Stock Market Opening Bell 29 June 2022: భారత స్టాక్‌ మార్కెట్లు (Indian equity markets) బుధవారం భారీ నష్టాల్లోనే మొదలయ్యాయి. ఆసియా, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందడం లేదు. రూపాయి విలువ పడిపోతుండటంతో మదుపర్లలో ఆత్మవిశ్వాసం తగ్గుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ (NSE Nifty) 90 పాయింట్ల నష్టంతో 15,752, బీఎస్‌ఈ సెన్సెక్స్‌ (BSE Sensex) 292 పాయింట్ల నష్టంతో 52,881 వద్ద కొనసాగుతున్నాయి.


BSE Sensex


క్రితం సెషన్లో 53,177  వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 52,623 వద్ద భారీ గ్యాప్‌డౌన్‌తో మొదలైంది. 52,612 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 52,973 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ఉదయం 10:30 గంటలకు 292 పాయింట్ల నష్టంతో 52,881 వద్ద కొనసాగుతోంది. మంగళవారం సైతం సూచీ గ్యాప్‌డౌన్‌తోనే ఓపెనవ్వడం గమనార్హం.


NSE Nifty


మంగళవారం 15,850 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ బుధవారం 15,701 వద్ద ఓపెనైంది. 15,687 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని చేరుకుంది. 15,787 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 90 పాయింట్ల నష్టంతో 15,752 వద్ద కొనసాగుతోంది.


Nifty Bank


నిఫ్టీ బ్యాంక్‌ నష్టాల్లో ఉంది. ఉదయం 33,273 వద్ద మొదలైంది. 33,185 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. 33,342 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని అందుకుంది. ప్రస్తుతం 368 పాయింట్ల నష్టంతో 33,274 వద్ద ట్రేడ్‌ అవుతోంది.


Gainers and Lossers


నిఫ్టీ 50లో 9 కంపెనీలు లాభాల్లో 41 నష్టాల్లో ఉన్నాయి. గ్రాసిమ్‌, రిలయన్స్‌, అల్ట్రాటెక్‌ సెమ్‌, టాటా స్టీల్‌, హీరోమోటో షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, హిందుస్థాన్‌ యునీలివర్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, సిప్లా, టైటాన్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. దాదాపుగా మేజర్‌ సూచీలన్నీ నష్టాల్లోనే ఉన్నాయి. మీడియా, ఆయిల్‌ అండ్ గ్యాస్‌ మినహా మిగతా సూచీలన్నీ పతనం అవుతున్నాయి. కన్జూమర్‌ డ్యురబుల్స్‌, హెల్త్‌కేర్‌, బ్యాంకు, ఎఫ్‌ఎంసీజీ షేర్లను ఎక్కువగా అమ్ముతున్నారు.