నువ్వు చూపించని లోకాన్ని సామ్రాట్ తులసికి చూపిస్తున్నాడు. బంగారం లాంటి అవకాశాన్ని ఛీ పొ అని అంటుందా..  తులసి పిచ్చిది కాదు.. తనలో ఈ మార్పు రావడానికి కారణం నువ్వే కేవలం నువ్వే కాదని అంటావా అని లాస్య అంటుంది. ఆ మాటలకి గతంలోకి వెళతాడు నందు. ఫ్లైట్ ఎక్కాలని నా మొదటి ఆశ ఎలాగూ రేపు మీరు ముంబయి కి ఫ్లైట్ లోనే వెళ్తున్నారు కదా నన్ను కూడా తీసుకెళ్లవచ్చు కదా అని తులసి నందుని అడుగుతుంది. అబ్బో ఆశలు చాలానే ఉన్నాయి. కిరీటం నెత్తి మీద ఉండాలి చీపురు తలుపు మీద ఉండాలి గుర్రం పని గుర్రం చెయ్యాలి గాడిద పని గాడిద చెయ్యాలి. పిచ్చి పిచ్చి ఆలోచనలు పక్కన పెట్టి ఇంట్లో పని చూస్కో. పిచ్చి రాతలు ఆపేసి రేపటి నా ప్రయాణానికి సూట్ కేస్ సర్దు అని చెప్తాడు.


నువ్వు చేసింది తప్పు అనడం లేదు అప్పటి పరిస్థితుల్లో అది కరెక్ట్. కానీ అది ఇప్పుడు తులసికి తప్పులాగా అనిపిస్తుంది. కట్లు తెంచుకున్న గుర్రానికి ఒక గమ్యం అంటూ ఉండదు.. అవకాశం దొరికింది కాబట్టి అది ఎటైనా వెళ్తుంది. కట్లు తెంచుకున్న తులసి ఇప్పుడు దూకుడుగా సామ్రాట్ వైపు వెళ్తుంది. సామ్రాట్ కూడా అదే చేస్తున్నాడు. తులసి ప్రాజెక్ట్ కి ఇన్వెస్ట్ చెయ్యడం సామ్రాట్ మొదటి అడుగు, తనతో పాటు వైజాగ్ తీసుకుని వెళ్ళడం రెండో అడుగు.. ఏడడుగుల్లో రెండు అడుగులు పూర్తైనట్టే. వైజాగ్ నుంచి తిరిగి వచ్చాక మిగతా  ఐదు అడుగులు పడతాయని చెప్తుంది. అలా ఏమి జరగదని నందు అంటాడు. జరుగుతుంది రేపో మాపో తులసి సామ్రాట్ కంపెనీకి బాస్ అవుతుందని అనుమానంగా ఉంది అప్పుడు మన పరిస్థితి ఏంటి తులసి కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలా. తులసి జీవితానికి నీకు సంబంధం లేదని దులిపేసుకుని కూర్చోకు మనం ఎంత దూరంగా వెళ్దామని అనుకున్నా తులసి అంత వేగంగా మన వెనకే వస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాల్సిందే తులసి సామ్రాట్ కి దగ్గర కాకుండా చూసుకుంటే కానీ మనకి ఫ్యూచర్ ఉండదు అని లాస్య హెచ్చరిస్తుంది. ఆ మాటకి నందు కోపంగా వెళ్ళిపోతాడు. ఈ మట్టి బుర్రకి ఒకసారి చెప్తే అర్థం కాదు నేనే ఏదో ఒక విధంగా తులసికి బ్రేక్ వేయాలని అనుకుంటుంది.


Also Read: కాంచన గురించి ఇంట్లో చెప్పి మంట పెట్టిన మాళవిక- ఖైలాష్ ని యష్ విడిపిస్తాడా?


