Paytm Batch meaning in Telugu: పేటీఎం... డిజిటల్ పేమెంట్స్ కోసం ప్రజలు ఉపయోగించే ఒక యాప్. గూగుల్ పే, ఫోన్ పే, క్రెడ్ తదితర యాప్స్ తరహాలో అదీ ఒక యాప్. అయితే మిగతా యాప్స్ కంటే భిన్నంగా దాని పేరు ప్రజల్లోకి వెళ్లింది. 'పేటీఎం బ్యాచ్' అనేది క్రియేట్ అయ్యింది. సోషల్ మీడియాలో ఆ పేరు పెట్టి కొందర్ని తిట్టడం ప్రారంభించారు. మరికొందరు విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అసలు, 'పేటీఎం బ్యాచ్' అంటే ఏమిటి? ఎవర్ని అలా పిలుస్తారు? అనేది చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, సోషల్ మీడియాలో వైసీపీకి అండగా పోస్టులు చేస్తూ మిగతా పార్టీలను విమర్శించే వాళ్ళను 'పేటీఎం బ్యాచ్' అని అనడం గమనించవచ్చు.


వైసీపీకి అండగా వుంటే పీటీఎం బ్యాచ్ అనేస్తారా?
ఒక పార్టీకి అండగా పోస్టులు చేస్తే పేటీఎం బ్యాచ్ అనేస్తారా? వైసీపీకి మద్దతుగా ఒక పోస్ట్ చేశారని సదరు నెటిజనులపై ముద్ర వేయడం ఎంత వరకు కరెక్ట్? అని సాటి వ్యక్తికి కొందరికి సందేహం రావచ్చు. ఇక్కడ మతలబు ఏమిటంటే... ఇతర పార్టీల మీద బురద జల్లడం కోసమే సోషల్ మీడియాల్లో కొన్ని ఖాతాలు పని చేశాయి. వాళ్ల టార్గెట్ ఒక్కటే... ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy), ఆయన వైసీపీ పార్టీలకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడితే వాళ్లను సోషల్ మీడియాలో బద్నామ్ చెయ్యడమే. పోస్టుకు ఐదు రూపాయల నుంచి మొదలు పెడితే... ఆ ఖాతాను ఎంత మంది అనుసరిస్తున్నారు? అనే దాన్ని బట్టి పేటీఎంలో డబ్బులు పడతాయని ప్రచారం ఉంది. అందుకే, వాళ్లకు 'పేటీఎం బ్యాచ్' అని పేరు పెట్టారట.
 
నారా చంద్రబాబు నాయుడును కావచ్చు... లేదంటే జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ను కావచ్చు... ఎవరైతే తిడతారో వాళ్ల పేటీఎం ఖాతాల్లో డబ్బులు పడతాయని ప్రచారం జరిగింది. తిట్టు... డబ్బులు కొట్టు కాన్సెప్ట్ అన్నమాట. ఇప్పుడు వాళ్ళ భవితవ్యం ఏమిటి? అనేది ప్రశ్నార్థకంగా మారింది.


ఇప్పుడు 'పేటీఎం బ్యాచ్' పరిస్థితి ఏమిటి?
ఏపీలో వైసీపీ పార్టీ ఘోర పరాయజంతో వచ్చే ఐదేళ్లు 'పేటీఎం బ్యాచ్' పరిస్థితి ఏమిటి? అనేది పలువురి మదిలో మెదిలిన సందేహం. ఏపీ ప్రజలతో పాటు దేశ వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో వైసీపీ ఘోర పరాభవాన్ని మూట కట్టుకుంది. కేవలం 11 సీట్లతో సరిపెట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా సొంతం చేసూకోలేకపోయింది. ఈ నేపథ్యంలో గత ఐదేళ్లుగా తమకు అండగా సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు చేసిన జనాలను ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలతో కూడిన వైసీపీ పట్టించుకుంటుందా? అంటే సందేహమే అనేది సోషల్‌ మీడియా టాక్‌.


Also Read: పవన్ పర్సనల్ లైఫ్, పెళ్లిళ్లే టార్గెట్ - వైసీపీ తప్పుల్లో ఇదొకటి, ఆ లాజిక్ ఎలా మిస్ అయ్యారబ్బా


'పేటీఎం బ్యాచ్' అంటే కొందరికి కోపం రావచ్చు. కానీ, ఆల్రెడీ సోషల్ మీడియాలో వైసీపీ కోసం ఐదేళ్లుగా అందర్నీ నానా మాటలు అన్న వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉందట. కనీసం డిఫెండ్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొందరు అయితే ఫ్రస్ట్రేషన్ అవ్వడమే కాదు... సజ్జల తండ్రి కొడుకులను బూతులు తిడుతున్న వీడియోలు వైరల్‌ అవుతున్నాయి. జగన్ మీద అభిమానంతో ఇతరుల్ని తిట్టినా, డబ్బులు తీసుకుని తిట్టినా... జగన్ మీద ప్రజల్లో పెల్లుబికిన ఈ తీవ్ర వ్యతిరేకత, ఘోర ఓటమి నేపథ్యంలో దిక్కుతోచని దిశకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందట. వైసీపీ గాలి తీవ్రస్థాయిలో వీచిన 2019 ఎన్నికల్లో తెలుగుదేశానికి 23 సీట్లు వచ్చాయి. ఇప్పుడు వైసీపీకి అందులో సగం కూడా రాలేదు. 


ఇన్నాళ్లు డబ్బులు తీసుకుని సోషల్ మీడియాలో సపోర్ట్ చేసిన వాళ్ళు ప్లేట్ తిప్పేస్తే? వైసీపీ తట్టుకోగలదా? రాజకీయ నాయకుల్లో జంప్ జిలానీలు ఉన్నట్టు, వాళ్లలోనూ జంప్ జిలానీలు వుంటే? పవన్ కల్యాణ్ రెండు చోట్ల ఓడినా సరే ఆయన కోసం సోషల్ మీడియాలో అభిమాన సైన్యం అండగా వుంది. అటువంటి సైన్యం జగన్ మోహన్ రెడ్డికి వుంటుందా? వెయిట్ అండ్ సి.


Also Readపవన్ కోట్లలో ఒక్కడు... అప్పుడు త్రివిక్రమ్ చెబితే వైసీపీకి అర్థం కాలేదు, ఇప్పుడు ఘోరంగా బోల్తా కొట్టింది