లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా 'విక్రమ్'. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను రూపొందించారు. విజయ్ సేతుపతి, ఫహద్ ఫాజిల్ వంటి తారలు నటించిన ఈ సినిమా జూన్ 3న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి అన్ని చోట్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. తెలుగులో ఈ సినిమాను శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి రిలీజ్ చేశారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాను ప్రదర్శిస్తోన్న ఓ థియేటర్లో మంటలు చెలరేగాయి. 


దానికి కారణం సూర్య అభిమానులే అనే మాటలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో సూర్య గెస్ట్ రోల్ లో కనిపించారు. ఆయన ఎంట్రీ సీన్ చాలా టెరిఫిక్ గా ఉంటుంది. సరిగ్గా పుదుచ్చేరిలోని జయ థియేటర్‌లో సూర్య ఎంట్రీ సీన్‌ వచ్చినప్పుడే అగ్గి రాజుకుంది. అది నెమ్మదిగా స్క్రీన్‌ అంతటా వ్యాపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  


థియేటర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా మంటలు అంటుకున్నాయని కొందరు అంటుంటే సూర్య ఫ్యాన్స్‌ పటాసులు పేల్చడం వల్లే ఆ ప్రమాదం చోటుచేసుకుందని మరికొందరు అంటున్నారు. మరి దీనిపై థియేటర్ యాజమాన్యాలు స్పందిస్తాయేమో చూడాలి!


రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ ఈ సినిమాను నిర్మించారు. శివాని నారాయణన్, కాళిదాస్ జయరామ్, అర్జున్ దాస్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. అనిరుద్ ఈ సినిమాకి సంగీతం అందించారు. కమల్ కెరీర్లో 232వ సినిమా ఇది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'విక్రమ్3' ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. 


Also Read: మా సినిమా బ్రాహ్మణుల మనోభావాలను కించపరిచేలా ఉండదు - 'అంటే సుందరానికీ' దర్శకుడు వివేక్ ఆత్రేయ


Also Read: రోలెక్స్ సర్ కి రోలెక్స్ గిఫ్ట్ ఇచ్చిన కమల్ - రేటెంతో తెలుసా?