పరంధామయ్య, అనసూయని భోజనానికి రమ్మని చెప్తుంది లాస్య. ఏవో స్పెషల్స్ చేసి పెడతాను అని చెప్పి లాస్య పచ్చికురగాయలు తీసుకొచ్చి తినమని ముందు పెడుతుంది. అవి చూసి బిత్తరపోతారు. మీ ఆరోగ్యం కోసమే ఇదంతా అని లాస్య అంటుంది. కావాలంటే భోజనం తర్వాత తింటాం ఇప్పుడు తినడం తన వల్ల కాదని పరంధామయ్య అంటాడు. ఇక నుంచి ఇవే తిని తీరాలని లాస్య తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది. సామ్రాట్ తులసి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. డల్ గా ఉండటం చూసి ఏమైందని అడుగుతాడు. ఏమి లేదని అంటుంది. ఇద్దరూ కలిసి ఒక బర్త్ డే పార్టీకి వెళతారు.
Also Read: తిండి కోసం రోడ్డున పడ్డ అనసూయ దంపతులు- కొడుకు పరిస్థితి చూసి విలవిల్లాడిపోయిన తులసి
సామ్రాట్ తన ఫ్రెండ్ కి తులసిని పరిచయం చేయబోతుంటే ఆయన ముందే తనని గుర్తు పట్టి తెగ మెచ్చుకుంటాడు. అనసూయ, పరంధామయ్య రోడ్డు మీద వాకింగ్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. సామ్రాట్, తులసికి బిస్కెట్స్ వేస్తుంటే వద్దని అంటుంది. బర్త్ డే పార్టీ జరిగే చోటుకి పరంధామయ్య వాళ్ళు వస్తారు. ఘుమఘుమలు వాసన వస్తుంది వెళ్ళి కాస్త తినేసి వెళ్దాం అని అంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత పచ్చి కూరముక్కలు తినలేను అని వాళ్ళు తినడానికి లోపలికి వస్తారు. అనసూయ వాళ్ళు అన్నం పెట్టుకుని తినబోతు ఉండగా సెక్యూరిటీ వచ్చి వాళ్ళని ఆపుతాడు. ఎవరు మీరు అని అడుగుతాడు.
తప్పయిపోయింది అరవకు కావాలంటే తినకుండానే వెళ్లిపోతాం అని అనసూయ బతిమలాడుతుంది. కానీ సెక్యూరిటీ మాత్రం నోటికొచ్చినట్టు మాటలు అంటాడు. అది విని తులసి వాళ్ళు అనసూయ వాళ్ళని చూస్తారు. అప్పుడే సామ్రాట్ ఫ్రెండ్ వచ్చి ఏమైందని అడుగుతాడు. పెద్దవాళ్ళు తింటే తప్పేముంది పిల్లలు ఉన్నా కడుపు మాడుస్తున్నారు, అందుకే ఇలా వచ్చి తింటున్నారు అని అంటాడు. పరంధామయ్య వాళ్ళకి సోరి చెప్పి కడుపు నిండా తినమని చెప్పి కావాలంటే పార్సిల్ తీసుకుని వెళ్ళండి మీ పిల్లల్ని తినమని చెప్పండి ఎందుకు కంటారు ఇలాంటి వాళ్ళని అని అంటాడు. అప్పుడే తులసి వచ్చి ఏంటి ఇదంతా తులసి అనసూయ వాళ్ళని అడుగుతుంది.
Also Read: సరిగంగ స్నానాలాడిన దంపతులు- మనసులో ఫీలింగ్స్ బయటపెట్టిన యష్
ఇందాకే కదా మేడమ్ మిమ్మల్ని పొగిడాను ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నా. పార్టీలకి రావడం కాదు మీ పేరెంట్స్ కి తిండి పెట్టకుండా రోడ్డు మీదకి వదిలేస్తారా? రుణం తీర్చుకునే పద్ధతి ఇదేనా అని తులసిని కడిగిపారేస్తాడు. తులసిని తిట్టకండి, తన తప్పేమీ లేదు అని పరంధామయ్య క్షమించమని అడుగుతాడు. తులసి తన కుటుంబం పరిస్థితి తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. తులసి ఆఫీసులో సామ్రాట్ ని కలిసేందుకు వస్తుంది. ఎందుకో ఈ మధ్య తీసుకుంటున్న నిర్ణయాలు తప్పుగా ఉంటున్నాయి, ఇప్పుడు తీసుకోబోతున్న నిర్ణయం కోసం సలహా తీసుకుందామని వచ్చానని చెప్తుంది. సామ్రాట్ మాత్రం విషయం ఏంటో చెప్పమని అడుగుతాడు. తులసి మళ్ళీ ఆ ఇంటికి వెళ్లిపోతానని అంటుంది.
తరువాయి భాగంలో..
నందు వాళ్ళు ఇంటిని తాకట్టు పెట్టేందుకు రెడీ అయిపోతారు. ఇంటి డాక్యుమెంట్స్ మీ పేరు మీదే ఉన్నాయి కదా అని వడ్డీ వ్యాపారి అడుగుతాడు. ఉన్నాయని లాస్య చెప్తుంటే తులసి ఎంట్రీ ఇస్తుంది. ఆ డాక్యుమెంట్ ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవలేదు. శాశ్వతంగా ఈ ఇంట్లోనే ఉండటానికి వచ్చానని తులసి చెప్తుంది. సిగ్గు లేకుండా నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి ఒప్పుకొనని లాస్య అంటుంది. ఒప్పుకోకపోవడానికి అసలు మీరు ఎవరు, ఈ ఇల్లు నాది అని తులసి అనేసరికి నందు కి ఫ్యూజులు ఎగిరిపోతాయ్.