నందుకి జరిగిన అవమానానికి లాస్య రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. అప్పుడే అందరూ ఇంటికి వస్తారు. ఎవరి దారిన వాళ్ళు లోపలికి వెళ్లబోతుంటే ఆగండి అని అరుస్తాడు. నా గురించి ఏమనుకుంటున్నారు అందరూ ఈ ఇంటి మనిషిని కాదా, ఆటలో అరటిపండు అనుకుంటున్నారా అని అరుస్తాడు. ఇలాంటి ఆలోచనలు తమకి లేవని పరంధామయ్య అంటాడు. అలాంటప్పుడు తులసి అమ్మ అని నందు అంటుంటే అత్తయ్యగారు అను పెద్దావిడ గౌరవించమని అనసూయ అంటుంది.


నందు: మీ అందరి ముందే ఆవిడ మమ్మల్ని తీసి పారేసినట్టు మాట్లాడి బెదిరించింది, మీలో ఏ ఒక్కరైనా నాకు సపోర్ట్ గా నిలబడ్డారా, తప్పు అలా అనకూడదని నచ్చజెప్పారా? బుర్రకథ వినట్టు విన్నారు ఇప్పుడు ఆవిడని వరసపెట్టి పిలవలేదని బుద్ధి చెప్తున్నారా? ఏం జరుగుతుంది


ప్రేమ్: ఏం జరుగుతుందో మీకు తెలుసు కాకపోతే పైకి చెప్పుకోలేకపోతున్నారు. హాస్పిటల్ లో జరిగిన దాన్ని అక్కడే వదిలేయండి. అమ్మ కొలుకుంది అందరం సంతోషంగా ఉన్నాం స్పాయిల్ చెయ్యొద్దు


నందు: మీకు మీ సంతోషమే ముఖ్యమా, నాకు జరిగిన అవమానం పట్టదా


అభి: హాస్పిటల్ లో అలా మాట్లాడి ఉండాల్సింది కాదు డాడ్


Also Read: సరిగంగ స్నానాలాడిన దంపతులు- మనసులో ఫీలింగ్స్ బయటపెట్టిన యష్


శ్రుతి: ఆంటీ క్రిటికల్ కండిషన్ లో ఉంటే సేఫ్ గా ఉండాలని కోరుకోవాల్సింది పోయి బురద ఎత్తి పోశారు


అంకిత: మీ మాటలు వింటే మాకే ఏదోలా అనిపించింది ఇక అమ్మమ్మ ఆంటీ వాళ్ళ అమ్మ తనకి ఆ కోపం రావడం సహజం


పరంధామయ్య: కేవలం తులసిని రక్షించాలనే ఆరాటంతో వేరే దారి లేక భర్త అని సైన్ చేశాడు. అందరూ సామ్రాట్ ని గురించి గొప్పగా చెప్తారు. ఇంట్లో వాళ్ళు అందరూ లాస్యని టార్గెట్ చేసి మాటలు అంటుంటే నందు కోపంతో రగిలిపోతూ ఉంటాడు. ప్రేమ్, శ్రుతి లాస్యకి గట్టిగా ఇస్తుంది. అందరూ నందుకి వ్యతిరేకంగా మాట్లాడేసరికి ఆగ్రహంతో రగిలిపోతూ బిజినెస్ డెవలప్ మెంట్ కోసం ఇంటిని తాకట్టు పెడదామని అనుకున్నా, మీకు చెప్పి కన్వీన్స్ చేద్దామని అనుకున్నా కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రేపే ఈ ఇల్లు తాకట్టు లోకి వెళ్తుందని చెప్పేసి వెళ్ళిపోతాడు. ఆ మాటకి అందరూ షాక్ అవుతారు.


శ్రుతి తులసికి ఫోన్ చేసి నందు వాళ్ళు ఇంటిని తాకట్టు పెట్టబోతున్నారని చెప్తుంది. అంత అవసరం ఏమొచ్చిందని తులసి అడుగుతుంది. బిజినెస్ కోసం చేస్తున్నానని చెప్పారు. ఎవరు మాట వినేది లేదని చెప్పేస్తున్నారని చెప్తుంది. ఆ ఇల్లు తాకట్టుకి వెళ్తే మళ్ళీ తిరిగిరాదు ఆశలు వదిలేసుకోవాల్సిందే ఏదో ఒకటి చేయాలి అని తులసి అనుకుంటుంది. ప్రేమ్ శాలరీ డబ్బులు లెక్కబోతుంటే లాస్య వచ్చి ఇంటి ఖర్చులు మెయింటెన్ చేస్తామన్నారు కదా ఇవ్వరా అని డబ్బులన్నీ లాగేసుకుంటుంది. అవసరాలకి అడిగితే ఇస్తాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అవసరాలు అయినా మానుకుంటా కానీ తన దగ్గర డబ్బులు తీసుకొను అని అనుకుంటాడు.


Also Read: సామ్రాట్ ఎప్పుడో తన భర్త అయ్యాడన్న తులసి- నందుని సత్తు రూపాయిగా కూడా పనికి రావన్న లాస్య







శ్రుతిని హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళడానికి డబ్బులు లేక ప్రేమ్ తన తల్లి గిఫ్ట్ గా ఇచ్చిన తాకట్టు పెట్టడానికి వస్తాడు. అదంతా తులసి చూసి బాధపడుతుంది. కడుపుతో ఉన్న భార్యని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని ప్రేమ్ అనేసరికి షాపు అతను గిటార్ అమ్మేయమని అడుగుతాడు. అమ్మడం తన వల్ల కాదని అప్పుగా డబ్బులు ఇవ్వమని అంటాడు. షాపు అతను మాత్రం అప్పు కుదరదని అమ్మేస్తే డబ్బులు ఇస్తానని చెప్తాడు. దీంతో ప్రేమ్ చాలా బాధగా దాన్ని అమ్మేసి డబ్బులు తీసుకుని వెళ్ళిపోతాడు. లాస్య డబ్బులు లాక్కున విషయం ప్రేమ్ తన ఫ్రెండ్స్ కి చెప్తాడు. అది విని తులసి చాలా బాధపడుతుంది.

 

తరువాయి భాగంలో.. 

అనసూయ, పరంధామయ్య ఆకలికి తట్టుకోలేక ఒక ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి తినడానికి వెళతారు. అదే ఫంక్షన్ లో తులసి, సామ్రాట్ కూడా ఉంటారు. పరంధామయ్య తినబోతుంటే సెక్యూరిటీ వచ్చి వాళ్ళని తిట్టడంతో తులసి అక్కడికి వచ్చి వాళ్ళని చూసి బాధపడుతుంది.