పార్టీ చేసుకుంటూ ఉండగా శ్రుతి కాలు జారి కిందపడిపోతుంది. దీంతో హాస్పిటల్ కి తీసుకొస్తారు. నందు హాస్పిటల్ కి వచ్చి తులసి మీద చిందులు తొక్కుతాడు. తన వారసుడికి ఏమైనా అయితే ఊరుకోను అని నందు తులసి, సామ్రాట్ వాళ్ళని వార్నింగ్ ఇస్తాడు. అప్పుడే అంకిత బాధగా బయటకి వస్తుంది. తనని చూసి తులసి కంగారు పడుతుంది. టెస్ట్ లు అన్ని చేశామని రిపోర్టులు రావాలని చెప్తుంది. ఇంట్లో అనసూయ, పరంధామయ్య కూడా టెన్షన్ గా తులసికి ఫోన్ చేస్తారు. శ్రుతి కిందపడిందా, హాస్పిటల్ లో ఉందా అని అడుగుతాడు. ప్రమాదం ఏమి లేదు కదా అని కంగారుగా అడుగుతాడు. ఈ విషయం కూడా లాస్య తనకి అనుకూలంగా మాట్లాడుతుంది. నీ మాట మీద నమ్మకం లేక మావయ్య వాళ్ళు తులసికి ఫోన్ చేశారు అని ఎక్కిస్తుంది.
ఆ మాటకి అభి లాస్య మీద అరుస్తాడు. ఎందుకు మిస్ లీడ్ చేసేలా మాట్లాడతావ్ అని అంటాడు. దివ్య కూడా లాస్యని తిడుతుంది. లాస్య మళ్ళీ నందుకి కంప్లైంట్ చేసేలా మాట్లాడేసరికి నందు తన మీద అరుస్తాడు. శ్రుతి మెడికల్ రిపోర్ట్ తీసుకొచ్చిన డాక్టర్ కంగారు పడాల్సిన పని లేదు తన కడుపులో బిడ్డ బాగానే ఉందని చెప్తుంది. ఆ మాట విని అందరూ ఊపిరి పీల్చుకుంటారు. నందు శ్రుతిని చూడటానికి వెళ్లబోతుంటే తులసి ఆపుతుంది. ఉగ్రరూపంగా వచ్చి నా మీద అరిచి ఇప్పుడు నా వైపు కూడా చూడకుండా పిల్లిలా పారిపోతున్నారు ఏంటని తులసి నిలదీస్తుంది. ఇందాక నోటికొచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు మీకు సమాధానం చెప్తాను వినండి అని అంటుంది. వినే ఆసక్తి లేదని నందు అంటాడు.
తులసి: వినాల్సిన అవసరం ఉంది. కుటుంబాన్ని మీకు దగ్గర చేసింది మిమ్మల్ని నా గుప్పిట్లో పెట్టుకోవాలని కాదు. కుటుంబం విడిపోకూడదు అని నాన్న ప్రేమ దూరం చెయ్యకూడదని కానీ అది మీరు అర్థం చేసుకుంటుంటే మీ పక్కన ఉన్న శని అడ్డుపడుతూనే ఉంటుంది.
లాస్య: తులసి.. అని కోపంగా అరుస్తుంది
తులసి: గొంతు తగ్గించు నువ్వు అరిస్తే పడటానికి నేనేమీ నీ ఇంట్లో పనిమనిషిని కాదు. కోరి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నా వదిలేశారు. పైసా సంపాదన లేకపోయినా మీ మొగుడు పెళ్ళాలని పోషించాను. మోసం చేసి ఇల్లు రాయించుకుంది అది వెన్నుపోటు అంటే. మీకే కాదు వాడు నాకు వారసుడు
ప్రేమ్: ముందు నీ వారసుడు, ఆ తర్వాత ఆయనకే వారసుడు
లాస్య: అంతా మీ ఇష్టమేనా
తులసి: అవును మా ఇష్టమే, అసలు నీకు దీనితో సంబంధం లేదు. ఈ గోడవకి కారణం నువ్వే ఇంట్లోకి రానిచ్చి ఉంటే పార్టీ అక్కడే చేసుకునే వాళ్ళం ఇది జరిగేది కాదు కదా. ఇంకోసారి మా స్నేహం గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇస్తుంది.
Also Read: షాకిచ్చిన భ్రమరాంబిక, బిక్కమొహం వేసిన అభిమన్యు- ప్రేమపక్షుల విహారయాత్ర అధ్బుతం
డిశ్చార్జి అవగానే మీతోనే ఇంటికి వస్తానని ప్రేమ్ అంటాడు. కానీ తులసి మాత్రం మీకు మాట ఇచ్చాను దానికే కట్టుబడి ఉంటాను పరిస్థితి చెయ్యి దాటితే మాత్రం చేయగలిగేది ఏమి లేదని తులసి నందుకి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత అందరూ వెళ్ళి శ్రుతి ని చూస్తారు. తులసి, సామ్రాట్ కూడా చూసి వెంటనే వెళ్ళిపోతారు. తులసి వెళ్తూ నందు మాటలు తలుచుకుని చాలా బాధపడుతుంది. శ్రుతిని తీసుకుని ప్రేమ్ వాళ్ళు ఇంటికి తీసుకుని వస్తారు. ఎప్పుడెప్పుడు ఏం తీసుకోవాలి అనేది తులసి ఆంటీ చీటి రాసి ఇచ్చిందని చెప్పి అంకిత పేపర్ ఇస్తుంది. అలాగే తన కోసం గ్లూకోజ్ కూడా కొనిచ్చిందని తప్పకుండా తాగాలని చెప్తుంది. ఆ మాటలు విని లాస్య, నందు రగిలిపోతారు. తులసి కల్పించుకోవడం తనకి ఇష్టం లేదని నందు అంటాడు. కానీ అనసూయ మాత్రం తన కోడలి కోసం తులసి చేస్తే తప్పేంటి అని అంటుంది.