లాస్యని తిట్టాడని నందు దీపక్ మీద చెయ్యి చేసుకుంటాడు. దీంతో సరస్వతి కోపంగా నందూ అని అరుస్తుంది. మాజీ అల్లుడిని పట్టుకుని మర్యాద లేకుండా పేరు పెట్టి పిలుస్తారా? ఇదే సంస్కారం నీ కూతురికి కూడా వచ్చిందని లాస్య అంటే నోరు మూసుకోమని సరస్వతి తిడుతుంది.


సరస్వతి: పాతిక సంవత్సరాలు అల్లుడుగారు అని పిలిచాను ఇప్పుడు ఆ పిలుపుకి అర్హత కోల్పోయి దిగజారిపోయావ్. నా కొడుకు మీద ఎందుకు చెయ్యి చేసుకున్నావ్


నందు: నా భార్యని దూషించాడు


సరస్వతి: మరి తను నా కూతురు గురించి దూషించింది హరికథలా వింటూ నిలబడ్డావ్ తన చెంప పగలగొట్టలేదే. దాని చెంప పగలగొట్టు ఎవరు అడ్డు వస్తారో నేను చూస్తాను అని అనేసరికి దీపక్ కొట్టడానికి వెళ్తుంటే ఆపుతుంది. నువ్వు తన అక్క మాజీ భర్తవి అని గౌరవం ఇచ్చాడు అది కాపాడుకో. ఏంటి సామ్రాట్ చేసిన తప్పు ట్రీట్మెంట్ ఆగిపోతుందేమో అని భర్త స్థానంలో సైన్ చేశాడు. అందులో తప్పేముంది? పాతికేళ్లు తులసితో కాపురం చేశావ్ తను ఎలాంటిదో నీకు తెలియదా? తనతో చేరి తన బుద్ధులు వచ్చాయ్ వెళ్ళి గంగలో దూకు అనేసరికి అత్తయ్యా అని నందు గట్టిగా అరుస్తాడు. అలా పిలవకు నీతో అలా పిలిపించుకోవాలంటే అసహ్యంగా ఉంది. తులసి కళ్ళు తెరవక ముందే ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని అరుస్తుంది.


Also Read: వేద, యష్‌తో అన్యోన్య దాంపత్య వ్రతం చేయిస్తున్న రాజా- ఇద్దరు ఒక్కటి అవుతారా?


బంధం తెగిపోతుందని మౌనంగా ఉంటున్నా నేను చేయలేని పని మీరు చేశారని పరంధామయ్య అంటాడు. సామ్రాట్ ని చూసి సరస్వతి బాధపడుతుంది. స్నేహితుడిగా తులసికి పునర్జన్మ ఇచ్చావ్ అని అంటుంది. ఒక స్నేహితుడిగా తనని కాపాడుకోవడం నా బాధ్యత అని సామ్రాట్ అంటాడు. అప్పుడే డాక్టర్ వచ్చి తులసికి స్పృహ వచ్చిందని చెప్పడంతో తనని చూడటానికి అందరూ వెళతారు కానీ సామ్రాట్ మాత్రం వెళ్ళకుండా ఆగిపోతాడు. తులసి సామ్రాట్ కోసం వెతుకుతుంది. నాకు మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది కానీ మన మధ్య దూరం ఉండటమే మంచిది అని అనుకుని సామ్రాట్ డోర్ బయటే ఉండిపోతాడు. కొడుకులు, కోడళ్ళు అందరూ తులసి కాళ్ళ మీద పడిపోతారు.


ఆడుకుంటూ ఫోన్స్ సైలెంట్ లో పెట్టాం ఇంకోసారి ఇలా చెయ్యం అని అంటారు. మావయ్య తిట్టాడని ప్రేమ్ అనేసరికి టెన్షన్ లో అలా చేశానని చెప్తాడు. ‘మీ వాళ్ళందరూ ఉన్నారు ఇక నా అవసరం లేదేమో’ అని సామ్రాట్ బాధపడతాడు. నందు తనకి జరిగిన అవమానం తలుచుకుని రగిలిపోతూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు హాస్పిటల్ లో తనకి అండగా నిలబడి మాట్లాడలేదని ఆగ్రహంతో ఊగిపోతాడు. నీ దగ్గర సంపాదన లేదు ఇంక గౌరవం ఏం ఇస్తారని లాస్య దెప్పిపొడుస్తుంది. బిజినెస్ చేసేందుకు డబ్బులు ఇస్తానన్న ఫ్రెండ్ హ్యాండ్ ఇచ్చింది ఇప్పుడు మనకున్న దారి ఇంటిని తాకట్టు పెట్టడం. సంవత్సరంలో డబ్బులు కట్టి ఇల్లు తిరిగి తీసుకుందామని లాస్య ఐడియా ఇస్తుంది.


Also Read: 'తులసికి సీమంతం చేద్దామా' అని నీచంగా మాట్లాడిన లాస్య- ఇంటిని తాకట్టు పెడుతున్న నందు


ఇప్పుడు బిజినెస్ చేయకపోతే నువ్వు సత్తు రూపాయిగా కూడా పనికిరావు అని దారుణంగా అవమానిస్తుంది. తన మాటలు విని ఇల్లు తాకట్టు పెడదామని నందు అంటాడు. అందరూ తులసి దగ్గర కూర్చుని ఉంటారు. తనకేమి కాలేదని అందరూ ఎవరి పనులకి వాళ్ళని వెళ్ళమని తులసి చెప్తుంది. భర్తగా సైన్ చేసి మాట పడేలా చేసినందుకు సామ్రాట్ తులసి వాళ్ళకి సోరి చెప్తాడు. హాస్పిటల్ ఫామ్ మీద సైన్ చేసినంత మాత్రాన మీరు నా భర్త అయిపోతే నేను ఎప్పుడో మీ భార్యని అయిపోయాను అని తులసి అనే సరికి అందరూ షాక్ అవుతారు. యాక్సిడెంట్ అయి హనీ హాస్పిటల్ లో ఉన్నపుడు తల్లిగా సంతకం చేశాను. నా మనసుకి తెలుసు నేను ఎంత పవిత్రమో, నా జీవితాన్ని నాశనం చేసిన పెళ్లి గురించి ఆలోచించే ప్రసక్తే లేదు. మీరు ఎప్పటికీ నా ఆత్మబంధువే’ అని తులసి తెగేసి చెప్తుంది.