రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోయిన్లలో ఆ తరహా కల్ట్ ఫైన్ ఫాలోయింగ్ ఉన్న అమ్మాయిల్లో సాయి పల్లవి (Sai Pallavi) ఒకరు. వీళ్ళిద్దరూ కలిసి సినిమా చేస్తే చూడాలని కామన్ ఫ్యాన్స్ కోరిక. టాలీవుడ్ ఆడియన్స్ చాలా మంది ప్రభాస్, సాయి పల్లవిని జంటగా చూడాలని కోరుకుంటున్నారు. ఈసారైనా వాళ్ళ కాంబినేషన్ కుదురుతుందో? లేదో?
సుకుమార్ దర్శకత్వంలో అన్నారు గానీ...
ప్రభాస్, సాయి పల్లవి కలిసి సినిమా చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని వార్తలు రావడం ఇదేమీ కొత్త కాదు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అప్పుడు ప్రభాస్, సాయి పల్లవి జంటగా నటిస్తారని వినిపించింది. కానీ, ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు.
హను రాఘవపూడి దర్శకత్వంలోని 'ఫౌజీ'లో...
ప్రజెంట్ ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో 'ఫౌజీ' (Fauji Movie) ఒకటి. అందులో కొత్త అమ్మాయి ఇమాన్ ఇస్మాయిల్ అలియాస్ ఇమాన్వీని కథానాయికగా ఎంపిక చేశారు. అయితే, ఈ సినిమాలో మరొక కథానాయికకు కూడా చోటు ఉందట. ఆ పాత్రలో నటించమని సాయి పల్లవిని సంప్రదించినట్టు సమాచారం.
రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో 'ఫౌజీ' రూపొందుతోంది. ఇందులో ప్రభాస్ (Prabhas role in Fauji)ది బ్రాహ్మణ యువకుడి పాత్ర అని సమాచారం. నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఆయన స్థాపించిన ఆజాద్ హిందూ ఫౌజ్ నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయట. సుమారు 30 నిమిషాల పాటు ఉండే ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం కథానాయికగా సాయి పల్లవిని అడుగుతున్నారట. ఆవిడతో పాటు మరికొంత మంది కూడా లిస్టులో ఉన్నారని, అయితే దర్శకుడు హను రాఘవపూడి ఫస్ట్ ఛాయస్ సాయి పల్లవి అట. ఇటీవల ఆమెను కలిసి కథ, ఆ క్యారెక్టర్ గురించి చెప్పగా... సాయి పల్లవి ఇంకా తన నిర్ణయాన్ని చెప్పలేదట.
Also Read: హీరోలను వెయిట్ చేయిస్తూ... నిర్మాతలను ఇబ్బంది పెడుతున్న శ్రీ లీల?
ఫిబ్రవరి 7న 'తండేల్' సినిమాతో సాయి పల్లవి థియేటర్లలోకి రానుంది. అది కాకుండా హిందీలో రణబీర్ కపూర్ సరసన సీతగా 'రామాయణ' సినిమాలో నటిస్తోంది. మరో రెండు మూడు సినిమాలు ఆవిడ చేతిలో ఉన్నాయి. ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే... మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో 'సలార్ 2', నాగ్ అశ్విన్ దర్శకత్వంలో 'కల్కి 2898 ఏడీ 2', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' ఉన్నాయి.