Stock Market @ 12 PM 30 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) గురువారం రేంజ్‌ బౌండ్‌లో కొనసాగుతున్నాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 10 పాయింట్ల నష్టంతో 15,786, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 34 పాయింట్ల లాభంతో 53,065 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 53,026  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,897 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,897 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 53,377 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో 34 పాయింట్ల లాభంతో 53,065 వద్ద కొనసాగుతోంది.


NSE Nifty


బుధవారం 15,799 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గురువారం 15,774 వద్ద ఓపెనైంది. 15,765 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,890 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 10 పాయింట్ల నష్టంతో 15,786 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ లాభాల్లో ఉంది. ఉదయం 33,180 వద్ద మొదలైంది. 33,179 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,659 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 151 పాయింట్ల లాభంతో 33,421 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 17 కంపెనీలు లాభాల్లో 32 నష్టాల్లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ లైఫ్, ఎస్‌బీఐ షేర్లు లాభాల్లో ఉన్నాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, సిప్లా, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, టెక్‌ మహీంద్రా షేర్లు నష్టాల్లో ఉన్నాయి. రియాల్టీ 2.18, మెటల్‌ 1.37 శాతానికి పైగా పతనం అయ్యాయి. ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, ఫార్మా సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మీడియా, కన్జూమర్‌ డ్యురబుల్స్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ స్వల్ప లాభాల్లో ట్రేడ్‌ అవుతున్నాయి.