మాస్ కా దాస్ విష్వక్ సేన్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్‌ను నిర్మాతలు లాంచ్ చేశారు. ప్రముఖ కన్నడ హీరో కిచ్చా సుదీప్ తల్లి మరణించారు. దుల్కర్ సల్మాన్ ‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ను నిర్మాతలు రేపు లాంచ్ చేయనున్నారు. ఆది సాయికుమార్ హీరోగా ‘శంభాల’ అనే మిస్టికల్ థ్రిల్లర్ విడుదల కానుంది. బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పిస్తా హౌస్ రెస్టారెంట్‌లో ఫుడ్ టేస్ట్ చేశారు.


ఫుల్ మాస్‌గా విష్వక్ ‘మెకానిక్ రాకీ’ ట్రైలర్!
మాస్ కా దాస్ విష్వక్ సేన్ ప్రస్తుతం ‘మెకానిక్ రాకీ’ అనే సినిమాలో నటిస్తున్నారు. నవంబర్ 22వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. విష్వక్ సేన్ సరసన మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ జంటగా నటిస్తున్నారు. రవితేజ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎస్ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘సరిపోదా శనివారం’ సినిమాకు బ్లాక్‌బస్టర్ సాంగ్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన జేక్స్ బిజోయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఇప్పుడు విడుదల చేశారు. దీనికి ట్రైలర్ 1.0 అని పేరు పెట్టారు. దీన్ని బట్టి సినిమా విడుదలకు ముందు మరో ట్రైలర్‌ను రిలీజ్ చేసే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం
కన్నడ నటుడు కిచ్చా సుదీప్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొన్నది. ఆయన తల్లి సరోజా సంజీవ్ చనిపోయారు. 86 ఏళ్ల వయసున్న ఆమె గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. బెంగళూరు జయనగర్‌లోని అపోలోలో ఆసుపత్రిలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ఇవాళ తెల్లవారు జామున పరిస్థితి మరింత విషమించడంతో ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. వయో సంబంధ అనారోగ్య సమస్యలతో ఆమె తుదిశ్వాస విడిచినట్లు వెల్లడించారు. ఆమెను కాపాడేందుకు ప్రత్యేక వైద్యుల బృందం స్పెషల్ కేర్ తీసుకున్నప్పటికీ శరీరం చికిత్సకు సహకరించకపోవడంతో చనిపోయిందన్నారు. అనంతరం ఆమె పార్దివదేహాన్ని హాస్పిటల్ నుంచి జేపీ నగర్ లోని ఇంటికి తీసుకెళ్లారు. ఇవాళ సాయంత్రం ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)



‘లక్కీ భాస్కర్’ ట్రైలర్‌ వచ్చేస్తోంది
మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కాంబోలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’. ఈ చిత్రంలో నార్త్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తున్నది. ఇప్పటికే ఈ సినిమాపై మాంచి బజ్ క్రియేట్ అయ్యింది. త్వరలో  ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ ప్రమోషనల్ కంటెంట్ మూవీపై భారీగా అంచనాలు పెంచాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ న్యూస్ చెప్పారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా 'శంబాల'
ప్రముఖ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, క్రేజీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు యంగ్ హీరో ఆది సాయి కుమార్. ఇప్పటి వరకు ఆయన నటించిన సినిమాలకు పూర్తి భిన్నమైన మరో సినిమాను అనౌన్స్ చేశారు. ఆది, ఆనంది హీరో, హీరోయిన్లుగా తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘శంబాల’ అని పేరు పెట్టారు. యుగంధర్ ముని దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


పిస్తా హౌస్​లో హైదరాబాద్ ఫుడ్ టేస్టీ చేసిన బాలీవుడ్ హీరో
బాలీవుడ్ స్టార్ హీరో కార్తీక్ ఆర్యన్ భాగ్యనగరంలో సందడి చేశారు. ‘భూల్ భూలయ్యా 3‘ సినిమా ప్రమోషన్ కోసం  హైదరాబాద్ కు వచ్చిన ఈ యంగ్ హీరో, పిస్తా హౌస్ కు వెళ్లి ఫుడ్ టేస్ట్ చేశారు. ప్రమోషనల్ ఈవెంట్ తర్వాత, కార్తీక్ తన టీమ్ తో కలిసి గచ్చిబౌలిలోని పిస్తా హౌస్ కు వెళ్లారు. హైదరాబాదీ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ రెస్టారెంట్ లో తనకు ఇష్టమైన ఫుడ్ రుచి చూశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)