ఆకట్టుకుంటున్న ట్రైలర్


కన్నడ భామ ర‌ష్మిక మందాన వరుస సినిమాలో దూసుకుపోతుంది. సౌత్ టు నార్త్ అన్ని భాషాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటున్నది. ఛలో సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన ఈ అమ్మడు తక్కువ సమయంలో టాప్ హీరోయిన్ గా ఎదిగింది. దక్షిణాదిన సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో కలిసి ‘గుడ్ బై’ అనే సినిమాలో నటించింది. వికాస్‌ బహల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా  విడుదలకు రెడీ అవుతోంది. అక్టోబర్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయ్యింది.    



ఇష్టమా? సాంప్రదాయమా?


తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ లో  కట్టుబాట్లు, ఆచారాలు అనుసరించే తండ్రిగా అమితాబ్ బచ్చన్ కనిపించారు. రష్మిక వాటిని  పూర్తిగా వ్యతికేరించే కూతురిగా కనపడింది. గుడ్‌బై సినిమా ఒక ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కింది. తల్లి అంత్యక్రియలు ఎలా చేయాలన్న విషయంలో కుటుంబ సభ్యుల మధ్య జరిగే గొడవలను కథాంశంగా తీసుకుని ఈ సినిమా తీసినట్లు అర్థమవుతుంది. ఈ సినిమాలో రష్మిక పేరెంట్స్ పాత్రల్లో అమితాబ్‌, నీనా గుప్తా యాక్ట్ చేశారు. తన తల్లి అంత్యక్రియలు జరగాల్సింది ఇలా కాదు.. ఆమె కోరుకున్నది వేరు అంటూ తండ్రితో కూతురు వాదనకు దిగుతుంది. వేల ఏళ్లుగా వస్తున్న సాంప్రదాయాన్ని పాటించాలని అమితాబ్ జవాబు చెప్తారు. అయినా, ఇది బర్త్‌డే కాదు ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలనుకుంటున్నారు అని అడిగి చేయడానికి అని ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఆద్యంతం ఇద్దరి మధ్య వాదోపవాదాలు నడుస్తాయి. ఓ మనిషి అంత్యక్రియల సమయంలో వాళ్ల ఇష్టాయిష్టాలను చూడాలా? లేదంటే  సాంప్రదాయం చూడాలా? అనే విషయాన్ని ఈ ట్రైలర్‌లో చూపించారు. నవ్విస్తూనే గుండె బరువెక్కించే సన్నివేశాలు, డైలాగులు ఈ ట్రైలర్‌లో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎమోషన్ తో కూడిన ఈ సినిమాను శోభా క‌పూర్, ఏక్తా క‌పూర్‌లు నిర్మించారు. ఈ చిత్రం అక్టోబ‌ర్ 7న విడుద‌ల కానుంది.


వరుస సినిమాలు చేస్తున్న రష్మిక


రష్మిక ఈ సినిమా తర్వాత సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి ‘మిషన్‌ మజ్నూ’ అనే సినిమాలో నటిస్తున్నది. అనంతరం అర్జున్‌ రెడ్డి ఫేమ్‌ సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యానిమల్‌’ మూవీలో రణ్‌బీర్‌ కపూర్‌ సరసన నటిస్తోంది.