గుప్పెడంత మనసు డిసెంబరు 29 ఎపిసోడ్  ( Guppedantha Manasu  December 29th Update Today Episode 646)


రిషి-వసుధార గురించి జగతి టెన్షన్ పడుతుంటుంది..ఏంకాదు అన్నీ రిషి చూసుకుంటాడని మహేంద్ర ధైర్యం చెబుతాడు. దేవయాని అక్కయ్యని తక్కువ అంచనా వేయొద్దంటూ హెచ్చరిస్తుంది జగతి... అదే సమయానికి దేవయాని ..రాజీవ్ తో ఫోన్ మాట్లాడుతుంది. వాళ్ల ప్రేమను చెడగొట్టి-వాళ్లిద్దర్నీ విడగొట్టి-నా మరదలి మెడలో తాళికడతాను అని దేవయానితో సవాల్ చేస్తాడు రాజీవ్...దేవయాని క్రూరంగా నవ్వుకుంటుంది. అటు ధరణి కాఫీ తీసుకెళ్లి మహేంద్ర-జగతికి ఇస్తుంది... అది చూసిన దేవయాని మీరు ఏం జరగాలని ఆశిస్తున్నారో అది జరగనివ్వను అని అనుకుంటుంది. 


వసుధారకు ఫోన్ కొని ఇచ్చిన తర్వాత రిషి ఆమెను ఇంటి దగ్గర్లో దించుతాడు. వసు డల్ గానే ఉంటుంది... 
రిషి: ఇంకా కొన్ని గంటలే కదా మనమధ్య ఈ దూరం 
వసు: ఆశిద్దాం సార్..నేను కూడా కొన్ని అపురూపమైన క్షణాలకోసం ఆశిస్తున్నాను
రిషి: ఎందుకు డల్ గా ఉన్నావో అర్థం కావడం లేదు
వసు: జీవితమంటేనే ఊహలు 
రిషి: ఈ ఫోన్ నీకోసమే అని రిషి ఇస్తాడు..తీసుకుని అక్కడి నుంచి డల్ గా వెళ్లిపోతుంటుంది... కష్టంలో నష్టంలో ఎలాంటి పరిస్థితిలో అయినా నేను నీకు ఉన్నానని గుర్తుపెట్టుకో అని భరోసా ఇస్తాడు. వసుధార వెళ్లిపోయేవరకూ అలాగే నిల్చుని ఉంటాడు. వసుధార ఏమైనా దాస్తోందా...అని అనుకుంటాడు..


Also Read: మోనితను సైడ్ చేసేసిన డాక్టర్ చారుశీల, దీపను చంపేసి కార్తీక్ ను పెళ్లిచేసుకునేందుకు స్కెచ్!


