AP MLC Elections TDP announces candidates for MLC Elections | అమరావతి: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార కూటమి పార్టీ టీడీపీ అభ్యర్థులను ప్రకటించింది. పశ్చిమ తూర్పుగోదావరి ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పేరబత్తుల రాజశేఖరం, కృష్ణా గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను ఓ ప్రకటనలో తెలిపారు.
గతంలో జరిగిన మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో టీడీపీ ప్రభంజనం మొదలైంది. ఇటు ఉత్తరాంధ్రతో పాటు అటు సీమ జిల్లాల్లోనూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ మద్దతు తెలిపిన అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఏపీలో విద్యావంతుల నాడీ అదేనని టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో చెప్పడం సంచలనమైంది. అయితే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు, సార్వత్రిక ఎన్నికల ఫలితాలకు ఏ పోలికా ఉండదని వైసీపీ గట్టిగా కౌంటర్ ఇచ్చింది. కానీ ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చాక చూస్తే కూటమి పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు దాదాపు క్లీన్ స్వీప్ చేశాయి. 175 స్థానాలకుగానూ 164 స్థానాల్లో కూటమి విజయం సాధించింది.
Also Read: Konaseema Crime News: దళిత యువకుడి హత్యకేసులో ఏ1గా వైసీపీ మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ కుమారుడు