Nithiin's Robinhood Release Out Of Christmas 2024 Race: యూత్ స్టార్ నితిన్ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'రాబిన్ హుడ్'. ఆయన హిట్ సినిమా 'భీష్మ'కు దర్శకత్వం వహించిన వెంకీ కుడుముల మరోసారి హిట్ మ్యాజిక్ రిపీట్ చేసేందుకు తీసిన చిత్రం ఇది. క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న థియేటర్లలోకి సినిమాను తీసుకు రావాలని ప్లాన్ చేశారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... విడుదల వాయిదా పడింది. 


క్రిస్మస్ బరిలో కాదు... జనవరిలో రిలీజ్?
క్రిస్మస్ బరి నుంచి నితిన్ సినిమా వెనక్కి వెళ్ళింది. డిసెంబర్ 25న సినిమాను విడుదల చేయడం లేదు. కొత్త ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జనవరిలో విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని సినిమా యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అందుతోంది.


నితిన్ జంటగా శ్రీ లీల నటించిన 'రాబిన్ హుడ్' సినిమాలో మరో యంగ్ హీరోయిన్ కేతికా శర్మ కూడా ఉన్నారు. సినిమాలో ఆవిడ ఒక స్పెషల్ సాంగ్ చేశారు. 'అదిదా సర్‌ప్రైజ్'ను రిలీజ్ చేయాలనుకుని, వాయిదా వేశారు. అసలు మ్యాటర్ ఏమిటని ఆరా తీస్తే సినిమా వాయిదా పడిందని తెలిసింది. అదీ సంగతి!


Also Readఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?






జనవరిలో సంక్రాంతి ఫెస్టివల్ సీజన్ మీద ఆల్రెడీ కొన్ని సినిమాలు టార్గెట్ చేశాయి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' సినిమా జనవరి 10న విడుదల అవుతుంటే... నట సింహం నందమూరి బాలకృష్ణ 'డాకు మహారాజ్' జనవరి 12న విడుదలకు సిద్ధమైంది. విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. సో... సంక్రాంతికి నితిన్ సినిమా రావడం కాస్త కష్టమే. ఆ ఫెస్టివల్ సీజన్ వదిలేస్తే... రిపబ్లిక్ డే సీజన్ అయినటువంటి జనవరి 26న సినిమాలు ఏవి లేవు. అందువల్ల అప్పుడు వచ్చే అవకాశాలు ఉన్నాయట.


Also Read: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్ కల్యాణ్?



నితిన్, శ్రీ లీల జంటగా నటించిన 'రాబిన్ హుడ్' సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్రొడ్యూస్ చేశారు. ఇందులో నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్, 'వెన్నెల' కిషోర్ ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి రచన - దర్శకత్వం: వెంకీ కుడుముల, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, నిర్మాతలు: నవీన్ ఎర్నేని - వై రవిశంకర్, సీఈవో: చెర్రీ, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: సాయి శ్రీరామ్, కూర్పు: కోటి.