వేదని యష్ అర్థం చేసుకోలేకపోయినందుకు బాధపడుతుంది. ‘ఇందులో ఆయన తప్పు ఏముంది నేను ఏమడిగానో అదే చేశారు నా సంతోషం కోసమే చేశారు. నా మాటకి గౌరవం ఇస్తున్నారు. కానీ చిన్న తేడా ఏంటంటే ఆయన నాకు ఇచ్చే విలువ ఖుషికి తల్లిగా మాత్రమే తనకి భార్యగా కాదు. మా ఇద్దరి మధ్య ఉన్న ఒప్పందం కూడా అదే కదా. బిడ్డల్ని కనలేని నాకు ఒక బిడ్డకి అమ్మని చేశాడు. అది చాలు కదా సరిపెట్టుకోవాలి. భార్య స్థానం కోసం ఆశ పడటం నాదే తప్పు. అందరి ఆడవాళ్ళలా నేను కాదు కదా. అందరిలా అమ్మ అయ్యే యోగ్యత నాకు లేదు కదా’ అని తను రాసిన ప్రేమ లేఖ చింపేస్తూ గుండెలు పగిలేలా ఏడుస్తుంది. తనకి తాను సర్ది చెప్పుకుంటుంది.


Also Read: తులసికి భర్తగా మారిన సామ్రాట్- బెనర్జీ బుట్టలో పడిన నందు, లాస్య


యస్ వేద సంతోషం ఏమైనా చేస్తానని అన్నాడు అది చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఉందని చెప్పడానికి, వాళ్ళని ఒక్కటి చెయ్యడానికి అని రాజా రాణితో చెప్తాడు. వేద నిద్రపోకుండా జరిగింది తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. తన జీవితం ఎందుకు ఇలా అయ్యింది అని కుమిలిపోతుంది. యష్ తన ప్రేమ అర్థం చేసుకోలేకపోవడంలో ఆయన తప్పేమీ లేదని వేద అనుకుంటూ లేచి కూర్చుంటుంది. యష్ కి మెళుకువ వచ్చి వేదని ఏమైందని అడుగుతాడు. అటు ఇంట్లో ఖుషి నిద్రలో ఉలిక్కిపడి అమ్మా అని గట్టిగా అరిచి లేస్తుంది. సులోచన లేచి ఏమైందని అడుగుతుంది. అమ్మ పిలిచినట్టు అనిపించిందని అంటుంది. వేద ఖుషికి అమ్మ అవడమె కాదు, యష్ కి భార్య అవడం, ఈ ఇంటికి కోడలు అవడం మా అదృష్టం అని సులోచన అనుకుంటుంది.


Also Read: 'నా యాక్టింగ్ నమ్మేశావా' అంటూ షాకిచ్చిన యష్- గుండెలు పగిలేలా ఏడ్చిన వేద


వేద నిద్రపోతు ఉంటే యష్ లేచి తనని చూస్తూ ఉంటాడు. వేద గొప్పతనం గురించి మెచ్చుకుంటాడు. ‘నీకు ఇవ్వడమే తెలుసా ఆడగకపోవడం నా తప్పా. ఖుషికి తల్లిగా నువ్వు న్యాయం చేస్తున్నావ్ మరి నీకు భర్తగా నేను న్యాయం చేస్తున్నాన? మన మధ్య ఉన్నది ఒప్పందమా అంతకమించి ఏమైనా ఉందా? మనం దగ్గరగా ఉన్నా మనసులు దూరంగా ఉన్నాయా’? అని ఆలోచిస్తూ ఉంటాడు. రాజా వేద, యష్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వేద పరిస్థితి తలుచుకుని కన్నీళ్ళు పెట్టుకుంటాడు. వాళ్ళిద్దరినీ ఎలా కలపాలో నాకు అర్థం కావడం లేదని టెన్షన్ పడుతూ ఉండేసరికి రాజాకి గుండెనొప్పి వస్తుంది. తన పరిస్థితి చూసి రాణి చాలా కంగారుపడుతుంది.


తరువాయి భాగంలో..


వేద, యష్ ని కలిపేందుకు రాజా ప్లాన్ వేస్తాడు. వాళ్లిద్దరితో దాంపత్య వ్రతం చేపించేందుకు గుడికి తీసుకుని వస్తారు. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి జంటగా చేసే వ్రతం అని ఒకరినొకరు పట్టుకుని కోనేటిలో మునగాలి అని చెప్తాడు.