హ్యపీగా ఎంజాయ్ చెయ్యమని దేవుడు నీకు అవకాశం ఇస్తే బాధపడటానికి కారణం వెతుక్కుంటావ్ ఏంటి ఇలా అయితే నువ్వు ఎప్పటికీ ప్రశాంతంగా ఉండలేవని పరంధామయ్య అంటాడు. అవును ఆంటీ బాధ్యతలు ఎప్పుడు ఉంటాయి కాసేపు వాటిని తీసి పక్కన పెట్టి ఎంజాయ్ చెయ్యాలని అంకిత చెప్తుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది అదే అనేసరికి తులసి మీరందరూ చెప్తున్నారుగా అలాగే చేస్తా.. నేను విమానం ఎక్కుతా అని చిన్నపిల్లలాగా సంబరపడుతుంది. నేను మా అమ్మ ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు ఇప్పుడు ఆ అదృష్టం నాకు దక్కపోతుందని ఆనందపడుతుంది. బావిలో కప్పలాగా పెరిగాయను పెళ్లి కూడా నా జీవితాన్ని మార్చలేకపోయింది వైజాగ్ సినిమాల్లో చూశాను ఇప్పుడు స్వయంగా నేనే అక్కడికి వెళ్తున్నాను సంతోషంగా ఉందని చెప్తుంది. నువ్వు ఎదుగుతూ ఉంటే ఇలాంటివి ఎన్నో జరుగుతాయని పరంధామయ్య చెప్తాడు. ఇక కుటుంబం అంటా కలిసి విమాన ప్రయాణం గురించి తెగ చెప్పుకుంటూ ఓవర్ యాక్షన్ చేసేస్తారు.


అప్పుడే సామ్రాట్ తులసికి ఫోన్ చేస్తాడు. రేపు మన ఫ్లైట్ 10 గంటలకి నేనే వచ్చి మిమల్ని పికప్ చేసుకుంటాను అని అంటాడు. వద్దు నేనే వస్తాను ఒంటరిగా ప్రయాణం చెయ్యడం అలవాటు చేసుకుంటానని తులసి అంటే నేను ఉండగా మీరు ఒంటరిగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఏముందని అంటాడు. నన్ను నేను నమ్ముకుందామని చెప్పడంతో సరే అంటాడు సామ్రాట్. తులసి నిద్రపోతుంటే సామ్రాట్ ఫోన్ చేస్తాడు. తులసిగారు ఎక్కడ ఉన్నారు 8 అవుతుంది ఇంక రాలేదేంటి అని అడుగుతాడు. ఒళ్ళు తెలియకుండా నిద్రపోయాను సారీ అంటుంది. ఇలా అవుతుందనే నేను వచ్చి పికప్ చేసుకుంటానని చెప్పాను మీరు వినలేదు ఫస్ట్ ఫ్లైట్ మిస్ అయ్యింది మీరు వెంటనే బయల్దేరి రాకపోతే రెండో ఫ్లైట్ కూడా మిస్ అవుతుందని సామ్రాట్ అంటాడు. ఆ మాటకి కంగారుగా తులసి మంచం దిగబోతు కిందపడిపోతుంది. లేచి టైం ఇంక 4 అయ్యింది అంటే సామ్రాట్ గారి ఫోన్ కలనా అని అనుకుంటుంది. నీ కలలకి రెక్కలొచ్చి ఎగిరే సమయం వచ్చింది ఇంక దేని గురించి ఆలోచించకుండా రెడీ అయిపో అని తులసి తనకి తాను చెప్పుకుంటుంది. తులసి రెడీ అయి ఇంట్లో అందరికీ అన్ని పనులు చెప్తుంది. ప్రేమ్ ఎయిర్ పోర్ట్ దగ్గర దించుతానని అంటే వద్దని చెప్తుంది. అందరూ కలిసి సంతోషంగా తులసిని పంపిస్తారు.


Also Read: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి


తరువాయి భాగంలో..


నందు, లాస్య తులసి ఇంటికి వస్తారు. ఇక మరో ఇద్దరు ఆడవాళ్ళు వచ్చి ఇంట్లో తులసిగారు లేరా అని అడుగుతారు. వాళ్ళ బాస్ తో కలిసి ఫ్లైట్ లో పక్క పక్కన కూర్చుని వైజాగ్ ఎగిరిపోయింది. ఇలా పరాయి మగవాడితో కలిసి చెత్త పట్టాలేసుకుని తిరిగే వాళ్ళని ఏమంటారని లాస్య అంటే పక్కన ఉన్న ఆవిడ తిరుగుబోతు అని అంటుంది. ఆ మాటకి ఇంట్లో అందరూ బాధ పడతారు.