టాలీవుడ్ లో మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు గోపీచంద్. తన కెరీర్ లో ఎన్నో హిట్టు సినిమాల్లో నటించారు. కమర్షియల్ సినిమాలతో పాటు మధ్య 'సాహసం' లాంటి ప్రయోగాత్మక సినిమాలు కూడా తీశారు. ఇప్పుడు ఆయన నటించిన 'పక్కా కమర్షియల్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు గోపీచంద్. ఈ క్రమంలో కొన్ని ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు.
గోపీచంద్ తండ్రి టి.కృష్ణ పెద్ద దర్శకుడు. ఆయన కొన్ని సినిమాలే తీసినా.. సినీ చరిత్రలో నిలిచిపోయే సినిమాలు చేశారు. మరి ఆయన కొడుకుగా గోపీచంద్ డైరెక్షన్ ఎందుకు ట్రై చేయలేదు..? దర్శకత్వంపై ఆయన ఆలోచన ఏంటి..? అనే విషయాలను వెల్లడించారు. తనకు డైరెక్షన్ కి సంబంధించి అన్ని విషయాలు తెలుసని అంటున్నారు ఈ హీరో. కానీ మెగా ఫోన్ మాత్రం పట్టనంటున్నారు.
దర్శకత్వంకి సంబంధించిన అన్ని విషయాలు తెలిసినప్పటికీ.. ఫుల్ మూవీ చేయాలంటే చాలా బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుందని.. దానికి కోసం చాలా ప్రిపేర్ అవ్వాలని.. తను అంత చేయలేనని అన్నారు గోపీచంద్. పైగా డైరెక్షన్ అనేది ప్రాక్టికల్ గా తనకు రాదని.. రాని విషయాన్ని అనవసరంగా కెలకడం ఎందుకు..? అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నటుడిగా చాలా బిజీగా ఉన్నానని.. దర్శకత్వం చేయడంకంటే నటించడం తనకు ఈజీ అని.. ఫ్యూచర్ లో యాక్టింగ్ లోనే కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తానని అన్నారు. అంతేకానీ డైరెక్షన్ జోలికి మాత్రం వెళ్లనంటున్నారు.
గోపీచంద్ నటించిన 'పక్కా కమర్షియల్' సినిమాను మారుతి డైరెక్ట్ చేశారు. రేపే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. రాశిఖన్నా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే విధంగా ఈ సినిమాను రూపొందించారు.
Also Read : నెట్‌ఫ్లిక్స్‌లో అడివి శేష్ 'మేజర్' - మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ ఓటీటీ రిలీజ్ ఎప్పుడంటే?
Also Read : మేనకోడల్ని నిర్మాతగా పరిచయం చేస్తున్న అల్లు అరవింద్ - కొత్త సినిమా షురూ