Priyanka Chopra Remuniration : 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీలో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా నటించబోతున్న సంగతి తెలిసిందే. రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమాగా రూపొందబోతున్న ఈ మూవీ కోసం ఆమె భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసిందని, ఆమె డిమాండ్ ను నిర్మాతలు కూడా ఓకే చెప్పారనే టాక్ ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.
ప్రియాంక చోప్రాకు భారీ రెమ్యునరేషన్
సూపర్ స్టార్ మహేష్ బాబు - దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ వరల్డ్ మూవీ 'ఎస్ఎస్ఎంబీ 29'. ఈ మూవీ గురించి టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూవీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రీసెంట్ గా 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ అఫీషియల్ గా మొదలైన సంగతి తెలిసిందే. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోంది అన్న విషయం ఆమె హైదరాబాదులో అడుగు పెట్టిన తర్వాత కన్ఫర్మ్ అయింది. ఇక తాజాగా కీరవాణి, రాజమౌళిలతో కలిసి దిగిన ఫోటోలు తెగ వైరల్ కావడంతో ఆమె హీరోయిన్ అని స్వయంగా రాజమౌళి కన్ఫామ్ చేసినట్టు అయ్యింది.
ఇక ఇప్పటికే 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ టెస్ట్, వర్క్ షాప్ వంటి పనులని ప్రియాంక చోప్రా పూర్తి చేసినట్టు సమాచారం. ఇదిలా ఉంటే 'ఎస్ఎస్ఎంబీ 29' సినిమా కోసం ప్రియాంక చోప్రా భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటుందనే వార్త ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ మూవీ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా 30 కోట్లు పారితోషకంగా అందుకుంటుందని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.
ప్రియాంక చోప్రా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే తన మార్కెట్ కు తగ్గట్టుగా ప్రియాంక చోప్రా భారీగానే డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే చిత్ర బృందం కూడా ఆమె పాపలారిటీని దృష్టిలో పెట్టుకొని, ప్రియాంక అడిగినంత రెమ్యూనరేషన్ ఇవ్వడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. కానీ మరోవైపు హాలీవుడ్ మీడియా మాత్రం ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ 40 కోట్లకు తగ్గదు అంటోంది. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముంది అనే విషయం పక్కన పెడితే, ప్రియాంక రెమ్యూనరేషన్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చాలామంది స్టార్ హీరోలు కూడా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ అందుకోలేకపోతుండడం గమనార్హం.
'ఎస్ఎస్ఎంబీ 29' షూటింగ్ అప్డేట్
ఇక మరోవైపు జక్కన్న 'ఎస్ఎస్ఎంబీ 29' మూవీ పూజా కార్యక్రమాలను ఎలాంటి హడావుడి లేకుండా జనవరిలోనే పూర్తి చేశారు. ఇక ఇప్పుడు టీం ఈ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ షూటింగ్ ను హైదరాబాదులోని అల్యూమినియం ఫ్యాక్టరీ, కెన్యా అడవుల్లో, అలాగే మరికొన్ని కీ లొకేషన్లో షూట్ చేయబోతున్నారని అంటున్నారు. ఇప్పటికైతే హైదరాబాద్లో ఈ మూవీ షూటింగ్ జరుగుతుందనేది లేటెస్ట్ అప్డేట్. అయితే ఈ మూవీ నుంచి అఫిషియల్ అప్డేట్ కోసం అటు జక్కన్న, ఇటు మహేష్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.