కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్ట్రెయిట్ గా తెలుగులో సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. ముందుగా శేఖర్ కమ్ముల సినిమా సైన్ చేశారు. కానీ ఆ సినిమా షూటింగ్ ఆలస్యం కానుంది. రీసెంట్ గా వెంకీ అట్లూరికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ధనుష్.. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్ మొదలుపెట్టారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకి 'సార్' అనే టైటిల్ పెట్టగా.. తమిళంలో 'వాతి' అని పెట్టారు.
తాజాగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ సోషల్ మీడియాలో ప్రీలుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. క్లాస్ గా టక్ చేసుకొని సైడ్ కి తిరిగి చూస్తున్నట్టు ఉన్న ధనుష్ ప్రీలుక్ ఆకట్టుకుంటోంది. చూస్తుంటే.. 'సార్' క్లాసులు తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఉన్నారు. ఇందులో ధనుష్ జూనియర్ కాలేజ్ లెక్చరర్ గా కనిపించనున్నారు.
ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంయుక్తా మీనన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. కోలీవుడ్ లో ఎన్నో హిట్ సినిమాలకు పని చేసిన దినేష్ కృష్ణన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.
తెలుగులో ధనుష్ నటిస్తోన్న తొలి తెలుగు సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటికే ధనుష్ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇప్పుడు స్ట్రెయిట్ గా తెలుగులో ఎంట్రీ ఇస్తుండడంతో.. మంచి బజ్ క్రియేట్ అయింది.
Also Read: కోవిడ్ పాజిటివ్ వైఫ్.. నితిన్ బర్త్ డే ఎలా సెలబ్రేట్ చేశాడో చూశారా..?
Also Read: 'హృదయమా' ఫస్ట్ సింగిల్.. రిలీజ్ చేసిన మహేష్ బాబు..
Also Read: టికెట్ ధరల పెంపుపై నాగార్జున స్పందన.. అలా అనేశారేంటీ? నిర్మాతలకు షాకే!
Also Read: ఆర్జీవీ ట్విట్టర్ కౌంటర్స్.. ఇక కలిసే మాట్లాడుకుందామని చెప్పిన మంత్రి పేర్ని నాని.. కానీ..
Also Read: కొడాలి నాని ఎవరో తెలియదు.. నాచురల్ స్టార్ నానీ ఒక్కడే తెలుసు! ఆర్జీవీ రివర్స్ పంచ్ రేంజే వేరు
Also Read: ‘అన్‌స్టాపబుల్ విత్ NBK’ అదిరిపోయే రికార్డ్, బాలకృష్ణ ఎక్కడా తగ్గట్లేదుగా..