ఇంట్లోకి ఎంటరయ్యేసరికి..తండ్రి ఉగ్రరూపంతో కూర్చుని ఉంటాడు...తల్లి సుమిత్ర ఏడుస్తుంటుంది...
చక్రపాణి: ఎవడో వచ్చాడంట ఇది వెళ్లిందట..నేను పరువు పరువు అని కొట్టుకుంటుంటే అది వెళ్లింది..రానీ..దాని సంగతి చెబుతాను...
ఇంతలో ఇంట్లోకి ఎంటరవుతుంది వసుధార... సుమిత్రకి టెన్షన్ పెరిగిపోతుంటుంది..తండ్రిని చూసి భయంభయంగా అడుగుపెడుతుంది వసుధార... ఆగు అని అరుస్తాడు చక్రపాణి..
చక్రపాణి: వాడెవడు
వసు: నాన్న...మర్యాద..
చక్రపాణి: ఏంటి..మర్యాదా..ఎవడే వాడు..ఇక్కడికి ఎందుకు వచ్చాడు, నువ్వెందుకు వెళ్లావ్..సమాధానం చెప్పాకే లోపలకు రా
వసు: నా కాబోయే మొగుడు..
సుమిత్ర-చక్రపాణి షాక్ అయి చూస్తుంటారు..ఏమన్నావ్...
వసు: తను నాకు కాబోయే భర్త అన్నాను..అనవసరంగా ఆవేశపడొద్దు..
చక్రపాణి: ఏం తల్లివే నువ్వు
వసు: ఇందులో అమ్మ తప్పేముంది..ప్రతి చిన్నదానికీ పెళ్లాంపై అరవడం గొప్పేంకాదు.. చక్రపాణి చేయి ఎత్తడంతో.. ప్రశాంతంగా వినండి..వచ్చింది రిషి సార్..మేం ఇద్దరం ఒకర్నొకరం ఇష్టపడ్డాం..పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం... 
చక్రపాణి: అంతా మీ ఇష్టమేనా
వసుధార: ఇది నా జీవితం నాన్నా...నా యిష్టమే
చక్రపాణి: ఎవడో ఏంటో తెలియదు
వసుధార: తెలియాల్సింది మీకు కాదు నాకు.. అమ్మా..పంచాంగం చూసి చెబితే వాళ్లు వస్తారు మనింటింకి..పద్ధతి ప్రకారం సంబంధం మాట్లాడతారు..ఏం టైమ్ కి రావాలో చెప్పు చాలు..
చక్రపాణి: మా అనుమతి అవసరం లేదా..అన్నీ నువ్వే మాట్లాడుకుంటున్నావ్..
వసు: పెద్దరికం అంటే పెత్తనం కాదు..ఓ బాధ్యత.. తండ్రి అంటే ప్రేమగా మాట్లాడాలి..కష్టం వస్తే ఓదార్చాలి..కన్నీళ్లొస్తే తుడవాలి..మీకు నేనున్నాను అని చెప్పగలగాలి..అంతేకానీ నేను చెప్పిందే వినాలి అంటే దాన్ని పెద్దరికం అనరు.. మీ మాట నెగ్గించుకోవడం ముఖ్యం..నీ కూతుర్ల భవిష్యత్ ఎలాఅయినా పోనీ..అక్కయ్యల పెళ్లిళ్లు అలా మెడలు వంచి చేశావ్ ఇప్పుడేం అయింది..ఓ అక్క చచ్చి బతికిపోయింది, ఇంకో అక్క బతికి చస్తోంది.. పెళ్లి విషయంలో మిమ్మల్ని ఎదురించడం నాకు ఇష్టం కాదు..అది నా హక్కు... అక్కయ్యల్లా తలొంచుకుని నువ్వుచెప్పింది వినను..తాళి కట్టించుకోను.. రిషి సార్ నా జీవితం..రిషి సార్ తోనే నా జీవితం..నువ్వు సెల్ ఫోన్ పగలగొట్టలగలవు..రిషి సార్ కొనిచ్చారు.. ఫోన్ అయినా మనసు అయినా బంధాన్ని అయినా పగలగొట్టడం గొప్పకాదు..కలపడమే గొప్ప...ఎదుటివారి అభిప్రాయాలను గౌరవించడం గొప్ప..
చక్రపాణి: మేం వద్దన్నా వాడినే పెళ్లిచేసుకుంటావా... 
వసు: ఒక్కమాట విను అర్థం చేసుకో ప్లీజ్..ప్రేమించాను..పద్ధతి ప్రకారం పెళ్లిచేసుకుంటాను..వాళ్లు ఇంటికొచ్చి మాట్లాడతారు.. మీరొప్పుకుంటే సరే సరి.. లేదంటే..
చక్రపాణి: లేదంటే పెళ్లి చేసుకుంటావా...
వసు: మీ పరువు కోసం రిషి సార్ ను వదులుకోలేను..ఓ చెడ్డ కూతురని మీరు అనుకున్నా పర్వాలేదు.. రిషి సార్ నే పెళ్లి చేసుకుంటాను.ఎందుకంటే తనతోనే నా జీవితం...


Also Read: నీ భర్తని అని అందరికీ పరిచయం చేయమన్న రిషి , ఎంట్రీ ఇచ్చిన రాజీవ్


రిషి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటాడు..ఇది వసుధార పెరిగిన స్థలం..నాతో కలిసి వసుధార జీవితాంతం నడవబోతోంది అని సంతోషపడుతూ ఉంటాడు. వసు అన్న మాటలు తలచుకుని ఏమైందని ఆలోచనలో పడతాడు. మరోవైపు  వసుధార కొత్త ఫోన్ తీసుకుని దాంట్లో రిషి ఫోటోలు చూస్తూ మురిసిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడకి సుమిత్ర వస్తుంది. మీ నాన్నతో అలా మాట్లాడతావా అని తల్లి అడిగితే.. భర్తను గౌరవించు కానీ వారి మూర్ఖత్వాన్ని కూడా గౌరవించాలనుకోవడం తప్పు అని చిన్న క్లాస్ వేస్తుంది. నువ్వు ఒకసారి నా కోసం గట్టిగా ప్రయత్నం చేయమ్మా నేను ఇలా ఆలోచించకపోతే నా జీవితం కూడా అక్క జీవితం లాగే అయిపోతుంది అని అనడంతో సుమిత్ర ఆలోచనలో పడుతుంది. అప్పుడు వసుధార రిషి ఫోటో సుమిత్రకు చూపించడంతో మహారాజులా ఉన్నాడు అంటుంది. వారిద్దరూ రిషి గురించి మాట్లాడుకుంటారు. 


మరోవైపు దేవయానికి రిషి ఫోన్ చేస్తాడు. హాల్లో ఉన్నారా పెద్దమ్మా... అయితే అందరిని ఒకసారి పిలవండి అని అంటాడు. ధరణి వెళ్లి అందర్నీ పిలుచుకుని వస్తుంది. అప్పుడు రిషి వసుధార ఏ క్షణంలో అయిన మనల్ని బయలుదేరమని చెప్పొచ్చు అందరు రెడీగా ఉండండి అని అంటాడు. దాంతో దేవయాని షాక్ అవుతుంది అందరూ సంతోషపడతారు.