Meghasandesam Serial Today Episode: కింద పడిపోయిన భూమిని తీసుకుని రూంలోకి వెళ్తుంది మీరా. లోపలికి వెళ్తున్న భూమి.. అపూర్వను వెటకారంగా చూస్తుంది. భూమి వచ్చి తనను కొట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది అపూర్వ. శరత్‌చంద్ర మాత్రం శోభాచంద్రను చూస్తుంటాడు. రూంలోకి వెళ్లిన మీరా ఏడుస్తూ వదినా అంటూ భూమిని హగ్ చేసుకుంటుంది.
మీరా: మా వదిన నీ వంట్లోకి వచ్చి నా కాపురం నిలబెట్టింది.
భూమి: నా ఒంట్లోకి రావడం ఏంటి?
మీరా: అవును మా వదిన వచ్చింది. ఆయన లేకపోయినా పర్వాలేదు. పెళ్లి చేసేద్దాం అని మా అపూర్వ వదిన నీ ఒంట్లోకి వచ్చింది. అప్పటికీ అపూర్వ వదిన ఏదేదో మాట్లాడుతుంటే చెంప పగులగొట్టింది.
భూమి: ఏంటి కొట్టిందా?
మీరా: అంటే నీ ద్వారా కొట్టింది.
భూమి: నా ద్వారానా..
మీరా: నీకు తెలియదులే నీ ఒంట్లో మా వదిన ఉంది కాబట్టి నీకెలా తెలుస్తుంది.
భూమి: అవును నాకెలా తెలుస్తుంది. నాకేం తెలియదు.
మీరా: ఇంట్లో ఇంత మంది ఉండగా మా వదిన నీ ఒంట్లోకే వచ్చిందంటే నువ్వుంటే ఎంత ఇష్టమో కదా. నువ్వే కాదు నేనంటే కూడా అంత ఇష్టం. అందుకే నీ ద్వారా నా కాపురాన్ని కూడా నిలబెట్టింది.
భూమి: మీరేం భయపడకండి ఆంటీ అంకుల్ వస్తారు. మీ ఇద్దరి చేతుల మీదుగానే ఇందు పెళ్లి జరగుతుంది.
మీరా: అయినా నువ్వేం చేస్తావు. నీ మాట అపూర్వ వదిన అసలు వినదు కదా.
భూమి: వినకపోతే చెంప పగులుతుంది.
మీరా: ఏంటి నువ్వు కొడతావా?
భూమి: కాదు నేను కాదు. అమ్మ మళ్లీ నా ఒంట్లోకి రావొచ్చు..ఇవాళ కొట్టినట్టే మళ్లీ కొడుతుంది.
అని భూమి చెప్పగానే మీరా అవును నిజమే కదా? అంటూ నాకు ఇంత సాయం చేసిన ఆ వదినకు ఒక ముద్దు పెట్టాలి అని భూమిని ముద్దు పెట్టుకుని వెళ్లిపోతుంది. మరోవైపు భూమి కొట్టిందని బాధపడుతున్న అపూర్వ దగ్గరకు శరత్‌చంద్ర వస్తాడు.
శరత్: అపూర్వ ఎంటి అలా ఉన్నావు..?
అపూర్వ: ఎలా ఉన్నావని అడుగుతావేంటి? బావ. భూమి నన్ను కొట్టింది. నా బావ ముందు. నా నట్టింట్లో..
శరత్: కొట్టింది భూమి కాదు శోభ. అవును నా శోభ ఈ ఇంటి పరువు పోవడం ఇష్టం లేకే కొట్టింది.
అపూర్వ: అయ్యో అది నాటకాలు ఆడటమేంటి? బావ. అది అందరి ముందు నన్ను కొట్టి నా పరువు తీసింది.
శరత్: లేదు శోభ వచ్చింది. శోభ కొట్టింది. అపూర్వ శోభ రాలేదని మాత్రం అనకు నాకు బాధగా ఉంది.
అపూర్వ: అంత నమ్మకం ఏంటి బావా నీకు..
శరత్: నన్ను చంద్రా అని పిలిచేది. ఆ విషయం నీకు తెలుసు కదా? అందుకే భూమి ఒంట్లోకి శోభ వచ్చిందని నేను నమ్ముతున్నాను.
అని చెప్పగానే అపూర్వ బాధపడుతుంది. ఇన్ని తెలుసుకున్న దానికి ఆ విషయం తెలుసుకోవడం పెద్దవిషయం కాదు అనుకుంటుంది. ఇదంతా భూమి ఆడుతున్న నాటకం అని అపూర్వ అంటే అపూర్వను తిట్టి వెల్లిపోతాడు శరత్ చంద్ర. మరోవైపు చెర్రి ప్రసాద్ కోసం వెతుకుతుంటాడు. శారదకు ఫోన్ చేసి ఏం జరిగిందని అడుగుతాడు. గుడిలో జరిగిన విషయం చెప్తుంది శారద. దీంతో చెర్రి కోప్పడతాడు. అన్నయ్యకు తెలిస్తే దాన్ని చంపేస్తాడని అంటాడు. గగన్‌కు చెప్పొద్దని శారద చెప్తుంది. తర్వాత ప్రసాద్ ఫుల్లుగా తాగి గగన్ కారుకు ఎదురు వెళ్లి కింద పడిపోతాడు. గగన్ వచ్చి ప్రసాద్‌ను పైకి లేపుతాడు.
ప్రసాద్: హలో నా కొడుకులా ఉన్నావు.. కాదులే నా కొడుకైతే కారు ఎక్కించి అవతలికి పోయి ఉన్నాన్నా పోయానా అని చూస్తాడు. వాడికి నేనంటే అంత కోపం అయినా కొడుక్కి ప్రేమ ఉండాలి కానీ కోపం ఎందుకు అనుకుంటున్నావా? బాబు వాడు మంచోడే.. అంతా నా తలరాత.
అంటూ తాగిన మైకంలో శారదకు గుడిలో జరిగిన అవమానం గురించి చెప్పబోతుంటే చెర్రి వస్తాడు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!