వేద గురించి ఆలోచిస్తూ ఉండగా రాజాకి గుండెల్లో నొప్పి రావడంతో అల్లాడిపోతాడు. ఆయన్ని చూసి రాణి కంగారుపడుతుంది. డాక్టర్ వచ్చి తనకి ట్రీట్మెంట్ చేసి ప్రమాదమేమి లేదని చెప్పేసరికి అందరూ ఊపిరి పీల్చుకుంటారు. రాణి బయటకి వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తుంది. తాతయ్యకి ఏమి కాలేదు అని వేద ధైర్యం చెప్పేందుకు చూస్తుంది. “ఆయనతో నాకు పదేళ్ళ వయసులో పెళ్లైంది. మాది 60 ఏళ్ల కాపురం. ఆయన లేకుండా నేను ఉండలేను. తన కంటే తన భర్త క్షేమమే భార్య కోరుకుంటుంది. ఎందుకో తెలుసా భార్య ఐదోతనం భర్త ఆయుషు మీద ఆధారపడి ఉంటుంది. భర్త, తండ్రి, అన్న, తమ్ముడైన ఆయనే నాకు. ఒక్క క్షణం కూడా నేను ఆయన్ని విడిచి ఉండలేను. నా చివరి కోరిక కూడా అదే ముత్తైదువుగా ఆయన చేతిలో కన్ను మూయాలని” అనుకుంటాను అని చాలా ఎమోషనల్ అయిపోతుంది.


Also Read: 'తులసికి సీమంతం చేద్దామా' అని నీచంగా మాట్లాడిన లాస్య- ఇంటిని తాకట్టు పెడుతున్న నందు


సమయానికి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ వేయడం వల్ల ప్రాణాలు కాపాడారు. ఈ ట్యాబ్లెట్స్ వేయడం వల్ల గుండె నొప్పి నుంచి తాతయ్యని కాపాడుకున్నారు అని డాక్టర్ వేదని మెచ్చుకుంటాడు. తన భర్తని కాపాడినందుకు రాణి వేదని మెచ్చుకుంటుంది. ‘మా రెండు గుండెలు ఒక్కటే, ఇద్దరి ప్రాణం ఒకేసారి పోతుంది. మేమిద్దరం ఒకరికోసం ఒకరు. భార్యాభర్తలు అంటే అదే మనవడా. భర్త భార్యని బాగా చూసుకోవాలి. ఇద్దరూ కలిసి మెలిసి అన్యోన్యంగా ఆనందంగా ఉండాలి. నీ భార్య నీ నుంచి ఏం కోరుకుంటుందో నీకు నువ్వే తెలుసుకోవాలి. ఎవరు చెప్పక్కర్లేదు. భార్యని సంతోషంగా ఉంచడం భర్త బాధ్యత’ అని రాజా యష్ కి చెప్తాడు.


పూజారి రాజా ఇంటికి వచ్చి ప్రతి ఏడాది అన్యోన్య దాంపత్యం వ్రతం చేస్తారు కదా ఈసారి చేయాలని గుర్తు చేద్దామని అంటాడు. తాతయ్యకి ఆరోగ్యం బాగోలేదని వ్రతం చేయలేరని వేద అంటుంది. అయితే కొత్త దంపతులు వేద వాళ్ళతో చేయించమని అంటాడు. అందుకు వేద ఊరు వెళ్లాలని ఖుషి ఎదురుచూస్తూ ఉంటుందని చెప్తుంది. వ్రతం కోసమే దేవుడు మిమ్మల్ని ఇక్కడికి పంపించినట్టు ఉన్నాడు చెయ్యమని రాజా, రాణి యష్ ని అడుగుతాడు. యష్, వేద దాని గురించి పక్కకి వెళ్ళి మాట్లాడుకుంటారు. ‘ఊర్లో పూజలు, వ్రతాలు గురించి మీకు తెలియదు కొన్ని పనులు చేయాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నేనే ఏదొరకంగా మాట్లాడి వ్రతం చేయలేనని చెప్పి ఒప్పిస్తాను’ అని వేద అంటుంది.


Also Read: సౌందర్యని కలిసిన దీప, కార్తీక్ ని కలిసిన పిల్లలు- చారుశీలకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మోనిత


‘నువ్వు చెప్పింది నిజమే అసలు నాకు ఈ ట్రిప్ కి రావడం కూడా ఇష్టం లేదు. మీ అమ్మమ్మ తాతయ్య కోసం నేను ఇక్కడికి రావడం ఏంటని అనుకున్నా. అయినా వచ్చాను అంటే అది నీ కోసమే. కానీ ఇప్పుడు ఆలోచిస్తే వాళ్ళు చాలా క్యూట్. నిన్నే కాదు నన్ను కూడా బిడ్డలా చూసుకున్నారు. నాకు చాలా నచ్చారు. ఇన్ని రోజులు ఉన్నాం, ఇంకొక రెండు రోజులు ఉండి వ్రతం చేసి వెళ్దాం. పెద్దవాళ్ళు సంతోషపడతారు. నువ్వు సంతోషపడతావ్, నీ సంతోషమే నా సంతోషం అలాగే చేద్దాం’ అని యష్ అంటాడు. మీరు చెప్పినట్టే ఈ వ్రతం చేస్తాం అని వేద, యష్ చెప్తాడు. ఈ వ్రతం చేసిన దంపతులు ఖచ్చితంగా ఒకటి అవుతారని రాజా అంటాడు. వ్రతం చేసేందుకు అందరూ గుడికి వస్తారు.