ఉందని అంటే ఆ ప్రశ్న నన్ను కాదు మీ అమ్మని అడగమని దివ్య అంటుంది. ఇవి నిన్నా మొన్నటి నుంచి కాదు ఎన్నో ఏళ్ల నుంచి వేస్తున్నారు. మావయ్య జబ్బు తగ్గడానికి కాదు ఆయన మైకంలో ఉండటానికి వేస్తున్నారు. ఇలా అయితే ఆయన మీద ఆశలు వదులుకోవాల్సిందేనని దివ్య అంటుంది. తనకేమి అర్థం కావడం లేదని కోడలు ఎందుకు ఇలా అనుమానిస్తుందోనని రాజ్యలక్ష్మి మొసలి కన్నీరు కారుస్తుంది. చేసిన తప్పు ఒప్పుకోమని దివ్య అంటుంది. మీ ఆవిడ మీ అమ్మ మీద నిందలు వేస్తుంటే హరికథ వింటున్నట్టు ఉంటావే అని బసవయ్య అడుగుతాడు. ఈ ట్యాబ్లెట్ అసలు నాన్నకి వేస్తున్నట్టు ఎవరు చెప్పారని సంజయ్ అంటాడు.


Also Read: ఏడేడు జన్మలకి కృష్ణ తన భార్యగా రావాలన్న మురారీ- ముక్కలైన ముకుంద మనసు


నర్స్ ని నిజం చెప్పమని దివ్య నిలదీస్తుంది. కానీ రాజ్యలక్ష్మి బెదిరించేసరికి నర్స్ ప్లేట్ ఫిరాయిస్తుంది. ఆ ట్యాబ్లెట్స్ ఎక్కడివని విక్రమ్ అంటే దివ్య మేడమ్ చేతిలోనే చూశానని మాట మారుస్తుంది. పెద్దయ్యకి వేసే మందులు వేరే ఉన్నాయని తీసుకొచ్చి చూపిస్తుంది. ఏంటి ఇది దేవత లాంటి అమ్మ మీద నిందలు వేస్తావా చూడు ఎలా ఏడుస్తుందోనని సంజయ్ తిడతాడు. నా కొడుకు ముందే నా పరువు తీయాలని అనుకుంటున్నావా? నాకు నా భర్త మీద ప్రేమ ఉంటుంది. నా భర్తని నేను ఎలా చంపుకుంటాను అంత రాక్షసిలాగా కనిపిస్తున్నానా అని రాజ్యలక్ష్మి ఏడవడంతో విక్రమ్ కరిగిపోతాడు. తన మాట నమ్మమని దివ్య బతిమలాడినా కూడా విక్రమ్ చీ కొట్టేసి వెళ్ళిపోతాడు.


నందుని లాస్య బతిమలాడుతుంది. జరిగినది ఏదో జరిగిపోయింది కొత్త జీవితం మొదలుపెడదాం ఇవిగో కేఫ్ కి సంబంధించిన పేపర్స్ ఇద్దరం కలిసి కేఫ్ కి వెళ్దామని చెప్తుంది. కానీ నందు మాత్రం చిరాకుగా దానితో నాకు సంబంధం లేదు రానని అంటాడు.


Also Read: పంతులు తెలివి అదుర్స్, తెలివి చూపించిన రాజ్- రాహుల్, రుద్రాణి షాక్


ఎవరో ఒకరు మాత్రమే కేఫ్ కి వెళ్ళాలి ఇద్దరం కలిసి వెళ్ళే ప్రసక్తే లేదని చెప్తాడు. వీళ్ళ మాటలు తులసి వింటూ ఉంటుంది. గొడవలు వద్దు కలిసి ఉందాం కలిసి బతుకుదామని అంటే అది జరిగే ప్రసక్తే లేదని నందు ఎదురుతిరుగుతాడు. నాకు సుఖపడే యోగం లేకపోతే ఎవరినీ సుఖంగా ఉండనివ్వను అత్తయ్య మావయ్యకి అసలే ఆరోగ్యమం బాగోలేదు వాళ్ళకి ఏ క్షణమైనా ఏమైనా జరగవచ్చని బెదిరిస్తుంది. నువ్వు ఎంత చేసినా నీతో కలిసిఉండే ప్రసక్తే లేదని నందు చెప్పేసి వెళ్ళిపోతాడు.


దివ్య మీద విక్రమ్ సీరియస్ అవుతాడు. తానేమీ అబద్ధాలు చెప్పలేదని దివ్య చెప్పినా కూడా విక్రమ్ నమ్మడు. ఇక్కడ నువ్వే అనుకుంటే అక్కడ మీ అమ్మ కూడా మనసు కలుషితం చేసేందుకు చూస్తుంది. నువ్వు అమాయకురాలివని జాగ్రత్తగా చూసుకోమని సలహాలు ఇచ్చింది. మీ అమ్మ ఇన్ డైరెక్ట్ గా మా అమ్మ మీద కామెంట్ చేసింది, ఎందుకు మీరందరూ అమ్మ మీద నిందలు వేస్తున్నారని అరుస్తాడు. నువ్వు కాబట్టి ఆగాను లేదంటే చెంప పగలగొట్టేవాడినని అంటాడు.