అటు కార్తీక్, ఇటు దీప మోనిత మాటలు తలుచుకుని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. మోనితని మళ్ళీ ఇటు రాకుండా చేయాలి అప్పుడే దీప మనశ్శాంతిగా ఉంటుందని కార్తీక్ అనుకుంటాడు. అప్పుడే దీప భయంగా డాక్టర్ బాబు అని గట్టిగా అరుస్తుంది. జీవితంలో మొదటిసారి భయంగా ఉందని ఏడుస్తుంది.


దీప: మోనిత గుర్తొస్తున్న ప్రతిక్షణం గుండె వణికిపోతుంది


కార్తీక్: తన గురించి నీకు తెలిసిందే కదా, నిన్ను భయపెట్టడానికి ఇలా చేస్తుంది. అయినా నువ్వు భయపడటం ఏంటి


దీప: బతికుంటే భయపడకుండా ఉండేదాన్ని కాదు పరిస్థితి వేరు. మేము ఉండగానే మీకు తెలియకుండా మీ బిడ్డకి తండ్రి అయ్యింది. మీ ఫోటోస్ చూపించి చట్టపరంగా ఇరికిస్తుందేమో. నేను లేకపోయినా మీరు సంతోషంగా ఉండాలంటే..


కార్తీక్: ఎన్ని సార్లు చెప్పాను అలా మాట్లాడొద్దని


దీప: నాకు బతకాలని ఉంది, నన్ను బతికించండి డాక్టర్ బాబు మీతో కలిసి వెయ్యి సంవత్సరాలు బతకాలని ఉంది. ఏదో ఒకటి చెయ్యండి


Also Read: యష్, వేదని కలిపేందుకు పడిన తొలిఅడుగు- రాజాకి గుండెపోటు, టెన్షన్ లో రాణి


సౌందర్య నిద్రలేచి బయటకి వచ్చేసరికి దీప బయట కూర్చుని ఉంటుంది. తనని చూసి సౌందర్య చాలా సంతోషపడుతుంది. కార్తీక్ ఎక్కడ అని అడుగుతుంది. మెల్లిగా మాట్లాడండి పిల్లలు లేస్తారు అని దీప కంగారుపడుతుంది. లోపలికి రమ్మని సౌందర్య అంటుంది కానీ దీప మాత్రం ఇప్పుడు కాదు తర్వాత వస్తానని చెప్తుంది. పిల్లలు మీకోసం రోడ్ల మీద పడి పిచ్చి వాళ్ళలాగా వెతుకుతూ ఉన్నారని అంటుంది. కార్తీక్ ఎక్కడ ఎందుకు రాలేదని పదే పదే అడుగుతుంది. అసలు ఏమైందని ఏడుస్తూ అడుగుతుంది.


దీప: ఆయన దగ్గరకి తీసుకెళ్తాను కానీ ఒక మాట ఇవ్వండి


సౌందర్య: మాట ఇస్తాను కానీ ముందు కార్తీక్ ఎక్కడ అసలు ఏం జరిగిందో చెప్పవే


దీప: నేనే వెళ్ళి ఆయన్ని తీసుకొస్తాను వచ్చినాక మాత్రం మీరు నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు. నేను వచ్చినట్టు పిల్లలకి మాత్రం ఇప్పుడప్పుడే చెప్పొద్దు


సౌందర్య: అసలు ఎక్కడికి వెళ్తున్నావ్. ముందు ఏం జరిగిందో చెప్పు అనేసరికి దీప తనని పక్కకి తీసుకెళ్తుంది.


మోనిత కార్తీక్ ఫోటోస్ చూస్తూ ఉండేసరికి చారుశీల వస్తుంది. కార్తీక్ ని నేను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతుంటే ఈ మోనిత జైలు నుంచి బయటకి వచ్చి కార్తీక్ అని వెంటపడుతుంది. ఈ మోనిత ఇక్కడే ఉంటే కార్తీక్ ని మర్చిపోవాల్సిందే అని మనసులో అనుకుంటుంది. అది గమనించిన మోనిత ఏం ఆలోచిస్తున్నావ్ అని అడుగుతుంది. ఏం లేదు కార్తీక్ సర్ చాలా బాగున్నారు, మీరు వెంటపడటంలో తప్పు లేదని అనిపిస్తుందని చెప్తుంది.


Also Read: తులసికి భర్తగా మారిన సామ్రాట్- బెనర్జీ బుట్టలో పడిన నందు, లాస్య


మోనిత: మరి విషయం తెలిసి కూడా ఎందుకే నాకు కాంపిటీషన్ రావాలని చూస్తున్నావ్


చారుశీల: నీకు కాంపిటీషన్.. నేనా ఏం మాట్లాడుతున్నావ్


మోనిత: మరి నీ ఫోన్లో ఇన్ని కార్తీక్ ఫోటోస్ ఎందుకు ఉన్నాయ్. నాటకాలు ఆడకు. నేను జైల్లో ఉన్నప్పుడు నా పనులు చక్కబెట్టుకోవడానికి నిన్ను పిలిపించుకుంటే నువ్వు నా కార్తీక్ కి గాలం వేసి లాక్కోవాలని అనుకుంటున్నావా?


చారుశీల: నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్. ఇక్కడ జరిగే ప్రతిదీ చెప్పాను కదా


మోనిత: అన్ని చెప్పావ్ కార్తీక్ మీద మోజు తప్ప. కార్తీక్ ని సొంతం చేసుకుంటే ఆస్తి కూడా వస్తుందని ఆశపడుతున్నావ్ ఏమో ఆరడుగుల నెలలో కప్పేస్తా ఏమనుకుంటున్నావో


శౌర్య, హిమ రోడ్డు మీద నడుస్తూ తల్లిదండ్రుల గురించి అందరినీ అడుగుతూ ఉంటారు. అటు కార్తీక్ దీప కోసం రోడ్డు మీద వెతుకుతూ ఉంటాడు. హిమ శౌర్య కోసం చాక్లెట్స్ కొనిస్తానని డబ్బులు బయటకి తీస్తుంది అది చూసిన దొంగ వాటిని కొట్టేసి పారిపోతూ ఉంటాడు. వాడిని పట్టుకునేందుకు వెంటపదతంటే దొంగ వాళ్ళని తోసేయడంతో కార్తీక్ పట్టుకుంటాడు. తండ్రిని చూసి చాలా ఎమోషనల్ అయిపోయితారు. ఆ సీన్ సూపర్ గా ఉంటుంది.


తరువాయి భాగంలో..


పిల్లలు కార్తీక్ ని కౌగలించుకుని ఏడుస్తూ ఉండగా దీప, సౌందర్య వస్తారు. తల్లిని చూసి ఏడుస్తూ తన దగ్గరకి వెళతారు. నువ్వు అనుకున్నదే చేశావ్ దీప నన్ను అమ్మ వాళ్ళకి అప్పగిస్తానని చెప్పిన మాటకి కట్టుబడి ఉన్నావ్ అని కార్తీక్ మనసులో అనుకుంటాడు.