యష్, వేదని తీసుకుని రాజా వాళ్ళు గుడికి వస్తారు. ప్రతి ఏడాది మేము చేసే అన్యోన్య దాంపత్య వ్రతం ఈసారి మా మనవడు, మనవరాలు చేస్తున్నారని రాణి చెప్తుంది. గుడిలో వేద ఫోటో దిగుతుంటే రాజా నువ్వు వెళ్ళి మిమ్మల్ని నేను ఫోటో తీస్తాను అని యష్ తో చెప్తాడు. ఇద్దరూ పక్క పక్కన నిలబడి ఫోటో దిగుతారు. యష్ వేద భుజం మీద చెయ్యి వేసేసరికి మురిసిపోతుంది. దేవుడి అనుగ్రహం కోరుతూ ఆశీర్వదించమని ప్రార్దిస్తూ చేయాలని రాజా చెప్తాడు. తులసి మాలతో ముందుగా దేవుడికి పూజ చేయాలని చెప్తాడు. అన్యోన్య దాంపత్య వ్రతం చాలా విశేషమైనదని పూజారి అంటాడు. ఇది చేయడం వల్ల దంపతుల మధ్య ఉన్న చికాకులు, ఇబ్బందులు తొలగిపోయి నిండు నూరేళ్ళు అన్యోన్యంగా దాంపత్యం కొనసాగిస్తారు. అదే ఈ వ్రత ఫలం, స్వామి వారి ఆశీస్సు అని చక్కగా చెప్తారు.
Also Read: సామ్రాట్ ఎప్పుడో తన భర్త అయ్యాడన్న తులసి- నందుని సత్తు రూపాయిగా కూడా పనికి రావన్న లాస్య
కోనేటి స్నానం చేయడానికి యష్ ఇబ్బంది పడుతుంటే వేద ఆపేస్తాను అంటుంది. వద్దు నేను ఏం చేసిన నీ సంతోషం కోసమే చేస్తాను అని అంటాడు. ఇద్దరూ కలిసి కొనేటిలోకి దిగుతారు. విడివిడిగా కోనేటిలో మునగబోతుంటే అలా కాదు ఇద్దరూ జంటగా ఒకరినొకరు పట్టుకుని స్నానం చేయాలని చెప్తారు. ఇదేదే వింతగా ఉంది అని యష్ అంటాడు. అబ్బాయి మొహమాట పడుతున్నాడు భార్యగా నువ్వే చొరవ తీసుకో అని రాణి సలహా ఇస్తుంది. ఇది అన్యోన్య దాంపత్య వ్రతం అంటే ఇద్దరూ కలిసి ఒక్కటిగా చేసేది సరిగంగ స్నానం అంటారు కదా అదే చేయాలని రాజా చెప్తాడు. దీంతో వేద, యష్ ఒకరినొకరు పట్టుకుని కోనేటిలో మూడు సార్లు మునుగుతారు. ఇద్దరి చూపులు కలిసి కాసేపు రొమాన్స్ జరుగుతుంది.
Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?
ఇద్దరికీ కొత్త బట్టలు ఇచ్చి వేసుకుని రమ్మని చెప్తారు. సంప్రదాయ దుస్తుల్లో యష్ చాలా అందంగా ఉన్నాడని వేద మనసులో అనుకుంటుంది. ఒకరినొకరు కన్నార్పకుండా చూసుకుంటూ ఉంటారు. ఈరోజు వేదని చూస్తుంటే కొత్తగా, గమ్మత్తుగా అనిపిస్తుందని యష్ మనసులో అనుకుంటారు. ఒకరికొకరు స్పెషల్ గా కనిపిస్తున్నారని కాంప్లిమెంట్ ఇచ్చుకుంటారు.
తరువాయి భాగంలో..
యష్ తన మనసులో భావాన్ని వేదతో పంచుకుంటాడు. ఎప్పుడు లేనిది ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి నా మనసు కొత్తగా ఆలోచిస్తుంది. ఇక్కడి అభిమానాలు ఆత్మీయత చూశాక మన మధ్య ఉంది ఒప్పందం కాదు అంతకమించి ఇంకేదో ఉందని అనిపిస్తుందని యష్ అంటాడు. ఆ మాటకి వేద చాలా సంతోషంగా ఉంటుంది.