మెగా కుటుంబానికి, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ (Salman Khan) మధ్య మంచి అనుబంధం ఉంది. మెగాస్టార్ చిరంజీవి అడగడంతో గాడ్ ఫాదర్ సినిమాలో స్పెషల్ రోల్ చేశారు సల్లూ భాయ్. ఇప్పుడు మరో మెగా సినిమాలో సల్మాన్ ఖాన్ స్పెషల్ రోజు చేస్తున్నారా? ఫిలిం నగర్ సర్కిళ్ళలో, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజం ఎంత? అనే వివరాల్లోకి వెళ్తే...


రామ్ చరణ్ 16వ సినిమాలో సల్మాన్ ఖాన్?
Salman Khan special role in Ram Charan Movie: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా సినిమా రూపొందుతోంది. 'ఉప్పెన' వంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు తీస్తున్న చిత్రం ఇది. అటు హీరో రామ్ చరణ్ కెరీర్లో 16వ సినిమా. అందుకని ఆర్సీ 16 అంటున్నారు. అయితే ఈ సినిమాకు 'పెద్ద' టైటిల్ ఖరారు చేశారు. కానీ, ఆ విషయాన్ని ఇంకా వెల్లడించలేదు. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక కీలక పాత్ర చేస్తున్నారనేది ప్రస్తుతం జరుగుతున్న ప్రచారం. 


దర్శకుడు బుచ్చిబాబు సానా అటువంటిది ఏమీ లేదని ఫిల్మ్ ఇండస్ట్రీలోని సన్నిహితులు కొంతమందికి కన్ఫర్మ్ చేశారు. తమ సినిమాలో సల్లూ భాయ్ యాక్ట్ చేస్తున్నారనేది ఫేక్ న్యూస్ అని తేల్చేశారు. సో... చెర్రీ సినిమాలో బాలీవుడ్ కండలు వీరుడిని చూడాలంటే మరికొన్ని రోజులు ఆగక తప్పదు. సల్మాన్ ఖాన్, పూజా హెగ్డే జంటగా నటించిన 'కిసీ క భాయ్ కిసీ కి జాన్' సినిమాలోని ఒక పాటలో రామ్ చరణ్ సందడి చేశారు. సల్మాన్ చరణ్ వెంకీ కలిసి స్టెప్పులు వేశారు.


రామ్ చరణ్ సినిమాలో మీర్జాపూర్ మున్నాభాయ్!
రామ్ చరణ్ జంటగా నయా అతిలోక సుందరి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు దివ్యేందు ఒక కీలక పాత్ర చేస్తున్నారు. అమెజాన్ ప్రైమ్ వీడియో వెబ్ సిరీస్ 'మీర్జాపూర్' ద్వారా అతడు తెలుగు ప్రేక్షకులలో కూడా అయ్యాడు అందులో మున్నాభాయ్ క్యారెక్టర్ చేశాడు. ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ సైతం మరొక కీలక పాత్ర చేస్తున్నారని సమాచారం.


Also Readఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?



హైదరాబాద్ సిటీలో షూటింగ్ చేస్తున్న చరణ్!
ప్రస్తుతం 'పెద్ది' సినిమా (Peddi Movie) చిత్రీకరణ హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఏరియాలో గల బూత్ బంగ్లాలో జరుగుతుంది. రామ్ చరణ్ సహా ఇతర కీలక తారాగణం పాల్గొంటుండగా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వారం రోజుల పాటు షూటింగ్ చేసిన తర్వాత రామ్ చరణ్ బ్రేక్ తీసుకుంటారు. 'గేమ్ చేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా వెళ్తున్నారు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత షూటింగ్ మొదలు పెడతారు.


Also Read: ‘పుష్ప 2’ పాట్నా ఈవెంట్‌పై సిద్ధూ అక్కసు... మాములు డ్యామేజ్ కాదిది - పుసుక్కున అలా అనేశాడేంటి?