Mohan Babu Family Dispute News: ఎంటర్‌టైన్‌మెంట్‌ ఫీల్డ్‌లో టామ్‌ అండ్‌ జెర్రీ సిరీస్ ఎంత ఫేమస్సో ఫిల్మ్ ఇండస్ట్రీలో చిరంజీవి వర్సెస్ మోహన్ బాబు తగాదాలు అంతే ఫేమస్‌. పైకి మేమంతా ఫ్రెండ్స్‌ అని చెప్పుకుంటూనే ఉన్నా సమయం దొరికినప్పుడల్లా వారి మధ్య విభేదాలు, సెటైర్లు కంటిన్యూ అవుతూనే వస్తున్నాయి. చిరంజీవితో తనను తాను కంపేర్ చేసుకోవడం పోటీ పడడం మోహన్ బాబు చాలా కాలం నుంచి చేస్తూనే వచ్చారు. గొప్ప నటుడుగా పేరున్న మోహన్‌ బాబు చిరంజీవి సినిమాలుకు గట్టి పోటీ ఇచ్చారు. విలన్‌గా ప్రస్తానం ప్రారంభించి హీరోగా కలెక్షన్ కింగ్‌గా ఎదిగారు. ఈ ఇద్దరు దిగ్గజాల మధ్య జరిగిన వివాదాలతో ఆ రెండు కుటుంబాల వ్యవహారాలపై వద్దన్నా కంపేరిజన్ వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒకేరోజు జరిగిన రెండు ఇష్యూలు మళ్లీ మెగా వర్సెస్ మంచు పోలికను తెరపైకి తెచ్చింది.


అన్నను మంత్రిని చేసిన తమ్ముడు
9 డిసెంబర్ 2024 మెగా ఫాన్స్ మర్చిపోలేని రోజు. మెగా బ్రదర్‌గా ఫ్యాన్స్‌కి మెగా హీరోస్‌కి మధ్యలో వారధిలా పనిచేసే నాగబాబుని ఏపీ మంత్రి వర్గంలోకి తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేన విజయం వెనకాల ఈ ఎన్నికల్లో నాగబాబు పడిన కష్టం చాలా పెద్దదే. ఆయనకు టిటిడి ఛైర్మన్ లేదా రాజ్యసభ సభ్యత్వం లభిస్తుంది అని అందరూ అంచనా వేశారు. కానీ వాటిపై ఆశ లేదంటూ ఆయన తప్పుకున్నారు. 


నాగబాబు పడిన శ్రమకు సరైన గౌరవం దక్కాలంటూ తమ్ముడు పవన్ కల్యాణ్‌ ఏకంగా మంత్రినే చేశారు. పైకి చెప్పకపోయినా నాగబాబుకి మంత్రి పదవి దక్కడంలో పవన్ పాత్రని పక్కన పెట్టలేం. నరసాపురంలో 2019లో ఓటమి చెందినా 2024లో పోటీకి సిద్ధపడ్డారు. అనకాపల్లి సీటు కోసం ప్రయత్నించారు. కానీ కూటమి కోసం తప్పుకోవాల్సి వచ్చింది. అయినా నాగబాబు ఏమాత్రం స్థైర్యం కోల్పోలేదు. పైగా తమ్ముడి వెంటే ఉన్నారు. 


మరో వైపు రాజకీయంగా అన్నయ్య చిరంజీవితో సైద్దాంతిక విభేదాలు ఉన్నా పవన్ మాత్రం ఆయన్ని తన తండ్రి లాగానే ట్రీట్ చేశారు. ఎన్నికల్లో గెలవగానే వెళ్లి ఆయన కాళ్ళ మీద పడిన దృశ్యం అభిమానులే కాకుండా తెలుగు వాళ్లందరి గుండెలను తడిమింది. రాజకీయ విభేదాలు ఉన్నా మెగా బ్రదర్స్ మాత్రం ఎప్పుడు ఒకేలా ఉన్నారు.


కేసులు పెట్టుకున్న మంచు బ్రదర్స్ 
9 డిసెంబర్ 2024 క్రమశిక్షణకు మారు పేరుగా ఉన్న మంచు మోహన్ బాబు కుటుంబానికి ఒక చెడ్డ రోజు అనే చెప్పాలి. ఆ కుటుంబంలో రేగిన గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునే వరకూ వెళ్ళింది. గతంలో కూడా తన ఇంటికి వచ్చి అన్నయ్య మంచు విష్ణు దాడికి దిగుతున్నారంటూ ఒక వీడియోను రిలీజ్ చేశారు మనోజ్. తర్వాత గొడవ సద్దుమణిగినా నిన్న ఏకంగా కేసులు వరకూ ఈ గొడవ వెళ్ళింది. తన ఆత్మగౌరవం కోసం పోరాడుతున్నాను తప్ప ఆస్తుల కోసం కాదంటూ మంచు మనోజ్ చెప్పారు.  


Also Read: మంచు మనోజ్ నుంచి నాకు ప్రాణహాని ఉంది - పోలీసులకు మోహన్ బాబు ఫిర్యాదు


దుబాయ్‌లో ఉన్న మంచు విష్ణు హైదరాబాద్ చేరుకున్నారు. ఏ కుటుంబం కుటుంబంలోనైనా గొడవలు సహజమని త్వరలోనే అన్ని సర్దుకుంటాయని చెప్పారు. అన్నదమ్ముల మధ్య జరుగుతున్న గొడవను సద్దుమణిగేలా చేయడానికి పెద్దలు రంగంలో దిగారు. ఏదేమైనా మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు ఇలా రచ్చ కెక్కడం మోహన్ బాబు అభిమానుల్ని బాధిస్తోంది. 


సినీ వజ్రోత్సవాల నుంచి మంచు వర్సెస్ మెగా 
అప్పుడెప్పుడో చిరంజీవికి వజ్రోత్సవాల సందర్భంగా లెజెండ్ అని బిరుదు ఇచ్చి మోహన్ బాబుకి సెలబ్రిటీ అనే టైటిల్ ఇవ్వడంతో గొడవ మొదలైంది. తాను ఎందుకు లెజెండ్ కాదంటూ మోహన్ బాబు వేదికపైనే నిర్వాహకులను ప్రశ్నించారు. దీనికి చిరంజీవి కూడా బాధపడుతూనే రిప్లై ఇచ్చారు. అప్పుడు మొదలైన మోహన్ బాబు vs మెగాస్టార్ పోలికలు మధ్యలో కొంత కాలం సద్దుమణిగినట్టే కనిపించినా 'మా ' ఎన్నికల సందర్భంగా మళ్లీ మొదలయ్యాయి. 


సోషల్ మీడియా విపరీతంగా పెరిగిపోయిన ఈ రోజుల్లో రెండు పెద్ద ఫ్యామిలీలో నెలకొన్న రెండు ఘటనలను పోలుస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఏదైనా టాలీవుడ్‌లో ప్రభావం చూపించే అతిపెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీలో నెలకొన్న వివాదం త్వరలోనే ముగిసిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.


Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?