Gowtam Tinnanuri MAGIC Release Date: ‘మళ్లీ రావా’, ‘జెర్సీ’ సినిమాలతో ఆడియన్స్‌లో సెన్సిబుల్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు గౌతం తిన్ననూరి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో ఒక యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నారు. దీనికి ముందు వచ్చిన గ్యాప్‌లో ఆయన అందరూ కొత్తవాళ్లతో ‘మ్యాజిక్’ అనే సినిమాను తెరకెక్కించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. మ్యూజికల్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ‘మ్యాజిక్’కు మ్యూజిక్ అందించారు.
డిసెంబర్‌లో రిలీజ్...
క్రిస్మస్ వీకెండ్‌లో డిసెంబర్ 21వ తేదీన ‘మ్యాజిక్’ ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. రామ్ చరణ్, శంకర్‌ల భారీ సినిమా ‘గేమ్ ఛేంజర్’ను మొదట ఈ డేట్‌కు విడుదల చేద్దామనున్నారు. దీంతో ‘మ్యాజిక్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయకుండా హోల్డ్ చేశారు. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’ అఫీషియల్‌గా 2025 జనవరి 10న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో ‘మ్యాజిక్’ను డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ చేస్తున్న అనౌన్స్‌మెంట్ ఇచ్చేశారు.
‘దేవర’ తర్వాత అనిరుధ్ మ్యూజిక్
‘దేవర’తో దేశం మొత్తాన్ని ఊపేసిన అనిరుధ్ ‘మ్యాజిక్’కు కూడా సంగీతం అందిస్తున్నాడు. ‘దేవర’ తర్వాత అనిరుధ్ చేస్తున్న తెలుగు సినిమా కావడంతో ఈ సినిమాపై ఆడియో పరంగా భారీ అంచనాలు నెలకొంటాయి. ప్రస్తుతం ఉన్న ట్రెండ్‌లో సాంగ్స్ సినిమాకు హైప్ తీసుకువస్తున్నాయి కాబట్టి ఒక మంచి పాటతో ‘మ్యాజిక్’కు ఆకాశమంత హైప్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ‘మ్యాజిక్’కు హైప్ తెచ్చే బాధ్యత అనిరుధ్ రవిచందర్‌పైనే ఉంది.
సితారలో చిన్న సినిమా...
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై బ్యానర్‌పై వచ్చే సినిమా అంటేనే మార్కెట్లో కొన్ని అంచనాలు ఉంటాయి. అలాంటిది ఒక చిన్న సినిమాకు సూర్యదేవర నాగవంశీ బ్యాకింగ్ ఉందంటే అందులో కంటెంట్ ఏ రేంజ్‌లో ఉందో అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దానికి తోడు గౌతం తిన్ననూరి మీద కూడా ఆడియన్స్‌కు నమ్మకం ఉంది. కాబట్టి కంటెంట్ క్లిక్ అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు చేసే అవకాశం ఉంది.
జోనర్ ఏంటి?
మ్యూజికల్ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కినట్లు పోస్టర్లను చూస్తే తెలుస్తోంది. ఈ జోనర్లో టాలీవుడ్‌లో తెరకెక్కిన సినిమాలు చాలా తక్కువ. కాబట్టి సినిమా ఆడియన్స్‌కు మంచి ఫ్రెష్ ఫీల్ అందిస్తుందని అనుకోవచ్చు. సినిమా నుంచి టీజర్, సాంగ్స్ వంటి కంటెంట్ బయటకు వస్తే సినిమా మీద మరింత ఐడియా వస్తుంది.
Read Also: ‘పుష్ప 2’, ఎన్టీఆర్ నీల్ ‘డ్రాగన్’లకు మైత్రీ క్రేజీ డీల్ - బాలీవుడ్‌లో ఇంక జాతరే!